29, అక్టోబర్ 2013, మంగళవారం

రెంటికి చెడ్డ రేవడి


ప్రస్తుతం కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వ్యతిరేకతను ఎదుర్కుంటోంది.   బెంగాల్ నుంచి కేరళ వరకు వున్న అన్ని తీర ప్రాంత రాష్ట్రాలలో పార్టీ పరిస్తితి ఏ మాత్రం బాగా లేదు.   పశ్చిమ బెంగాల్ లో అధికారం లోకి వచ్చి 3 దశాబ్దాలు దాటింది.   ఒరిస్సాలో అసలు కాంగ్రెస్ను పట్టించుకొనే వారే లేరు.   గుజరాత్ లో పరిస్తితి మరీ ఘోరం.   ప్రతిపక్షమే కనుమరుగవుతోంది.    తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ నాలుగో స్థానంలో వుంది.  మహారాష్ట్రలో పొత్తు లేకుండా గెలిచే ప్రసక్తే లేదు.   కర్ణాటకలో భాజపా స్వయంకృత అపరాధం వలన కాంగ్రెస్ ఈ సారి గెలిచింది.    యద్యురప్ప, శ్రీరాములు, రెడ్డి బ్రదర్స్ భాజపా లో చేరడం ఖాయంగా కనిపిస్తున్న తరుణంలో ఈ సారి వోట్ల చీలిక గతంలో లాగా ఉండక పోవచ్చు. గుడ్డిలో మెల్లగా  ఇప్పుడు కేరళలో మాత్రం బ్రతికుంది. 


అద్భుతమైన పట్టున్న ఆంద్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్తితి శ్లేష్మంలో పడ్డ ఈగను తలపిస్తోంది.  కనీసం తెలంగాణలో అన్నా 15 సీట్లు వస్తాయని విభజన నిర్ణయం తీసుకుంటే, ఇప్పుడేమో తెరాసా వారు మాకు కాంగ్రెస్తో పొత్తు వుండదు, విలీనం చెయ్యం అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.   కాంగ్రెస్, తెదేపా-భాజపా, తెరాస, కమ్యునిస్టులు, ఎమ్మార్పీస్  ఎవరిపాటికి వారు పోటీ చేస్తే, కాంగ్రెస్ కు దక్కేది  మూడు లేక నాలుగు సీట్లు మాత్రమే.   బుల్లి తెర వీరులు విహెచ్, పాల్వాయ్, డి ఎస్ లాంటి వారు ప్రచారం చేస్తే, చింతకాయలు కూడా రాలవు,  వోట్లు ఎక్కడ నుంచి వస్తాయి.  తెలంగాణా రావడానికి కారణం తెరాస/కచరా మాత్రమే.   విధి లేని పరిస్తితులలో కాంగ్రెస్ అంగీకరించింది. ఇచ్చింది మేమే -  తెచ్చింది మేమే అనే నినాదం కన్నా అసలు నస మొదలు పెట్టింది మేమే అనే తెరాసా వైపే నాలుగు జిల్లాల ప్రజలు మొగ్గు చూపుతారు.   పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి టెన్ జనపధ్ ముందు చేతులు కట్టుకొని నుంచోడానికి కచరా ఏమన్నా చిరంజీవా?  తెలంగాణలో ముఖ్య మంత్రి పదవిని అధిష్టించడానికి ఎప్పుడు బస్సుల మీద ఒక్క రాయి కూడా విసరని, కనీసం  ఎవరిమీదా నోరు, చెయ్యి చేసుకోని షబ్బీర్ అలీ దగ్గర నుండి, జైపాల్ రెడ్డి వరకు కనీసం  10 మంది కాంగ్రెస్ నుంచి  క్యూ లో వున్నారు.   శత కోటి లింగాలలో బోడి లింగం లాగా అవడానికి కచరా ఎప్పటికీ అంగీరించడు.    


ఇహ తీర సీమాన్ధ్రలో కిరణ్ గారు కొత్త పార్టీ పెడితే, తెదేపా గెలుపు ఖాయం.   సంప్రదాయ కాంగ్రెస్ వోట్లు కిరణ్ గారికి జగన్కు మధ్య చీలిపోయి తెదేపా పంట పండే అవకాశం వుంది.    కాంగ్రెస్ పరిస్తితి తమిళ్ నాడు కన్నా ఇక్కడ అద్వాన్నంగా తయారైంది.  తెలంగాణలో ముఖ్యమంత్రి పదవికి 10 మంది పోటీదారులు వుంటే, తీర ఆంధ్ర ప్రదేశ్ లో బోలెడు మంది కాంట్రాక్టర్లు ముందున్నారు.   ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఎవడో ఒక కాంట్రాక్టర్ లేకపోతే సినిమా యాక్టర్ ముఖ్యమంత్రి అవడం ఖాయం.    


కాంగ్రెస్ పెద్దలు తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి మొదటి నుండి వెన్నుదన్నుగా వున్న ఆంద్ర ప్రదేశ్ లో పరిస్తితి రెంటికి చెడ్డ రేవడిగా తయారైంది.   

4 కామెంట్‌లు :

  1. అన్నయ్య
    ఎది ఎమిన కాంగ్రెస్ మళ్ళీ అధికారం లోకి రావడం ఖాయం ..సామ వేద దండో పాయలు ఉన్నాయి దానికి. ఇప్పుదు కాగితం వోట్లు కూడ కాదుగా, Electronic వోట్లు ..ఎదైన చెయ్యొచు

    మన బతుకులు అంతే..ఎవరు బాగు పర్చలేరు

    రిప్లయితొలగించండి
  2. మీ చల్లని మాటలు నిజమై కాంగ్రెస్ ఈసారి గద్దె దిగిపోతే అంతకంటే శుభవార్త ఉంటుందా? ఒకే పార్టీకి 10 సంవత్సరాలు ఇచ్చాం. ఇక చాలు, వేరేవాల్లకి అవకాశం ఇవ్వాలి ఇంక.

    రిప్లయితొలగించండి
  3. andhralo congress kuditilo yeluka pilla. totalgaa post adubutamgaa undi
    http://www.googlefacebook.info/

    రిప్లయితొలగించండి
  4. నేను మరొక రకం విశ్లేషణ చదివాను. అక్కడ ఉత్తరాదిన కనీసం పరువయినా నిలబడిన పక్షంలోనే తెలంగాణా ని మరికొంచెం ముందుకు తీసుకెళ్తారు తప్ప అక్కడ చంక నాకి పోతే లోక్ సభలో బిల్లు పెట్టి తెరాసా కచరాకి హుషారూ తమకి చిరాకూ తెప్పించే పని చెయ్యరని.

    యెటూ కచరా గారు విలీనం చెయ్యనని బయట పడిపోయాడు గాబట్టి ముఖం మీదే నువ్వు తెరాసని విలీనం చేస్తానంటేనే గదా విభజన మొదలెట్టింది, నువ్వు మాట తప్పితే మేమూ మాట తప్పాం, యేం తప్పా అని అడిగితే గులాబీ నేత యే గర్జనలు చెయ్యగలడింక?

    విభజన ప్రకటన యెలా జరిగిందో గుర్తుందా? తొమ్మిదేళ్ళుగా జరిగిన తెలంగాణా ఉద్యమాన్ని గురించి యే ప్రస్తావనా లేదు. తెలంగాణా ప్రజల ఆకాంక్షల్ని గురించి గానీ ఆత్మ బలిదానం చేసుకున్న కుర్రవాళ్ళ గురించి మెచ్చుకోలుగా ఒక్క సెంటిమెంటుతో కూడిన మాట లేదు.హఠాత్తుగా పత్రికల వాళ్ళని పిలిచి ఒక పెడసరపు మాట చెప్పేశాడు. గట్టిగా పత్రికల వాళ్ళు అడిగితే - "రాష్ట్రాన్ని విడగొట్టి ఇస్తే తెరాసని కాంగ్రెసులో కలిపేస్తానని కచరా వాగుదానం చేశాడు గాబట్టి ఇస్తున్నాం" అనే మరొక నీచమయిన మాట మాట్లాడాదు. యెక్కడా తెలంగణా ఉద్యమం పట్ల ఒక్క మంచి మాట లేదు.

    ప్రపంచంలో న్యాయం కోసం చాలా మంది పోరాడి చాలా గౌరవమయిన పధ్ధతి లో సగర్వంగా సాధించుకున్నారు తప్ప ఇంత దిక్కుమాలిన ప్ధతిలో సాధించుకుంటూ కూడా సంబరపడుతున్న వాళ్ళు అనంత కాల చరిత్రలో నాకెక్కడా కనపడ్లేదు.మీరు చదివిన చరిత్రల్లో యెక్కదయినా ఉందేమో వెతికి చెప్పండి.

    రాష్ట్రం విడిపోవటంలో తెలంగాణా ఉద్యమ ప్రమేయం యేమీ లేదు,సమైక్యంగా ఉంటే(పై విశ్లేషణ నిజమయ్యి) దానికి సమైక్య ఉద్యమ ప్రమేయమూ ఉండదు. ఇక్కడ యీన్ని సీట్లు గెలుస్తాం అనే కాకిలెక్కలూ, యెక్కడో ఉత్తారాదిన జరిగే యెన్నికల ఫలితాలూ మన రాష్త్ర భవిష్యత్తుని శాసించబోతున్నాయి.

    చారిత్రకంగా దేశంలో జరిగిన అన్ని విశేష సంఘటనల్లోనూ ప్రముఖ పాత్ర నిర్వహించిన ఖ్యాతి గల ఆంధ్ర జాతి నేడెంత దుస్థితికి దిగజారింది. ఆలోచించిన కొద్దీ నిర్వేదం బరువు పెరగి పొతున్నది. మళ్ళీ - 'అమరావతీ సీమలోన దిగ్జయ స్థంభమెత్తించునాడు ' అనే స్పూర్తి చూడలేము గదా!

    బుధ్ధిమంతు లంతా ఆలోచించండి:

    యేది సత్యం యేద సత్యం
    ఓ మహాత్మా ఓ మహర్షీ!

    యేది గెలుపు యేది ఓటమి
    యేది తెలుపు యేది నలుపు
    యేది పాపం యేది పుణ్యం
    యేది నీతి యది నేతి

    ఓ మహాత్మా ఓ మహర్షీ!!!

    రిప్లయితొలగించండి