26, సెప్టెంబర్ 2013, గురువారం

అరిచే డిగ్గీ కరవడు


ఏదో ఒక విమానాశ్రయంలో డిగ్గీ విలేకరులను పలకరిస్తుంటాడు.  మాట్లాడిన ప్రతి సారి బిల్లు రెడి, విభజన ఖాయం భౌ భౌ అని చెప్పి వెళ్లి పోతాడు.  

ఒక పక్క చంద్ర బాబును భాజపా ప్రసన్నం చేసుకోగా జగన్ బాబును  కాంగ్రెస్ దువ్వేసింది.   వీళ్ళిద్దరూ పచ్చి సమైక్య వాదులు.   చంద్ర బాబు కన్నా, జగన్కె హైదరాబాదు లో ఆస్తులు ఎక్కువ వున్నాయి.   అలాంటి జగన్ హైదరాబాదు ను వదులుకొని తెలంగాణా ఇచ్చెయ్యండి, నేను మీకే మద్దతు ఇస్తా అని అనడు.   పార్లమెంటులో 18 శాతం ఎంపీ సీట్లు దక్షిణ భారత దేశంలో వున్నాయి.    దేశంలోనే బలమైన ప్రాంతీయ పార్టీలు మొట్ట మొదటి నుండి ఇక్కడే వున్నాయి.   అలాంటి పరిస్తితులలో తెలంగాణా ఎక్కడి నుండి ఇస్తారు. 

భాజపా మద్దతు లేకుండా బిల్లు ప్రవేశ పెట్ట లేరు.   ఇప్పటికే, భాజపా నేతలు తెలంగాణా పై సన్నాయి నొక్కులు మొదలు పెట్టారు.   ముందు సీమంద్రుల ఉద్యమ వివరాలు వాళ్ళ కోర్కెలు కనుక్కోండి ఆ తరువాత బిల్లు పెట్టండి.   మేము చూడు 3 రాష్ట్రాలు కిషన్ రెడ్డి చెప్పినట్లు 30 నిమిషాలలో ఇచ్చాము (వేరుపడిన రాష్ట్రం రాజధాని కోరలేదన్న సంగతి వీళ్ళు అడగరు - వాళ్ళు చెప్పరు) ఎంత ప్రశాంతంగా వుందో!  మీరు అలాంటి ప్రతిపాదనతోనే సావకాశంగా చర్చించి బిల్లు పెట్టండి, మేము ఇంకా ఇక్కడ బతికి వున్నది కేవలం తెలంగాణా రాష్ట్రాన్ని విడగొట్టదానికే అని సెలవిస్తారు.   అసలు కాంగ్రెస్ కు కావలసింది కూడా అదే.   ఇచ్చి నట్లు వుండాలి కాని ఇవ్వకూడదు.   

చివరకు మింగలేక కక్కలేక అవస్త పడేది కేవలం కె సి ఆర్ మాత్రమె.   సొంతంగా పోటీ చేస్తే మహా అయితే ఒక 20 మంది ఎం ఎల్ ఎ లు ఇద్దరు ఎం పీ లు గెలుస్తారు.  కొంత కాలానికి విసుగొచ్చి కాంగ్రెస్లో కలుస్తారు.  సీమ లో జగన్ తీర ప్రాంతంలో బాబు గెలుస్తారు.   బాబు గారు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు అవడం ఖాయం.   సీమాంధ్ర ప్రజలకు కూడా ఈ రెండు పార్టీలు తప్ప వేరే దిక్కు లేదు.   .    

తెలంగాణలో ఎలా అయితే సమైక్య వాదులున్నారో, కోస్తా ప్రాంతంలో కూడా కొంత మంది ప్రత్యెక రాష్ట్ర వాదులున్నారు. అసలు కె సి ఆర్ కు తెలంగాణా రావడం ఇష్టం ఉన్నట్లయితే, తనే వ్యక్తీగతంగా ఇరు ప్రాంతాలలో మేధావులను కూడగట్టి ఇచ్చి పుచ్చుకునే ధోరణిని అవలంబించేవారు.   అప్పటికే రాష్ట్రం వచ్చినట్లు, తనే కాబోయే ముఖ్యమంత్రిగా ఊహించుకొని కొద్దిమంది ఐ ఎ ఎస్ లతో సమీక్షలు కూడా చేసారు.   ఆ తరువాత, నో ఆప్షన్స్, కర్రీ పాయంట్ (ఈయనకు వాస్తవానికి తెలంగాణలో వర్రీ పాయంట్) బస్సుల మీద దాడులు, యూనివర్సిటీ అని పిలవబడే ఒక సత్రం లోని చిన్న పిల్లల చేత "తంతం" అని చెప్పించడం, బుల్లబ్బాయి లాంటి హుందా లేని అసభ్యకర వ్యాఖ్యలతో చప్పట్లు కొట్టించుకోవడం వగైరా వగైరా చిలిపి చేష్టలన్నీ ఆయన రాష్ట్ర విభజన అయిష్టతను చాటుతున్నాయి.   

అందుకే, జనం ఎక్కడ తెలంగానా విషయం మర్చిపొతారొ అని మధ్య మధ్యలో మధ్య ప్రదేశ్ తీసేసిన తాసీల్దారు భౌ భౌ అంటుంటారు.  అంతా సక్రమంగా వుంటే ఆయన్ని ఎవరు పట్టించుకుంటారు.   ఎవరి బాధ వాళ్ళది.

4 కామెంట్‌లు :

  1. నాకు తెలిసి , శ్రీ కృష్ణ కమిట్ నాలుగు ఆప్షన్ ప్రస్తుతం నడుస్తోంది , కాని ఉద్యమాల వల్ల మూడవ ఆప్షన్ కి గవర్నమెంట్ వెడుతుంది. అది ఆమోదయోగ్యం ఎవరికీ కాదు

    విధి లేని పరిస్తితులలో ఆరవ ఆప్షన్ అంటారు.

    శ్రీ కృష్ణ కమిటీ ఏడవ ఆప్షన్ చెప్పలేదు

    - అది రాష్ట్రాన్ని పది సంవత్సరాల కలసి ఉంది , కొత్త కాపిటల్ నిర్మించుకొని (రెండవ రాజధాని) విడి పోవటమే.
    అప్పటికి జనాభా కూడా పదకొండు కోట్లు దాతుంది

    రిప్లయితొలగించండి
  2. Chinna savarana ka cha ra vi chilipi chestalu ani meeru muddugaa antunnaaru. Daanne vekili chestalu antanu nenu.abhyantarama? mari
    kacha ra family worry point modalu pettadaniki inka entha kaalam pattachu antaaru.....ac car lo thirigi bathukammalu aade kavithamma alisi pothundani oka worry...thussumane seematapakayalaargaa pele koduku emothaado ani I ko worry....razaakaarla vaarasatwam ga rowdeeisanni chalaainche alludu chethi kindiki dooresthaadani inko worry......inka ilaage inni worry latho ...worry point......subhasya seeghram.

    రిప్లయితొలగించండి