23, సెప్టెంబర్ 2013, సోమవారం

వేడి పుట్టించని 'చల్ల' వివాదం


బడికి పోక ముందు కాకర కాయలు అని పలికే పిల్లాడు ఉద్యమ బడిలోకి వెళ్ళాక కీకర కాయలు అన్నాడట!  

మనం చల్ల అనే పదాన్ని ఆంద్రోళ్ళు మజ్జిగ అంటారు, మజ్జిగ అనే పదం మజ్జి అనే తమిళ పదం నుంచి వచ్చింది అని శెలవిచ్చారు కె సి ఆర్ గారు.   ఆయనకు తెలుగు భాష మీద, సాహిత్యం మీద నిస్సందేహంగా పట్టు వుంది. అందునా సిద్ధిపేట, పటాన్ చేరు ప్రాంతాలు పద్య కవులకు పుట్టినల్లు.   మల్లినాధ సూరి ఒకప్పుడు పటాన్ చేరు వాసి.   ఇప్పటికీ సిద్దిపేటలో చందోబద్దంగా రాయగల పద్య కవులు పదుల సంఖ్యలో వున్నారు.    కానీ, ఈ విషయంలో కె సి ఆర్ గారు తప్పులో కాలేసారు.   చల్ల అనే పదం కోస్తా ప్రాంతంలో విరివిగా వాడతారు.    తమిళంలో మోర్ అంటే మజ్జిగ.   కన్నడంలో మజ్జిగె అన్నా అదే అర్ధం.    ఇవన్నీ పర్యాయ పదాలు.   తెలుగు భాషలో ఒక పదానికి కనీసం 5-6 పర్యాయ పదాలు వున్నాయి.   చల్ల కొచ్చి ముంత దాయడం అనే సామెత ఏంతో  ప్రాచుర్యంలో వుంది.    

మేము ఆంద్రోల్ల లాగా 'గేదె' అనం, బఱ్ఱె అంటాం అని ఇంకొకరు సెలవిచ్చారు. బఱ్ఱె, బఱ్ఱె గొడ్లు అనే పదం తీర సీమాంధ్ర ప్రాంతంలో వాడే తెలుగు పదం.   యాసల పేరుతో ప్రజలను విడదీయడం వలన తెలుగు ప్రజలకు తీరని నష్టం జరుగుతుంది.     తీర సీమ ప్రాంతంలో కొన్ని వర్గాలు ప్రత్యేక తెలంగాణాకు వ్యతిరేకం కాదు, కానీ కె సి ఆర్ కు వ్యతిరేకం.   ప్రస్తుత తెలంగాణా సమాజానికి కె సి ఆర్ తో పని లేదు.   ఆయన వలన లాభం కన్నా నష్టం ఎక్కువ.   

ఇక సినిమాల విషయాని కొస్తే, రాయలసీమ ఫాక్షనిజాన్ని, తెలంగాణా యాసను  విలన్లకు, గోదావరి యాసను కమేడియన్లకు, శ్రీకాకుళం యాస నౌకర్లకు మాత్రమే పెట్టారు అని విమర్శ. గతంలో వచ్చిన సినిమాలలో ఏంతో మంది విలన్లకు  కృష్ణా, గోదావరి యాసలో డైలాగులు చెప్పించారు.   అప్పట్లో రాజనాల విలన్గా తీర ప్రాంత మాండలికంలో మాట్లాడగా, రమణా  రెడ్డి నెల్లూరు యాసలో డైలాగులు చెప్పేవారు. సినిమా నిర్మాణం కేవలం వ్యాపారం.   బ్రాహ్మణులను ఎగతాళి చేసే సీన్స్ సినిమాలో పెట్టి, ఆ కులం వాళ్ళందరినీ పిరికి పందలుగా చూపించే ప్రయత్నం ఎన్నో సినిమాలలో జరిగింది.   కానీ ఆ సినిమాలన్నీ నిర్మాతలకు కాసుల పంట పండించింది.    నిర్మాతకు కావాలసింది డబ్బు.   అది తెలంగాణాకు చెందిన దిల్ రాజైనా, కోస్తాకు చెందినా రెడ్డి గారైనా.    

మనస్ఫూర్తిగా విడిపోవాలన్న ఉద్దేశం కె సి ఆర్ లో వుంటే, ఇలాంటి మాటలు ఆయన నోటి వెంట రావు.  అమాయక ప్రజలను కొంచం సేపు ఆకట్టుకోవడాని కే సి ఆర్ గారు చేసే తాత్కాలిక ప్రయత్నాలు చెయ్యాల్సిన తరుణం కాదు ఇది.     

12 కామెంట్‌లు :

  1. తెలంగాణా తొందరగా రాకుండా ఉండతానికి యేమేమి చెయ్యాలో కచరాకు బాగా తెలుసు. ఉద్యమం ఫలితమిచ్చి తెలంగాణా విడిపోయిన రెండు సంవత్సరాల లోపు అతను కేవలం తన ఫార్మ్ హౌసుకు మాత్రమే పరిమితమైపోవలసి వొస్తుంది. అతను ఇష్టపడి చెయ్యడు ఆ పని. బలవంతంగా మూసుకుని పోవలసి వస్తుంది. అది అందరికంటే అతనికి బాగా తెలుసు. తెవాదులకే ఇంకా అతని గురించి నిజం తెలియడం లేదు. తెలంగాణా ఉద్య్మాం ఇప్పటి ధోరణిలో ఉన్న అతని సారధ్యంలో ఉన్నంత కాలం, లేదా మిగతా వాళ్ళు తెలివి తెచ్చుకుని అతని ధోరణి ని మార్చనంత కాలం తెలంగణా రాదు. ఇది నేను ఘంటాపధంగా చెప్పగలను.

    రిప్లయితొలగించండి
  2. తెలుగుతో సహా అన్ని భాషలలోనూ పర్యాయపదాలు ఉంటాయి. ఉ. బర్రె, గేదె, ఎనుము అన్నిటికీ అన్ని ప్రాంతాలలో అర్ధం ఒకటే. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పదం ఎక్కువగా వాడుకలో ఉంటుంది. పాత మైసూరులో కారాబాత్ అన్నా ఉత్తర కర్ణాటకలో ఉప్పిట్టు అన్నా రెండూ ఒకటే. The popularity of the word differs between areas, not the meaning itself. In some cases, some regions may have totally stopped using a particular word. This does not mean it is foreign to them.

    భాషల మధ్య కూడా ఇదే ప్రవర్తన కనిపిస్తుంది. ప్రేమ ప్రీతి రెండిటి అర్ధం ఒకటే అయినా తెలుగులో ప్రేమ అనే పదం ఎక్కువ వాడితే కన్నడలో ప్రీతి ఎక్కువ కనిపిస్తుంది.

    కొన్ని పదాలకు ఎన్నో అర్ధాలు ఉంటాయి ఉ. విచారం. కోస్తాలో బాధకు పర్యాయంగా ఎక్కువగా వాడే ఈ మాట సీమవారి నోట investigate/check అనే అర్ధంతో వింటుంటాము. Similarly agraham in Telugu indicates anger while agarah in Hindi means request.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఈ పాండిత్యమంతా లేకనే కచరా పండితుల వారు అట్లా మాట్లాడారు కాబోలు. కొంచెం ఆయనగారికి విడమరిచి చెప్పరాదు?

      తొలగించండి
    3. చెప్పాలంటే కలవాలి కదా. టీవీలలో మాత్రమె చూసిన వ్యక్తికి నా మాట ఎలా అందజేయాలి?

      తొలగించండి
    4. Deat Gottimukkal to meeting KCR is not a big deal to such you guys. go ahead and explain. at least i feel happy, that you realised there are many more slangs in Telugu.

      తొలగించండి
  3. > Similarly agraham in Telugu indicates anger while agarah in Hindi means request.

    హిందీవాళ్ళు తరచుగా సంస్కృతభాషలోని పదాల్ని తప్పుడు అర్థాల్లో వాడుతూ‌ ఉంటారు.
    ఆగ్రహం అన్నది సంస్కృతపదం. దీనికి సంస్కృతంలో కోపం (anger) అనే అర్థం. అంతే‌కాని, requestఅనే అర్థం రానేరాదు.
    ఒక భాషలో పదాన్ని తీసుకుని వేరే భాషలో వేరే అసంగతమైన అర్థాన్ని ఇవ్వటం నిస్సందేహంగా వింతపని.

    రిప్లయితొలగించండి
  4. అయ్యయ్యో ఉద్యమంలో ఇన్నాళ్ళు ఉన్నావు, ఇంతవరకూ ఉద్యమ ప్రధాన నేతని కలవలేదా?! పోన్లే గానీ తెలంగాణా ఉద్యమానికి మీ ఇద్దరూ - నువ్వూ కచరా - భలే దొరికారయ్యా పాటకి నేనూ ఆటకి మా అప్పా అన్నట్టు :-)

    రిప్లయితొలగించండి