శిక్ష పడిన ప్రజా ప్రతినిధులను అనర్హత వేటు నుంచి రక్షించే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ "నాన్సెన్స్" అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. అధిష్టానం కొన్ని శిలా శాసనాలను ప్రజల మీద పడేస్తుంది, వాటిని స్వీకరించాల్సిందే. వాటికి వ్యతిరేకంగా మాట్లాడే ఎంతటి వారినైనా అధిష్టానం ఉపెక్షించదు. కావాలంటే, పాల్వాయి గోవర్ధన రెడ్డి గారిని అడగండి. ఎన్నో దశాబ్దాల పాటు ప్రజలచే ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధి. అవసరమొస్తే, అధిష్టాన నిర్ణయాన్ని అమలు పరచే ప్రక్రియలో భాగంగా, సొంత ప్రభుత్వాన్నైనా కూల్చి వేయమనే ఉదార స్వభావం ఆయనది ఆయన పార్టీ పెద్దలది.
ఈ ఉదాహరణ ప్రకారం, ఎంత గొప్పవాడైనా అధిష్టాన్నాన్ని ధిక్కరిస్తే, క్రమశిక్షణ చర్యలు తప్పవు. రాహుల్ గాంధీ కావచ్చు, కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు. ఆప్షన్స్ వుండవు. త్వరలో వీళ్ళిద్దరినీ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని బహిష్కరణ వేటు వేసి పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం వుంది అని నిరూపిస్తారని ఆశిద్దాం.
రిప్లయితొలగించండి>శిక్ష పడిన ప్రజా ప్రతినిధులను అనర్హత వేటు నుంచి రక్షించే సదుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన ఆర్డినెన్స్ "నాన్సెన్స్" అంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.
కాంగ్రెసు వారి స్పందన ఇలా ఉంతుందేమో:
"ఇది మీడియా వక్రీకరణ క్రిందికి వస్తుంది. మీడియా బాధ్యత గుర్తించి ప్రవర్తించాలని కాంగ్రెసు అగ్రనాయకత్వం హితవు చెబుతున్నది."
అంతర్గత నియంతృత్వం అంటే బాగుంటుంది, అయినా బహిష్కరణ వేసే వాళ్ళే ఎలా బహిష్కరించు కుంటారు?
రిప్లయితొలగించండిఅసలా ఆర్డినెన్సు వేసింది కూడా రాహుల్ బాబాని హీరో లెక్క రంగ ప్రవేశం చేయించటానికి అయ్యుండచ్చుగా?! నా లెక్క ప్రకారం ప్రజాభిప్రాయానికి : -) తలవొగ్గి ఆర్డినన్సును వెనక్కి తీసుకోవచ్చు.
రిప్లయితొలగించండి