భాజపా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఈ మధ్య ఒక విచిత్రమైన కల వచ్చింది(బహుశా ఆ కల పగటి పూట వచ్చి ఉండచ్చు). ఆ కలయొక్క సారాంశం, ఇరు ప్రాంతాలలో భాజపా అత్యధిక పార్లమెంటు స్థానాలు, శాసన సభా స్థానాలు గెలిచినట్లు! ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో సొంత గ్రామంలో తన పార్టీ బలపరచిన అభ్యర్ధిని గెలిపించుకోలేని ఈయన గారు చెప్పే మాటలు వింటుంటే ఒక సామెత గుర్తొస్తోంది - ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కిందంటే ఇదే మరి. భాజపా శాసన సభ్యులందరూ (అప్పటికి ఉన్నది ఇద్దరే) రాజీనామా చేసి తెలంగాణా నినాదం మీద మళ్ళీ గెలుస్తామని బీరాలు పలికి తను మాత్రం అంబర్ పేట్ నుంచి మళ్ళీ గెలవలేమేమో అన్న సందేహంతో, తోక ముడిచిన ధీశాలి కిషన్ రెడ్డి గారు!
ఆంద్ర ప్రదేశ్ లో కనీసం వోటు హక్కు కూడా లేని ప్రాస కోసం ఏడ్చే ఆంధ్రోడు వెంకయ్య గారి శిష్యుడికి సడన్గా భావ ప్రకటన స్వేచ్చ గుర్తొచ్చింది. బాబూ కిషన్ రెడ్డీ - మీరు చెప్పే భావ ప్రకటన స్వేచ్చ కేవలం తీర సీమాంధ్ర జిల్లాలకు మాత్రమే వర్తిస్తుందా ? తెలంగాణాలోని లక్షలాది విశాలాంధ్ర వాదుల నోరు నొక్కినప్పుడు మీరు వల్లించే ఈ భావ ప్రకటనా స్వేచ్చ ఎక్కడికి పోయింది. అందరికీ సమాన హక్కులుండే రాష్ట్ర రాజధానిలో కనీసం విలేకరుల సమావేశం పెట్టుకొనే స్వేచ్ఛ వేరే ప్రాంతాల వారికి లేదా? పత్రికా విలేకరుల ముసుగులో గుండాలు చేసిన దాడులు మీరు ఖండించనప్పుడు, భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి గురివింద నీతులు చెప్పే నైతికత తమకేక్కడనుంచి వచ్చిందో సెలవిస్తారా?
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాంతాల వారిగా ఏ పార్టీ అయినా చీలిపోతే మొదటి వరుసలో వచ్చేది భాజపా అనే నగ్న సత్యాన్ని వచ్చే సార్వత్రికలలోపు మీరు వెండి తెరపై చూడవచ్చు. రాహుల్ గాంధీని ప్రధానిని చెయ్యడానికి కావలసిన సీట్లు దండుకొనే ఉద్దేశంతో తెలంగాణాను ప్రకటించిందని మీరు కాంగ్రెస్ ను తిట్టారు. అంటే తెలంగాణా వేర్పడితే కాంగ్రెస్కు లాభం కానీ మీకేమీ ఉపయోగం లేదన్న తత్త్వం ఈ పాటికి మీకు బోధ పడే వుంటుంది. ఈ దిశగానే మోడీ గారు తెదేపాతో జట్టుకట్టబోతున్నరానీ రాష్రం కోడై కూస్తున్నది. భాజపా ఒక జాతీయ పార్టీ. పొత్తులు ఎత్తులు అన్నీ కేంద్ర స్థాయిలో ఉంటాయే గాని మీ మాటకు కట్టుబడి కేంద్రంలో పీఠం వదులుకోరు. సొంత గ్రామ పంచాయతీ కూడా మీరు గెలుచుకోలేదు, మీ మాట మేమెందుకు వినాలి అనవచ్చు. ఒక వేళ మీరు కాదు కూడదు అని మొండికేస్తే, మీకు అద్వానీ గారి అడ్రసు ఇస్తారు. ఇక కోస్తా ప్రాంతంలో మీ పార్టీలో ఎదురు చెప్పే ప్రసక్తే లేదు, కారణం - అక్కడ జిల్లా అధ్యక్షులుగా చెప్పుకొనే ఉత్సవ విగ్రహాలలో ఎక్కువ మంది మీ వెంకయ్య గారి సామాజిక వర్గానికి చెందిన వారే. తెదేపాతో కలవడం వల్ల వారికి కొంత బృతి దొరికే అవకాశం వుంది. కాబట్టి వారు వ్యతిరేకించరు.
రాబోయే రోజులలో ఇదే నిజమైతే, మీరు మీ పార్టీకి రాజీనామా చేస్తారని, వాక్ స్వాతంత్ర్యమే ధ్యేయంగా (అన్ని ప్రాంతాలలో) పని చేస్తారని ఆశిస్తున్నాం.
బాగా చెప్పారు. వంకర మూతి వెంకయ్య డొంక తిరుగుడు మాటలపై ఒక పోస్ట్ రాయండి
రిప్లయితొలగించండి