10, సెప్టెంబర్ 2013, మంగళవారం

పోలీసు శాఖలో యూనియన్ను ప్రోత్సహిస్తున్న నేతలు


శని వారం జరిగిన 'సేవ్ ఆంధ్రప్రదేశ్' సభలో ఒక కానిస్టేబుల్ జై తెలంగాణా నినాదాలు చేసి తెరాస వారిచే కీర్తింపబడినాడు .   ఆయనకు ధనయోగం, నాయకుల దర్శనం, యూ ట్యూబ్ చిత్రాలు, కీర్తి ఖండూతి దక్కాయి. రాబోయే తెలంగాణలో ఆయనకు డబల్ ప్రమోషన్ ఇచ్చ్చినా ఆశ్చర్యం లేదు.    ఈ కానిస్టేబుల్ ఒకప్పుడు ఎం ఎల్ ఎ గారి అంగ రక్షకుడిగా కూడా పనిచేశారు.   ఇలాంటి మనస్తత్వం వున్న వ్యక్తి ఉన్మాదిగా మారే ప్రమాదం వుంది. నినాదాలు చేసినంత మాత్రాన ఆయనను ఆకాశానికి ఎత్తడం చూస్తే, కొంత మంది ఉన్మాదులు పెట్రేగే అవకాశం వుంది.      


యూనిఫాం సేవలలో వుండేవారు ముఖ్యంగా తెలంగాణా వారంతా కలిసికట్టుగా ఆంధ్రోళ్ళ దౌర్జన్యాలను అడ్డుకోవాలని మన బాగు కోసం చట్టాలు చెయ్యాల్సిన పార్లమెంటు సభ్యుడు సెలవిచ్చాడు.   ఇలాంటి అడ్డు అదుపు లేని మాటలతో రెచ్చగొడితే, పాపం అమాయకులైన యువత పక్కదారులు పడుతున్నారు.  ఇలాంటి రెచ్చగొట్టే ధోరణులను ప్రోత్సహిస్తే, రాబోయే రోజులలో హింస-ప్రతి హింసలకు దారితీసి ఇది జాతుల మధ్య వైరంగా పరిణమించే ప్రమాదం వుంది.   ఉద్యమం ముసుగులో అరాచకాన్ని ప్రోత్సహించి వోట్లు దండుకొనే నాయకుల కుట్రలు సగటు ప్రజానీకం ఇప్పటికైనా పసిగట్ట కలరని ఆశిద్దాం. 

6 కామెంట్‌లు :

  1. avunu poortigaa cm dhaggara nundi dgp ,cp lu andhrau samkandhra koraku union pettachu kani oka samanya constable jai telangan a ante maha thappu :(

    రిప్లయితొలగించండి
  2. oka saamanya constable Jai Telangana ante thappu kaadu, vaadi inti daggara aruchukomani cheppandi. oka sabha jarigetappudu kavalani rechchagottadaaniki kakapothe, vaadoka MLA ki chemcha, kavaalane chesaadu ani clear gaa ardham avutundi.

    Telangaanaa lo bus lu bandh.
    Auto lu bandh
    vachchetappudu raallu,
    velletappudu raallu.
    sabha daggarakochchi bootulu matladatam.
    mundu roju TV llo తంతాం అని బెదిరింపులు .

    తెలంగాణా సంస్కృతి కి జై జై లు కొట్టండి

    రిప్లయితొలగించండి
  3. రౌతు బట్టి గుర్రం అనే ఏదో సామెత చెప్పినట్లు పాలించే వాడే పక్షపాతాలు చూపితే ఇలాంటివి జరగక ఇంకేం జరుగుతుంది?

    రిప్లయితొలగించండి
  4. Ilagaite inka police kooda strike cheyatame migili undi.

    రిప్లయితొలగించండి
  5. రాజకీ నాయకుడన్న
    ప్రతీ వాణ్ణి తరిమి తరిమి కొడితే తప్ప ఈ రాష్ట్రం లో ప్రజలు అన్న దమ్ముల్లా బ్రతకలేరు.. ఈ నాయకుల ప్రతీ చర్య వెనుకా...మాట వెనుకా...ఓట్లు...పదవులు...అధికారం అన్న ఆలోచన తప్ప...ప్రజల కోసం ఏ మాత్రం కాదు..కాదు..కాదు..ఎప్పటికి గమని స్తా ర్రా పిచ్చ తెలుగు వెధ వల్లారా...మీ గురించి వాడు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి పోరాడుతాడు?పోరడుతానని ప్రగల్భాలు పలుకుతాడు...ఈ నాయకులు...ప్రతీ రోజూ వచ్చి మైకుల ముందు కూర్చుని ....మూర్చ రోగుల్లా కూర్చుని వూగిపోయేది...మీ ఓటు కోసం...ఓటు కోసం...రేపు ఎలక్షన్లో నువ్వు తనకి ఓటు వేసి గెలిపిస్తే...తర్వాత అంచెలంచెలుగా ఎలా ఎదుగుదామా అని ఉర్రూతలూగుతున్న ఉన్మాది....వాళ్ళు వచ్చి, గిల్ల గానే మీలో మీరు తన్నుకు చస్తున్నారు.....వాళ్లేదో పోటుగాళ్లని మీరనుకుంటున్నారు...మిమ్మల్ని రెచ్చగొట్టి ,మీలో మీకు టెన్షన్లు కల్పించి,మీరు పరుగులు పెట్టి మరీ తమకు ఓట్లు వేసేట్టు ....చేయించుకుంటున్నార్రా!! మీ ఓట్ల తో గెలిచి...మీ సొమ్ము కొల్ల గొట్టి...అమెరికా...లండన్ లలో పిల్లల్ని పెద్ద చదువులు చదివించుకుంటూ...మంచి సమాజంలో ,మంచి జీవితాలు వాళ్లకు ...ఏర్పాటు చేస్తున్నారు...కల్పిస్తున్నారు...మీలో మీరు తన్నుకు చావడమేమిట్రా పిచ్చి వెధవల్లారా...మీరు ఎంత కొట్టుకు చచ్చినా మీరు గెలవ లేరు...గెలిచేది...రాజకీయమే...ఎప్పటికీ పైన నిలబడేది...నాయకులే...మీరు తన్నుకు చావటం తప్ప మరేమీ సాధించ లేరు...చావండి మీ ఖర్మ!!

    రిప్లయితొలగించండి
  6. police la thirugu batu kadapa lo oka guest house lo unna oka manthri gari pi ar police lu thupakulatho champadaniki ready ga unte oka aada IPS thana nudithi pi revolver unchu koni meeru manthrigaarini kaalchuthe neenu kalchu kuntanu annacho police vaaru thirigi vellipoinaru.1990 lojarigindi

    రిప్లయితొలగించండి