23, ఆగస్టు 2013, శుక్రవారం

విప్ అంటే ఇదా!



చట్ట సభలలో ఏదైనా వోటింగు సమయంలో ఫలానా పార్టీ విప్ జారీ చేసిందీ అని మనం తరచూ వింటుంటాము. కానీ తమాషాగా నిన్న గౌరవ పార్లమెంటు సభ్యుడు పార్లమెంటు సాక్షిగా కొరడాతో తనను తాను శిక్షించు కున్నారు.   తెలుగు దేశం పార్టీలో గతంలో బంగి అనంతయ్య అనే కర్నూలు నాయకుడు వుండేవారు.  విచిత్ర వేష ధారణకు ఆయన పెట్టింది పేరు.    ఆయన వెకిలి చష్టలను తట్టుకోలేకో మరే కారణం చేతనో ఆయనను పార్టీ నుంచి తొలగించారు.     ప్రస్తుత చిత్తూరు పార్లమెంటు సభ్యులు కూడా విచిత్ర వేషధారణకు పెట్టింది పేరు.  బంగి అనంతయ్య లేని లోటును ఆయన పూడుస్తున్నారు.    మొన్నటికి మొన్న విభజనకు వ్యతిరేకంగా ద్వారకా కృష్ణుని వేషం కడితే, ఈ రోజు కోరడాతోటి (విప్పింగ్) వీర తాళ్ళు వెసుకున్నారు.     ఈయన వస్తుతహా సినిమా నటుడు కూడా.   ఇలాంటి పద్ధతులు పార్లమెంటు ప్రతిష్టను దిగజారుస్తాయి.    సిద్ధాంత పరమైన, చట్టాలను చేయవలసిన పార్లమెంటు సభ్యుడు చెయ్యవలసిన పని కాదు. నిరసన తెలియచేయడానికి  చాలా మార్గాలున్నాయి.    


ఈ కొరడా దేబ్బలేవో మహానాడు తీర్మానం రోజునే విభజనకు అనుకూలంగా తీర్మానించిన  చంద్ర బాబు గారి మీద ప్రయోగించి నట్లైతే ఈ రోజు తనను తానూ శిక్షించుకొనే అగత్యం దాపురించి వుండేది కాదు.   చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ!

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి