9, ఆగస్టు 2013, శుక్రవారం

బై బై రెడ్డి పార్టీ


అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కొలువైన పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి.    ఇక్కడ నుండి రాజకీయ పార్టీని ప్రకటించినా, తప్పుడు రాజకీయాలు చేసినా ప్రజలు క్షమించినప్పటికీ  ఆ ఏడుకొండల వాడు క్షమించడు.  


ఇంతవరకు తిరుమలలో  పార్టీని ఆవిష్కరించినవారందరూ చరిత్రలో కలిసిపోయిన వారే!  అట్టహాసంగా, వికటాట్ట హాసం చేసి ప్రజా రాజ్యం అని బోర విరుచుకున్న  చిరంజీవి, జై ఆంధ్రా పేరిట హంగామా చేసిన  ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వర రావు  & కంపెనీ  ఇందుకు చక్కటి ఉదాహరణలు.   ఈ కోవలోకే రాబోతున్న మరో పార్టీ బై రెడ్డి గారి రాయలసీమ పరిరక్షణ సమితి.  ప్రతి ప్రైవేటు కంపెనీకి ఒక లోగో వున్నట్లు ఈయన గారి పార్టీ లోగో 'తిమ్మమ్మ మర్రి మాను'.      టి ఆర్ ఎస్ లాగా వినిపిస్తున్న ఆర్ పి ఎస్, పార్టీగా మనుగడ సాధించాలంటే, నోటికొచ్చినట్లు మాట్లాడడం, ప్రజలను మభ్యపెట్టగల వాక్ చాతుర్యం , పత్రికా స్వేచ్చ పేరిట ఎవరినైనా నోరు మూయించకల ఒక దిన పత్రిక (రామ్మా రాయలసీమ అనే పేరైతే బాగుంటుంది)  , 24 గంటలు అనర్గళంగా అవాస్తవాలు చెప్పే ఒక వార్తా ఛానల్ (ఆర్ న్యూస్ అయితే శ్రేష్టం) ,  దండిగా డబ్బు కావాలి (సొంత డబ్భు అవసరం లేదు) .  వీటన్నితోపాటు ఒక ప్రత్యేక గీతం/గేయం వుంటే మరీ మంచింది.    ఇందులో ఏ ఒకాటి లేకపోయినా, ప్రస్తుత పరిస్తితులలో సెంటిమెంటు పేరుతొ పార్టీ మనుగడ సాధించడం అసాధ్యం.   

4 కామెంట్‌లు :

  1. NTR ni chirutho and bireddy tho polustunnava? you have a serious problem in your brain brother. party pettina 9 nelalake adhikaram loki vachi teluguvari kosam tapana padda NTR ekkada ee waste fellows ekkada?

    రిప్లయితొలగించండి
  2. రాయలసీమ సాధించడానికి ఈయన 2016 దాకా గడువు ఎందుకు పెట్టుకున్నాడో అర్థం కాదు.
    అదేదో ఇప్పుడే, ఈ వేడిలోనే సాధించుకుంటే బాగుంటుంది కదా.

    రిప్లయితొలగించండి