11, జులై 2013, గురువారం

పాపం ఉండవల్లి !


వర్గ బలం, కుల బలం, ధన బలం లేని  ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కేవలం తన వాక్ చాతుర్యంతో, తెలివితేటలతో గత రెండు విడతలుగా పార్లమెంటు సభ్యునిగా రాజమండ్రి నుంచి నెగ్గుకొస్తున్నారు.  తను మాట్లాడే విషయాలపై కూలంకషంగా వాస్తవాలు తెలుసుకున్న తరువాత మాత్రమే గణాంకాలతో సహా ఏకరువు పెట్టే బహు కొద్దిమంది వక్తల సరసన నిలుస్తాడు ఉండవల్లి.     మన దేశంలో ఏ శాసన సభ్యుడు కానీ, ఏ పార్లమెంటు సభ్యుడు కానీ ప్రజలకు జవాబుదారీగా వుండే వార్షిక నివేదికల పేరిట తనను ఎన్నుకున్న ప్రజలకు వివరించరు. కానీ, గత తొమ్మిది సంవత్సరాలుగా క్రమం తప్పకుండా నియోజక వర్గంలో సభ జరిపి తను పార్లమెంటు సభ్యుడిగా తెచ్చిన నిధులు, వాటి జామా ఖర్చులు, తను ప్రజలకు చేసిన పనులు, ఇంకా మిగిలివున్న పనులు గురించి బహిరంగంగా చెప్పడం ఆయనకు ఒక ఆనవాయితీ.   


అయితే, ఆయన వుపన్యాసంలోని ముఖ్యాంశాలను (లేదా అన్ని అంశాలను) ఏ పత్రికా,  పాఠకులకు అందించదు, కారణాలు చూద్ద్దాం  --


ఈనాడు - చిట్ ఫండ్ కంపెనీలో జరిగిన అవకతవకలను బయటికి తీసి ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగించిన  న్యాయవాది ఉండవల్లి.    గత్యంతరం లేని పరిస్తితులలో ఆయన మీటింగ్ వివరాలు రాయవలసి వస్తే, ఒక రెండు కాలంల వార్త అచ్చేసి, కేవలం ఆయన జగన్ రెడ్డిని విమర్శించిన విషయం మాత్రమే రాస్తారు. 


నమస్తే తెలంగాణా - ఈ పత్రిక ఉండవల్లిని అమాంతం గరళ కంఠుడ్ని చేసేస్తుంది.   అదేనండి, ఆన్ద్రోడు విషం కక్కాడు అని రాస్తుంది.   ఆయన చెప్పిన విషయాన్ని 'విషం' చేస్తుంది. 


ఆంద్ర జ్యోతి - అదియును నీ పతి ప్రాణంబు దక్క అన్నట్లు - చంద్ర బాబును మినహాయించి ఆయన జగన్ రెడ్డి పై చేసిన వ్యాఖ్యలకు, క చ రా పై చేసిన విమర్సలకు మాత్రం  ప్రాముఖ్యం ఇస్తుంది. 

సాక్షి - మా నాన్న నిలబెడితే గెలిచిన ఉండవల్లి వై ఎస్ సార్ అనకుండా ఊసరవెల్లిలా రంగులు మారుస్తాడా, వెయ్యండిరా వీరతాళ్ళు 


వార్త, సూర్య, భూమి - చదువరులు తక్కువ కాబట్టి, రాసినా ఒకటే, కోసినా ఒకటే.     


ఇంతవరకు ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మీద ఎలాంటి అవినీతి ఆరోపణ కానీ, ప్రజలకు అందుబాటులో ఉండడు అని కానీ ఆరోపణ రాలేదు.    ఒక వేళ అలాంటి పనులమైనా చేసివుంటే, ఈపాటికి 'ఈనాడు' వదిలేది కాదు.   అయితే, ఇంత తెలివికలవాడు, మేధావి, మంచి వక్త అయినా, వచ్చే ఎన్నికలలో ప్రజలు ఎన్నుకోక పోవచ్చు.   కుల సమీకరణాలు, సినిమా గ్లామర్, డబ్బు ముందు అరుణ్ కుమార్ తల వంచాల్సిందే! ప్చ్ పాపం. 

6 కామెంట్‌లు :

  1. మీరు చెప్పిన విషయాలు విన్నాక మిగతా వాళ్ళూ యెలా ఉన్నా నేను మాత్రం మెచ్చుకుంటున్నాను.ఇలాంటి వాళ్ళని తప్పకుందా యెంకరేజ్ చెయ్యాలి.

    రిప్లయితొలగించండి
  2. ఉండవల్లి నెగ్గుకురావడానికి కారణం వాక్చాతుర్యం లేదా తెలివి కాదు. పెద్దవాళ్ళ (ఉ. సోనియా, వైఎస్) దగ్గర తనకు ఉన్నట్టు ప్రచారం. ఎవరి అగచాట్లు వారివి.

    రిప్లయితొలగించండి