11, జులై 2013, గురువారం

ఆది శంకరుని సిద్ధాంతానికి సినిమా వాళ్ళ వక్ర భాష్యం !


నిన్న(10-07-13) ఆంద్ర జ్యోతిలో సినిమా పుటలో ఒక వార్త అచ్చైంది.   ఆ వార్త తాలూకు హెడ్డింగు చూడండి "స్త్రీ పురుష సంబంధాలలోనూ అద్వైతం ఉంటుందని చూపించాను" - ఇది ఒక సినీ దర్శకుని ఉవాచ.   ఆ హెడ్డింగు కింద వున్న విషయం చూడండి - "రమణ మహర్షి వద్దకు  వెళ్లక ముందు చలం వేరు, వెళ్ళిన తరువాత చలం వేరు. ద్వైతాన్ని అనుభవించి, అనుభవించి తరువాత రమణ మహర్షి ద్వారా అద్వైతంలోకి వెళ్ళిపోయారు చలం.   అద్వైత స్థితి స్త్రీ పురుషుల మధ్య కూడా ఉంటుందనీ అదే అసలైన సంబంధం"  అని ఆ దర్శకులు చెప్పిన దాన్ని ఆంద్ర జ్యోతి వారు వత్తేశారు. 


నాకు తెలిసింది అద్వైతం అంటే జీవాత్మ పరమాత్మ వేరు కాదని ఆది శంకరాచార్య గారు ప్రతిపాదించిన సిద్ధాంతం .   ద్వైతం అంటే, జీవుడు వేరు దేవుడు వేరు అని   ప్రతిపాదించాడు మధ్వాచార్యుల వారు.    రామానుజల వారి సిద్ధాంతం విశిష్టాద్వైతం.    


స్త్రీ పురుష సంబంధాల గురించి  ఆది శంకరాచార్యులవారు , మధ్వాచార్యుల వారి కన్నా ఏమైనా వివరంగా అద్వైతంలో చెప్పారా??  నా బ్లాగు చదివే, ఈ విషయం తెలిసిన  పెద్దలు ఎవరైనా కొంచం నన్ను అజ్యానాన్నించి బయటపడేయ్యాలని ప్రార్ధన.    ఇప్పటికే కె రాఘవేంద్ర రావు గారు "విశిష్టాద్వైతములో"  ఎక్కడా పొందు పరచని అన్నమయ్య ప్రేమ కధను జాజులు, సంపెంగలు, మల్లెలు, పూలు, పాలు,  పండ్ల సాక్షిగా మనకు చూపించారు.    ఇక ముందు ఎలాంటి కొత్త సిద్ధాంతాలను చూడాల్సి వస్తుందో భయంగా వుంది. 

 ఆంద్ర జ్యోతి పత్రిక పాఠం 


2 కామెంట్‌లు :

  1. బార్యా భర్తలలో భార్య జీవుడు అయితే భర్త దేవుడు.ఎందుకంటే పతియే ప్రత్యక్ష్ష దైవం కదా! సంసారమ్ అంటే ఇరువురు మమేకమై నిర్వహించేది కాబట్టి, అది అద్వైతం. లేదూ ఎడమొగం, పెడమొగం బార్యా భర్తలు చేసే సంసారంలో పగలు ద్వైతం, రాత్రి అయితే అద్వైతం. మొత్తానికి ఈ సంసారం గురించి తెలియని ఆచార్యులు అందరు ఆ సంసారం గురించి చెప్పారు. మొత్తానికి మంచి పోస్ట్ పెట్టారు

    రిప్లయితొలగించండి
  2. సార్వభౌమ గారు, విశిష్టాద్వైతం మీద కూడా ఒక చెణుకు విసరండి

    రిప్లయితొలగించండి