తరగతి గదిలో పేలిన ఒక క్రూడ్ బాంబు ఘటనలో 24 మంది పాఠశాల విద్యార్ధులు గాయపడ్డారు, అందులో 5 గురి పరిస్థితి విషమంగా వుంది. డెక్కన్ హెరాల్డ్ దిన పత్రికలో పతాక శీర్షికగా వచ్చిన ఈ వార్త బహుశా మన రాష్ట్ర మూడు ముక్కలాటలో కనుమరుగైంది.
ఆ పత్రిక కధనం ప్రకారం - అయాత్పూర్ ప్రాంతంలోని బాల బాలికల పాఠశాలలొ 85 మంది విద్యార్దులున్నారు. త రగతిలో ఉపాధ్యాయురాలు హాజరు పిలిచిన తరువాత ఒక విద్యార్ధి పాఠశాల సంచి నుంచి కిందపడిన బాంబు పేలడం వలన ఈ దుర్ఘటన సంభవించింది.
బాంబు పరిశోధక నిపుణులు, పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కటక్ పోలీస్ ఉన్నతాధికారి కార్యాలయానికి కేవలం 30 కి మీ దూరంలో, పాఠశాలలో ఇలాంటి దుర్ఘటన జరగడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు . విద్యార్ధుల వైద్య ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి తెలిపారు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి