16, జులై 2013, మంగళవారం

భారత్ లో ప్రతి రెండు గంటలకు ఒక ఆత్మహత్య


మన దేశంలో నగాటున ప్రతి రెండు గంటలకు ఒక ఆత్మ హత్య జరుగుతున్నట్లు 'ప్రమాదాలు మరియు ఆత్మ హత్యల పై నివేదిక 2012' ప్రకారం గత సంవత్సరంలో అక్షరాలా 1,35,000 మంది ఆత్మహత్యలు చేసుకున్నట్లు తెలిపింది.   కుటుంబ సమస్యలు పేదరికం, అనారోగ్యం మరియు ప్రేమ విఫలం ముఖ్యమైన కారణాలుగా ఈ నివేదిక తెలియచేసింది. 


జాతీయ నేర నమోదు సంస్థ (NCRB) ప్రకారం కుటుంబ కలహాలు 25.6 శాతం కాగా అనారోగ్యం 20. శాతంగా గుర్తించింది.    2010 లెక్కల ప్రకారం 1,35,585 మంది బలవన్మరణం చెందగా 2012 లో ఈ సమాఖ్య 1,35,445 గా నమోదైంది.   ఈ బలవన్మరణాలలొ 16,927 తో తమిళ్ నాడు ముందుండగా, మహారాష్ట్రలో (16,112), పశ్చిమ బెంగాల్ లో 14,957 మంది కాగా మన రాష్ట్రంలో ఈ సమాఖ్య 14,238 గా, కర్ణాటకలో 12,753 గా గుర్తించారు.  


దేశంలోనే ఈ ఐదు రాష్ట్రాలు కలిపి 55.3 శాతం సగటుగా నమోదైంది.   అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్లో అతి తక్కువగా 3. శాతం కాగా, రాజధాని ధిల్లీ లో 1,899 గా నమోదైంది.  ఇది ఇలా వుండగా దేశంలో రోడ్డు ప్రమాదాలలో చనిపోయిన వారి సంఖ్య గతంతో పోలిస్తే స్వల్పంగా తగ్గి 3,94,982 మంది గా నమోదైంది.   ఇవే కాకుండా గత సంవత్సరంలో అసహజ మరణాల సంఖ్య 3,72,022 గా గుర్తించారు.  



ఆధారం : డెక్కన్ హెరాల్డ్ 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి