13, జులై 2013, శనివారం

భాజపా, మోడీ, ఓ కుక్కపిల్ల

సువిశాల భారత దేశానికి ప్రధాని కావాలని (పగటి) కలలు  కంటున్న నరేంద్ర మోడీ గారు నిన్న ఒక  ప్రముఖ అంతర్జాతీయ వార్తా సేకరణ సంస్థకు ఇచ్చిన ముఖాముఖీ ఒక్క సారి చదవండి:  



Do you regret what happened?
I’ll tell you. India’s Supreme Court is considered a good court today in the world. The Supreme Court created a special investigative team (SIT) and top-most, very bright officers who overlookoversee the SIT. That report came. In that report, I was given a thoroughly clean chit, a thoroughly clean chit. Another thing, any person if we are driving a car, we are a driver, and someone else is driving a car and we’re sitting behind, even then if a puppy comes under the wheel, will it be painful or not? Of course it is. If I’m a chief minister or not, I’m a human being. If something bad happens anywhere, it is natural to be sad.



మోడీ గారు గుజరాత్ నరమేధం గురించి  స్థూలంగా చెప్పిందేమిటంటే -- 


'నేను వాహనం నడిపినా, వాహన చోదకుడు నడిపినప్పుడు నేను వెనుక సీట్లో కూర్చున్నా, వాహనం   కింద కుక్కపిల్ల పడితే, సహజంగానే బాధగదా! నేను కూడా మనిషినే కదా !'


మోడీ కనుసన్నలలో జరిగినట్లుగా చెప్పబడుతున్న గుజరాత్ నరమేధంలో గర్భిణీ స్త్రీలు, పసిపిల్లలు కూడా చంపబడ్డారు.  హిందూ మతం హింసను ప్రొత్సహించదు.   హింసకు ప్రతి హింస సమాధానం కాదు.  


20 కోట్ల మంది భారతీయ ముస్లింలు ఇక్కడ నివసిస్తున్నారు.     మతమేదైనా అందరూ మనుషులే.     ఇంతవరకు మన దేశాన్ని పాలించిన ప్రధాన మంత్రులు జాతి, కుల, మత, ప్రాంత బేధాలకు అతీతంగా ఉంటూ ఈ దేశ సమగ్రతను కాపాడినవారే.       అలాంటి చరిత్ర కలిగిన దేశానికి అత్యున్నత పదవి అధిష్టించాలనుకొనే వారు మాట్లాడ తగ్గ మాటలేనా ఇవి?   ఇలాంటి వ్యక్తుల ప్రవర్తన వలన సమాజంలో వివిధ వర్గాల మధ్య చీలిక వచ్చే ప్రమాదం వుంది.  ఇది ఏ మాత్రం వాంఛనీయం కాదు.  

  



8 కామెంట్‌లు :

  1. 5 lakshala mandi hinduvul ni kasmir nundi vellagottinappudu emaindi mee manavatvam......meeru valla gurinchi pattinchukora.........

    రిప్లయితొలగించండి
  2. వాసు గారు, మీరు చెప్పింది నిజం. భాజపా ప్రభుత్వం 6 సంవత్సరాలు అధికారంలో వుంది ఎంతమంది పండితులను ఆదుకుంది. గుజరాత్ నరమేధం తరువాత కశ్మీరీ పండితులలో ఒక్కరంటే ఒక్కరు వెనకకు వెళ్ళగలిగారా? ఇరు మతాల మధ్యా వైషమ్యాలు ఇంకా పెరిగాయి. రెండు తప్పులు ఒక రైటు కావు కదా? మతం ముసుగులో మారణ కాండ స్రుష్టించి వోట్ల పబ్బం గడుపుకుందామనుకుంటే, ఇలానే వుంటుంది. మొడీ తనను తాను వొవైసీ స్థాయికి దిగజార్చుకోకూడదు కదా. ప్రధాన మంత్రి అంటే ఇందిరా గాంధీలా వుండాలి. పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి తన తెలివి తేటలు ప్రపంచానికి చాటింది.




    రిప్లయితొలగించండి
  3. you fool, because of Indira Gandhi only we are suffering only we are suffering from Kashmir Terrorism, If we don't have stuff be as Super Police like America you should not enter into other country's issues, Shed did it, now we are having this problem, She is not the example, may be Nehru is better PM.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అఙాత గారికి

      మీరు నన్ను ఫూల్ అన్నంత మాత్రాన మీరు గొప్ప వారవుతారా? కావాలనే మీ వ్యాఖ్య ప్రచురించా. బంగ్లాను విభజించినప్పుడు అటల్జీ ఆమెను దుర్గాదేవి గా పార్లమెంతు సాక్షిగా కొనొయాదిన మాట వాస్తవం కాదా? సిక్కు కాపలాదారుల నుంచి తన ప్రాణానికి ప్రమాదం వుందని తెలిసి కూడా, వెరవని ధైర్యశీలి శ్రీమతి ఇందిరా గాంధి. మీరు నన్ను ఫూల్ అన్నంతమాత్రాన నా అభిమానాన్ని అభిప్రాయాన్ని మార్చుకోనవసరం లేదు.

      తొలగించండి
  4. "పాకిస్తాన్ ను రెండు ముక్కలు చేసి తన తెలివి తేటలు ప్రపంచానికి చాటింది"
    What are the so called "తెలివి తేటలు" you are terming during the 1971 War with which it is alleged that Pakistan was broken into two? What is the point of doing it without destroying the enemy's capacity to fight with us.Indian Army captured 90000+ Pakistan army as POW, the then Government could have solved the Kashmir issue if such "తెలివి తేటలు" were in their possession! Indira Gandhi brought eternal terrorist problem for our country by resorting to breaking Pakistan into two countries, if at all she did that with a previous plan and not forced by circumstances. Bhutto threatened 1000 cuts and we are seeing it now. Do not give unnecessary credit to undeserving Politicians.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కప్పగంతు ప్రసాద్ గారికి

      మీ అభిప్రాయం కొంతవరకు కరక్టె. కానీ 90,000 మంది యుద్ధ ఖైదీలను మన దగ్గర వుంచుకొని బేరమాడటానికి అంతర్జాతీయ చట్టాలు ఒప్పుకుంటాయా? మన కన్నా ఎంతో శక్తివంతమైనా దేశం చైనా. మనమీద జరిపిన యుద్ధంలో వాళ్ళు బలాన్ని నిరూపించుకున్నారు. నెలకొకసారి వాళ్ళు కవ్వించినప్పుడల్లా, భాజపా వారు మైకు ముందుకొస్తారు, మేమైతేనా ఈపాటికి పొదిచేసేవాళ్ళమని. వాళ్ళ పరిపాలనలోనే, కార్గిల్ చొరబాట్లు జరిగినది వాస్తవం కాదా. ఆపరేషన్ బ్లూ స్టార్ ద్వారా ఈ దేశ సమగ్రతను కాపాడింది ఇందిరా గాంధి. ఉగ్రవాదులను ప్రోత్సహించిన అకాలీలు ప్రస్తుతం భాజపా మిత్రులు.

      తొలగించండి
    2. మాష్టారూ చైన బలం గలది కాబట్టి వాళ్ళు టిబెట్ ఆక్రమించి మన సరిహద్దుల్లోకి కూడా వచ్చి అరుణాచల్ మాదే అనే దశకి తీసుకు వచ్చినది ఎవరు? మీరు ఎంతో అభిమానిస్తున్న ఇందిరా గాంధీ గారి ఘనత వహించిన తండ్రి నెహ్రూ. బలం అనేది ఉంది కాబట్టి చైనా ఈ పని చెయ్యగలిగింది. మనం పాకిస్తాన్ కంటే బలం ఉన్న వాళ్ళం కాబట్టి ఇప్పటివరకూ అన్ని యుధ్ధాల్లోనూ గెలిచాము 1971లో అంతమంది యుధ్ధఖైదీలుగా పట్టుకోగలిగాము. ఆ బలాన్ని వాడుకున్నదెక్కడ? మన పిరికితనానికి మంచితనం అనే ముసుగేసుకుని బతికేస్తున్నాము అంతే. నెహ్రూ కు ఎంతమాత్రం తెలివి ఉన్నా కాశ్మీరు అలా అయ్యేది కాదు, ఇందిరకు మీరనుకున్న "తెలివి" ఉంటే గింటే కాశ్మీరు సమస్యను 1971లో తేల్చ గలిగేది కాని జరిగినది ఏమిటి. Simla లో ఒక ఒక చచ్చు ఒప్పందం. టిబెట్ ను చైనా అక్రమించినపుడు లేని అంతర్జాతీయ వ్యతిరేకత, మనం కాశ్మీరు సమస్య పాకిస్తాన్ చెయ్యి మెలిపెట్టి సాధిస్తే ఇప్పుడు వస్తుందా. రాజ్యం వీర భోజ్యం అన్నారు కాని నాయకుల పిరికి తనం మాత్రమే మన విదేశీ నీతి అయినప్పుడు, దేశంలోని సైన్యం ఎంత బలమైనది సర్ధవంతమైనదీ అయినా సరే ఈ సమస్యలు ఎప్పటికీ తెగవు. కార్గిల్ లో బి జె పి ఉన్నప్పుడు ఏమి చేశారని మీ ప్రశ్న కు జవాబు చరిత్రే చెబుతున్నది. వాళ్ళు కూడ లాహోర్ బస్ యాత్ర అని అనవసరపు పనికిరాని వెర్రి దౌత్యం జరిపారు. చేతులు కాల్చుకున్నారు. వాజపాయి కూడా బిజెపి లో నెహ్రూ లాంటివాడే. రొమాంటిక్ ఆలోచనలు ఎక్కువ. అనవసరపు జాలి తెగ చూపిస్తారు. కాని పాకిస్తానుకు అర్ధమయ్యే భాష రెండు తాపులు తన్నటమే అన్న విషయం ఇన్నాళ్ళయినా మన దేశంలో వెర్రి అభిమానాలు అనవసరపు జాలీ, రొమాంటిక్ ఆలోచనలతో తీసుకుంటున్న వాళ్ళకు ఎప్పటికీ అర్ధం కాదు. వాజపాయి బాగా ఉన్నన్నాళ్ళూ మీడియాకు అద్వాని పనికి రాలేదు. ఇవ్వాళ మోడీ పైకి వస్తే, అద్వాని పక్కకు చేరి అదే మీడియా పుల్లలు పెట్టటానికి ప్రయత్నం. మీడియా అనేది వార్తలు వ్రాసుకోవాలి కాని. ఇర్వింగ్ వాలెస్ నవల ఆల్ మైటీ లో లాగ వార్తలను తయారుచేసే ప్రయత్నం చెయ్యకూడదు. మీడియా కూడా రాజకీయ పక్షపాతాలు చూపిస్తూ ఉంటే అసలు విషయాలు, మనలాంటి వాళ్ళకు ఎవరు చెబుతారు. ఫోర్త్ ఎస్టేట్ అని జబ్బలు చరుచుకునే మన మీడియా నిస్పక్షపాతంగా ఉండాలి. ఓక పక్క చేరి రెండో వైపుకు విద్వేషాన్ని "ప్రచారం" చెయ్యకూడదు.

      ఇక మోడీ గురించిన మీ వ్యాఖ్యలు. మీరు ఆంగ్ల మీడియా వక్ర భాష్యాలకు విక్టిం అని నాకు అనిపిస్తున్నది. మోడీ అన్నదేమిటి, నేను ప్రయాణీస్తున్న కారుకు నేను డ్రైవరును కాకపోయినా, చివరకు కుక్కపిల్ల నా కారు కింద పడినా బాధపడే మనిషిని, నా రాష్ట్రంలో ఇంత జరిగితే నాకు బాధ ఎందుకు లేదు, మనిషిగా బాధ పడుతున్నాను అని. కాని మోడీ అంటే వెర్రెక్కిన విద్వేషం రాజకీయ కారణాల వల్ల కొన్ని పార్టీలకు వంత పాడుతున్న కొన్ని మీడియా సంస్థలు, నానా యాగీ చేసి ఆ వ్యాఖ్యల్ని వక్రీకరించి, మోడీని దిగలాగటానికి ప్రయత్నిస్తున్నారు. ఒకసారి సి ఎన్ ఎన్ ఐ బి ఎన్ వెబ్ సైట్లో ఈ మాటల గురించి నా నా యాగీ జరుగుతున్నది. ఒక సారి ఈ కింది లింకు ద్వారా చూడండి.

      http://ibnlive.in.com/news/muslims-are-being-provoked-by-their-leaders-against-modi-alleges-bjp/406415-37-64.html

      తొలగించండి
    3. ఇక ఆపరేషన్ బ్లూ స్టార్ గురించి. భిందర్న్‌వాలేను పెంచి పోషించింది ఎవరు??? అమెరికా లాడెన్ ను ఆప్ఘనిఎస్తాన్లో రష్యాకు వ్యతిరేకంగా తయారు చేస్తే రష్యా వాళ్ళు అఫ్ఘనిస్తాన్లో ఓటమి పాలయ్యి పారిపోయినాక (వాళ్ళ వియత్నాం అది) , వాడు భస్మాసురుడిలాగ తయారయ్యి అమెరికా వెంటబడినట్టు, ఈ భిందర్న్‌వాలే కూడా ఇందిరా గాంధీ రాజకీయ నిరుద్యోగిగా ఉన్న 19977-79 మధ్య అప్పటి ప్రభుత్వానికి తలనెప్పి కలిగించటానికి తయారుచెయ్యబడ్డ వాడే. ఆ భిందర్న్‌వాలే జనతా ప్రభుత్వానికి తలనెప్పిగా తయారయ్యేలోగా , వాళ్ళు అధికారాన్ని చేజేతులా పోగొట్టుకున్నారు. ఈలోగా పాపం ఇందిరగాంధీ మళ్ళి గద్దెనెక్కటం జరిగింది. అదే భిందర్న్‌వాలే ను జనతా పార్టీకి బదులు తానే ఎదుర్కోవల్సి వచ్చి చివరకు "గతిలేక" ఆపరేషన్ బ్లూ స్టార్ లో సైన్యాన్ని వాడుకుని అప్పటికి సమస్య తీరింది అనిపించుకున్నది. అదే ఆపరేషన్ బ్లూ స్టార్ బిజెపి చేసి ఉంటే?? మీడియా వాళ్ళు ఆ విషయాన్ని ఎంత చిందరవందర చేసి వైన వైనాలుగా వెర్రెక్కి పోయినట్టుగా ఒక శతాబ్దం పాటు తెగ చెప్పే నానా అల్లరి చేస్తూ పోతూ ఉండేవాళ్ళు.

      చివరకు పంజాబు సమస్య ఎలా తీరింది? రిబెరొ మరియు గిల్ లాంటి ధైర్యం గల పోలీసు ఆఫీసర్ల వల్ల కాని, రాజకీయ నాయకుల వల్ల కాదు. ఆపైన పంజాబులో నిజంగా శాంతిని కోరుకుంటున్న సర్దార్లు ఎక్కువగా ఉండటం వల్ల కాని, ఏ రాజకీయ నాయకుని "తెలివి" వల్ల కానే కాదు. సిక్కు సెక్యూరిటీ గార్డులవల్ల ప్రమాదం ఉన్నదని ఇంటిలిజెన్స్ వార్తలను పట్టించుకోకపోవటం తెలివే అంటారా!? ఆ తెలివి వల్ల ఏమయ్యింది, ప్రాణాలు కోల్పోయింది. అలా ప్రాణాలు కోల్పోవటం "త్యాగం" ముసుగు వేసి కొంతమంది మూర్చలు పోతూ చెప్పుకోవచ్చు కాని, నా దృష్టిలో అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి లేదు.

      అకాలీలు ఆపరేష బ్లూ స్టార్ తరువాత కాంగ్రెస్ తో దోస్తీ చెయ్యటం అంతటి రాజకీయ అవివేకం మరొకటి ఉంటుందా. రాజకీయాలు పక్కన పెట్టినా, తమ వారికి ఎంతో పవిత్రమైన స్వర్ణ మందిరం మీద సైనిక దాడి చేయించిన (కారణలు ఎంతటి బలమైనవి, సవ్యమైనవి అయినా సరే) అకాలీలు కాంగ్రెస్ వైపుకు తిరిగే అవకాశం వెయ్యేళ్ళ తరువాతైనా ఉన్నదా? అకాలీలు, బిజెపి మిత్రులవటం కూడా బిజెపి తప్పేనా? విచిత్రమైన భ్యాష్యం. బిజెపి మిత్రులైన అకాలీలు ఇప్పుడు ఖలిస్తాన్ కోరుకుంటున్నారా, అందుకు టెర్రరిస్ట్ చర్యలకు తెగబడుతున్నారా. అలా వాళ్ళు చేస్తున్నా కూడా బిజెపి అకాలీల మిత్ర పక్షంగా ఉంటే బిజెపిది తప్పు. రాజకీయ సమీకరణాలలో కాంగ్రెస్ వ్యతిరేకులు అంతా ఒక పక్కకి రావటమె కాని బిజెపి అకాలీల మైత్రి ఎల్లకాలం ఉంటుంది అని నెను అనుకోను. బిజెపిని అధికారంలోకె రానివ్వ కూడదన్న ఒక్క ఎజెండాతో మిగిలిన సో కాల్డ్ సెక్యూలర్ పార్టీలు (వాళ్ళ వాళ్ళ ఇజాలన్ని కాలతన్ని), ప్రజాస్వామిక వ్యతిరేక ప్రవర్తన కన్నా ఇదేమీ గొప్ప తప్పిదం కాదని నా భావన.

      తొలగించండి