10, జులై 2013, బుధవారం

రాజకీయ దోషులపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు

రాజకీయ నాయకులు ఏ పని చేసినా చెల్లుబాటు అవుతుందనే రోజులు పోయాయి  .  ఈ రోజు దేశ అతున్నత న్యాయ స్థానం వెలువరించిన తీర్పు మేరకు, రాజకీయాలను అడ్డం పెట్టుకుని నేరాలు చేద్దామనుకునే వారికి, ప్రజా ధనం దోచేయలనుకునే రాజకీయ నాయకులను కొంత మేరకు అడ్డుకునే అవకాశం వుంది.  


ఈ తీర్పు ప్రకారం శిక్ష పడ్డ వ్యక్తి జైలు నుంచి కానీ, విడుదలైన తరువాత కానీ, ఎన్నికలలో పోటీ చేసే హక్కు కోల్పోతాడు.     ఈ చట్టం వలన, రాజకీయ పదవులను అడ్డుపెట్టుకొని చక్రం తిప్పుదాము అనుకునే  నాయకులలో కొంత భయం కలిగే అవకాశం వుంది.  


ఇలాంటి సంస్కరణలు కేంద్ర ఎన్నికల కమిషన్ ఎప్పుడో చేసి వుండాల్సింది.    సర్వోన్నత న్యాయ స్థానం ఇచ్చిన ఈ తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత మాత్రం వారి మీదనే వుంది.  


6 కామెంట్‌లు :

  1. Chaalaa manchi nirnayam, idi eppudo jarigi cundalsindi,idi ganuka amalu ayitea prastutam arhata vunna varu okro iddaro migulutaremo -----

    రిప్లయితొలగించండి
  2. desenni bhashtu pattinchina rajakeeya vedhavalaku idi modati baanam.endukante karudu gattina rakshasulaku
    idi appude antha neppigaa undadhu

    రిప్లయితొలగించండి
  3. ee political basterds ku idi prarambam maatrame

    రిప్లయితొలగించండి
  4. తీర్పు సంతొషించదగ్గదే కానీ దీనికి మీడియా ఇచ్చినంత బిల్డప్ అనవసరం. ఈ తీర్పులో ఎన్నో పరిమితులు ఉన్నాయి.

    RPA సెక్షన్ 8(4) చెల్లదన్నది ఈ తీర్పు సారాంశం. ఈ సెక్షన్ కింద ప్రస్తుత శాసనసభ్యులకు అప్పీల్ చేసుకునేందుకు మూడు నలల గడువు ఉంటుంది. ఈ సమయంలో అపీల్ దాఖలా చేస్తే దాని తుది నిర్ణయం వచ్చే వరకు బహిష్కరణ (more correctly disqualification) వాయిదా అవుతుంది.

    దీన్ని కొట్టేసినంత మాత్రాన వారికి పెద్దగా నష్టం లేకపోవచ్చు. తాను అపీల్ చేసుకుంటానని, మీ తీర్పును మీరే స్టే చేయండని అడిగితె, న్యాయమూర్తి ఒప్పుకునే అవకాశాలు మెండు.

    మరో ముఖ్య విషయం: బహిష్కరణకు అన్ని శిక్షలూ కారణం కావు. కొన్ని చట్టాల కొన్ని సెక్షన్ల కింది శిక్ష/జరిమానా పడ్డ అందరికీ లేదా (ఇతర కేసులలో) రెండేళ్ళ కంటే ఎక్కువ శిక్ష పడిన వారికి మాత్రమె సెక్షన్ 8 వర్తిస్తుంది.

    Anyone convicted under non-specified laws/sections for 729 days or less will continue to be immune from disqualification. Even those convicted for > 2 years or under the relevant laws/sections can request an immediate stay. Most judges will agree unless the charges are grave.

    I see this ruling as a partial "victory"

    రిప్లయితొలగించండి
  5. నేర రాజకీయాలను అదుపుచెసే దిశగా పడ్డ ఒక చిన్న అదుగుగా ఉన్నత న్యాయస్థానం తీర్పును గుర్తిద్దాం. రాబొయే రోజులలో, ఈ చట్టానికి మరిన్ని మార్పులు జరగవలసిన అవసరం వుంది.

    రిప్లయితొలగించండి
  6. ఇంతకంటే ముఖ్యమయిన నిర్ణయం మరొకటి ఆ రెండు రోజులకే (వేరే కేసులో) వచ్చింది. ఈ తీర్పు నిలబడితే (నా అనుమానాలు నాకున్నాయి) ఇది నిజంగా సంచలనాత్మకం అవుతుంది.

    RPA సెక్షన్ 4/5 ప్రకారం ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్తికి తప్పని సరిగా వోటు వేసే హక్కు ఉండాలి (a representative must be an "elector").

    అదే చట్టం సెక్షన్ 62 వోటు హక్కు గురించి చెబుతుంది. శిక్ష పడినా లేదా కోర్టులో కేసు నడుస్తున్నా "ప్రస్తుతం" జైలు/పోలీసు కస్టడీలో ఉన్న వారికి వోటు వేసే హక్కు లేదని సెక్షన్ 62(5) స్పష్టం చేసింది. ముందస్తు అరెస్ట్ (preventive detention) అయిన వారికే మాత్రమె జైలు/పోలీసు కస్టడీలో ఉన్నప్పటికీ వోటు హక్కు ఉంటుంది.

    4, 5 & 62(5) సెక్షన్లు మూడింటినీ కలిపి చదివితే వచ్చే తాత్పర్యాన్ని అత్యున్నత న్యాయస్తానం ఈ రకంగా తెలిపింది.

    1. సెక్షన్ 4 & 5 ప్రకారం వోటరు (elector) మాత్రమె ప్రతినిధులు (representative) కాగలరు
    2. సెక్షన్ 62 (5) ప్రకారం ముందస్తు అరెస్ట్ కాకుండా ఇతర ఎ కారణాల వల్లయినా జైలు/పోలీసు కస్టడీలో ఉన్న వ్యక్తులు వోటర్లు కారు
    3. అంచేత అట్టి వ్యక్తులకు పోటీ చేసే హక్కు లేదు

    Link: http://www.livemint.com/Politics/BnmnCJJSKmxmqtFA2YLo5L/Those-in-jail-cant-fight-elections-Supreme-Court.html

    Text of 62(5):

    "No person shall vote at any election if he is confined in a prison, whether under a sentence of imprisonment or transportation or otherwise, or is in the lawful custody of the police:

    Provided that nothing in this sub-section shall apply to a person subjected to preventive detention under any law for the time being in force."

    రిప్లయితొలగించండి