భాజపా కురువృద్ధుడు, తనను అంపశయ్యపై వున్న భీష్ముడితో పోల్చుకున్న లాల్ కృష్ణ అద్వానీ గారు ఎన్ డి ఎ అధ్యక్ష పదవికి, పార్లమెంటు పార్టీ నాయకుడి పదవికి తప్ప పార్టీ లోని పార్లమెంటు బోర్డుకు, ఎన్నికల కమిటీకి మరియు జాతీయ ఎగ్సికుటివ్ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. తన ప్రత్యెక దూత దీపక్ చోప్రా ద్వారా పార్టీ అధ్యక్షుని రాజీనామా లేఖ పంపించారు. దీంతో, అద్వానీ గారి అనారోగ్య కారణం వెనుక వున్న అసలు మతలబు బయట పడింది. ఈ హటాత్పరిణామంతో ఖంగు తిన్న పార్టీ అగ్ర నాయకత్వం అద్వానీని బుజ్జగించే పనిలో పడింది.
బహుశా ఒకటి రెండు రోజులలో మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా శరద్ యాదవ్ నాయకత్వంలోని జనతా దళ్ (u ) కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించి ఎన్ డి ఎ నుంచి బయట పడే అవకాశం వుంది. మరోసారి మమతా బెనర్జీ కూడా యు పి ఎ కు మద్దతు ఇచ్చే అవకాశం వుంది. 2014 బెంగాల్ ఎన్నికలలో అటు ఎన్ డి ఎ కు మద్దతు ఇస్తే, మైనార్టీ వోట్లు పడవు. ధర్డ్ ప్రంట్లో కమ్యునిస్టులు వుంటారు కాబట్టి, యు పి ఎ మినహా మమతకు వేరే దారే లేదు. ఇదే పరిస్తితి ఎన్ సి పి కి, బిజు జనతా దళ్ కు కూడా వర్తిస్తుంది.
మోడీ ని భావి ప్రధాని అభ్యర్ధిగా చెప్పడం ద్వారా, భాజపా అంతర్గత కలహాలు ఎటు దారి తీస్తాయో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
ee desamloni sagatu manavudu modi ni abimanisthunnadu .emukalu kulli naralu chachi cunning polticians ki levaleni vidanga debbateeyalani aalochisthunnadu. prasthutha tharunamlo modi ni minchina monagadu evvadu ledu.partyla ku atheethanga modini abimaninche yuvatha medavula anda thokullu rajakiyalaku check cheppalsina samyam assanna mayyindi
రిప్లయితొలగించండి