10, జూన్ 2013, సోమవారం

మోడీ వెలిగిపోతున్నాడా!


ప్రమోద్ మహాజన్ గారు జీవించి వున్న కాలంలో 2004 ఎన్నికలప్పుడు ఇండియా షైనింగ్ పేరిట హంగామా చేసి బాక్సాఫీసు ముందు బొక్క బోర్లా పడింది భాజపా .      ప్రస్తుతం న. మో జపంతో గుజరాత్ షైనింగ్ కాబట్టి భారత్ కూడా తప్పకుండా వెలుగొందుతుంది.   నమో గారిని ప్రధానిగా ఎన్నుకోండి, గుజరాత్లో తను చేసిన పనులే మిగిలిన రాష్ట్రాల్లో కూడా చేస్తాడు అని చెప్పే ప్రయత్నం చేస్తోంది భాజపా.   


సువిశాల భారతావనికి ప్రధాని కావలసిన అర్హతలు మోడీకి ఉన్నాయా లేవా అనేది అనవసరం.    ఆయన ఆధ్వర్యంలో జరిగినట్లుగా ఆరోపణలు వున్న గుజరాత్ నరమేధం గురించి మర్చిపోదాం.    ప్రపంచ దేశాలలో ఆయనపై వున్న అభిప్రాయం మనకు అవసరం.    ఆయనకు వున్న విద్యార్హతలు, విదేశాంగ వ్యవహారాలపై  వున్న అవగాహన మనకు అవసరం.      మనది లౌకిక వాద దేశం.   దేశ జనాభాలో 75% మంది మధ్య తరగతి దిగువ మధ్య తరగతి ప్రజలు వున్నారు.   భాజపా గురించి గానీ, మోడీ గురించి గానీ  ఈ దేశ జనాభాలో 75 శాతం మందికి అవగాహన లేదు.    


గుజరాత్ లో తాము ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపాము అని గర్వంగా చెప్పుకొనే భాజపా నేతలు, ఆ రహస్యాన్ని చిన్న రాష్ట్రమైన చత్తీస్గడ్ (అక్కడ వుంది కూడా భాజపా ప్రభుత్వమే) పాలకులకు తెలిపితే వారు కూడా ఆ మార్గాన్ని అనుసరించి ఉగ్రవాదాన్ని అణచివేస్తారు కదా ! మరి ఆపని ఎందుకు చెయ్యరు.   


చిన్న రాష్ట్రాల వల్లే అభివృద్ధి జరుగుతుంది అని చెప్పే భాజపా, 17 కోట్ల ప్రజానీకం వున్న ఉత్తర ప్రదేశ్ ను విభజించడానికి ఎందుకు ఒప్పుకోదు?   ఎప్పుడో తీర్మానించిన ప్రత్యేక విదర్భ గురించి ఎందుకు ప్రస్తావించదు.    రాజధాని వున్న ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విడిపోకూడదు అన్న అద్వానీ అభిమతాన్ని వ్యతిరేకిస్తారా?     ఒకే చట్టం, ఒకే ప్రజ, ఒకే న్యాయం అనే మీ సిద్ధాంతాన్ని మీరు అధికారంలో వున్నపుడు ఎందుకు అమలు చెయ్యలేదు?  


ఎన్నికలప్పుడు, తాము గతంలో చేసిన కార్యక్రమాలు, రాబోయే ఐదు సంవత్సరాలలో చేయబోయే కార్యక్రమాల గురించి చెప్పాలి గాని కేవలం మోడీ గురించి చెప్పి వోట్లు కొల్లకోడతాం అని విర్ర వీగడం ప్రజలను వంచించడమే.    ఒక సందర్భంలో రామ జన్మభూమిని అడ్డుపెట్టుకుని ఎన్నికలలో నెగ్గారు.   ఈ సారి మోడీ హిందుత్వ అవతారికను అడ్డం పెట్టుకొని నేట్టుకొద్దామని ప్రయత్నం చేస్తున్నారు.     ఇలాంటి ప్రయత్నాలు సఫలం అయితే, రాబోయే కాలంలో భారత్ తీవ్ర సంక్షోభాన్ని ఎదురుకోవడం ఖాయం.  

7 కామెంట్‌లు :

  1. అయితే ఇప్పుడు కాంగ్రెస్స్ ప్రభుత్వంలో దేశం సుభిక్షంగా,వెలిగిపోతోందంటారా?

    రిప్లయితొలగించండి
  2. లేదు. మోడీ గారు మన్మొహన్ సింఘ్ కన్నా నిజాయతీపరుడు కాదు, ఆయన కన్నా గొప్పగా చదువుకున్న వాడు కాదు. మనది లౌకిక దేశం కాబట్టే ప్రపంచంలో భారత్ కు గౌరవం వుంది. మోదీ ప్రధాని అయితే, మనకు పాకిస్తాన్ కు తేడా వుండదు.

    రిప్లయితొలగించండి
  3. ఉగ్రవాదులపై ఉదారభావాన్ని చూపే ఎర్రలకి అధికారం ఇద్దాం లెండి అప్పుడు ఇండియా చైనాగా కానీ రష్యా గానీ అయిపోతుంది అప్పుడు చాలా బాగుంతుంది..

    మీకు తెలుసెమో ప్రపంచంలో చాలా మంది ఇండియా అంటే ఇస్లామిక్ దేశం అనుకుంటారు ..... కాస్త వార్తలు గమనించండి భారతీయుల్ని ముస్లింస్ అనుకుని రైళ్ళ కింద తోస్తున్నారు......

    "ఆయన కన్నా గొప్పగా చదువుకున్న వాడు కాదు. మనది లౌకిక దేశం కాబట్టే ప్రపంచంలో భారత్ కు గౌరవం వుంది." కాదు, ముమ్మాటికీ కాదు అది మీ భ్రమ...మనం ఒక్ మార్కెట్ లా కనిపిస్తాం వేరే వారికి....మన హైందవ సంస్కృతి అంటే పడి చచ్చే విదేశీయులున్నారు కానీ మనదేశం లో బొట్టుపెట్టుకోవడం మతతత్వం అయిపోతుంది!.

    చదువు అన్నారు సరె....మరి ఆ చదువు ఉన్న మన్మోహన్ గారి హాయాం లో స్కాములు అవుతుంటే మౌనంగా ఎందుకున్నారు? అగస్టాలో సొనియా ప్రమెయం ఉందని సుబ్ర్హ్మన్యస్వామి ఆరోపిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు?



    ఈ కాంగ్రెస్స్ బానిస్త్వం నీతరానికిపోదేమో కానీ నా తరం లో ఈ బానిసత్వ ఉండకూడదని నా ధృడ అభిప్రాయం!.

    మోడీ వద్దు కానీ డిగ్రీ కూడా పాస్స్ కాని రహుల్ హయాం లో ప్రధాని ఉండాలి అనుకుంటే అంతకన్నా అఙానం ఉండదు(యు.పి.ఎ.3 లో రాహుల్ ప్రధాని కాకపొవచ్చు కానీ ప్రధాని ఖచ్చితంగా చెంచా అయితీరుతాడు- ఇప్పటి మన్మోహన్ కన్నా ధారునమైనా బానిస అధికార పీటం లో ఉండి అధికారం ఇటలీ చేతిలో ఉండడం ఖాయం).
    మోదీ ప్రధాని అయితే, మనకు పాకిస్తాన్ కు తేడా వుండదు


    అవును అందుకే గుజరాత్ లొ నెలకొక బాంబు ధాడి, 10 యెళ్ళలో అన్నీ కర్ఫ్యూ లే కదా........
    కళ్ళు ఆకుపచ్చ- ఎరుపుతో నిండి, చేతి మధ్యలోంచి చూ(పే)సే మీడియా ఉంటే పాకిస్తాన్ కీ భారత్ కీ తేడా ఎం లేదు!

    రిప్లయితొలగించండి
  4. గుజరాత్ అల్లర్ల లో ఎక్కువ చనిపోయింది హిందువులు అయినా మోడీ దగ్గరుండి ముస్లింస్ ని చంపించినట్లు మీడియా చూపెడుతారు........
    కానీ ఈ మీడీయాకి తెలియదా ఉగ్రవాదుల దాడుల్లో అంతకన్నా ఎక్కువమంది చనిపొయారని, మరి మిగతా ముఖ్యమంత్రులు ఎం చర్యలు చేపట్టారు-

    చత్తిస్ గడ్ అన్నారు మీరు కాస్త విపులంగా పరిశీలించండి చత్తిస్ ఘడ్ పాపం కేంద్రంది. కేంద్రం సరైన సహకారం రమన్సింఘ్ ప్రభుతావికి ఇవ్వటం లేదు, ఛత్తిస్ ఘడ్ నక్సల్ విషయం లో కేంద్రం జొక్యం ఎక్కువ ఉంది.

    అదే మన ఆంధ్రప్రదెశ్ లొ పూర్తి అధికారం వై.ఎక్ష్ రాజశెఖర్ రెడ్డి కి ఇచ్చింది కానీ రమణ్ సింఘ్ ని ఎలాగైనా దెబ్బతీయాలని వింత వింత చర్యలతో చత్తిస్ ఘడ్ ని రక్త సిక్తం చేస్తుంది యు.పి.ఎ ప్రభుత్వం.

    రిప్లయితొలగించండి
  5. ఏమిట్లో ఆయన నిజాయితీపరత్వం?ఆయన చదువు దేశానికేమైనా ప్రస్తుతం ఉపయోగపడుతూ ఉందని మీరు భావిస్తున్నారా?మోడీ ప్రధాని అయితే భారత్ పాకిస్థాన్ అవుతుందనే మీ భయం అర్థం లేనిది.ఒకసారి గుజరాత్ వెళ్ళి అక్కడ ప్రజలను ప్రస్థుత పరిస్థితి గురించి అడగండి.కాంగ్రెస్ అద్దాలు ధరించి దేశాన్ని చూడొద్దని నా మనవి.

    రిప్లయితొలగించండి
  6. అయ్యా వృత్తాంతి గారూ..
    మోడీ కాంగ్రేస్ నాయకుల లాంటి కుహనా లౌకిక నాయకుడు కాదు. ఆయన తనకు కేంబ్రిడ్జి డిగ్రీ ఉంది అని దొంగ మాటలు ఏమీ చెప్పలేదు.( అలా చెప్పిందెవరో మీకు తెలుసు అనుకుంటాను.) మోడీ పొలిటికల్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీ చేసారు. దేశాన్ని ఏలాలంటే అంతకన్న ఇంకేం చదువు కావాలో మీరే సెలవియ్యండి.
    ఈ దేశానికి కాబోయే నాయకుడికి కావల్సింది సమర్ధత, దేశం పట్ల ప్రేమ, అభివృద్ధి పట్ల దార్శనికత. ఇవన్నీ మోడీకి పుష్కలంగా ఉన్నాయి.
    ఇంకో ముఖ్య విషయం. మోడీని అన్ని వర్గాలు ఆమోదిస్తాయి.
    ముస్లిం సోదరులు చాలా మంది గుజరాత్లో మోడీని సమర్ధిస్తున్నారు. గుజరాత్ అభివృద్ధిలో వారు కూడా భాగమయ్యారు.

    రిప్లయితొలగించండి
  7. మోడీ ఎలాంటి వాడో, వారి పార్టీ అగ్ర నేత అద్వానీ గారే సెలవిచ్చారు. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

    గుజరాత్ ప్రగతిలో రెలయన్స్ పెద్దలు, అదానీ సంస్థల పాత్ర ఏమిటో పారిశ్రామిక రంగ నిపుణులకు తెలుసు. ఆదాని రాత్రికి రాత్రి ఇంత గొప్పవాడు ఎలా అయ్యాడొ అండరికీ తెలుసు.

    వచ్చె 10-15 సంవత్సరాలలొ ఏ పార్టీ సొంతంగా అధికారంలోకి రాలేదు. మమత, సమత, ములయం, మాయ, బిజు, టి డి ఫి లేకుండా అధికారంలోకి రావడం కల్ల.

    రిప్లయితొలగించండి