7, జూన్ 2013, శుక్రవారం

సి బి ఐ జాయంట్ డైరెక్టర్ బదిలీ


గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరదింపుతూ సి బి ఐ జాయంట్ డైరెక్టర్ శ్రీ లక్ష్మీనారాయణ బదిలీని సి బి ఐ డైరెక్టర్ నిర్ధారించారు .    అత్యంత సమర్ధుడుగా, నిజాయితీ పరుడుగా ఎన్నో క్లిష్టమైన, కీలకమైన కేసులను ఛేదించిన ఘనత  ఆయనకు దక్కుతుంది.    కొన్ని వేల కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్న వారిని చట్టం ముందు నిలబెట్టి న్యాయ, పోలీసు వ్యవస్థపై సామాన్య ప్రజలలో నమ్మకాని ఇనుమడింప చేసిన  హీరో లక్ష్మీనారాయణ.    


పత్రికా స్వాతంత్ర్యం మాటున అను నిత్యం తన గురించి ఒక పత్రికలో విమర్శలు గుప్పిస్తున్నా ఆత్మస్థైర్యాన్ని ఏ మాత్రం కోల్పోకుండా, మొక్కవోని ధైర్యంతో తన కర్తవ్యాన్ని నిర్వర్తించిన ధీరుడాయన.    చిన్న చిన్న పట్టణాలలో కూడా ఆయన కటౌట్లు పెట్టి సినిమా హీరోలకు ఇచ్చినంత ప్రాధాన్యం ఇచ్చారంటేనే ఆయన ఖ్యాతి తెలుస్తుంది. 


ఆయన మహారాష్ట్రకు వెళ్ళినా, దిల్లీకి వెళ్ళినా, ఒక నిజాయతీ కల అధికారి ఎలా ఉంటాడో, ఎలా ఉండాలో ఆయన పేరు చెప్తేనే స్ఫురణకు రావడం ఖాయం.    శ్రీ లక్ష్మీనారాయణ తెలుగువాడైనందుకు  గర్వపడదాం  

3 కామెంట్‌లు :

  1. కథ మళ్ళీ మొదటికి.

    ఇకనుండీ శ్రీ y. s. జగన్మోహన్ రెడ్డిగారి మహోన్నత మైన దేశభక్తీ ప్రజాసేవాకార్యక్రమాల గురించిన వార్తలు వెలువడటం మొదలవుతుందన్న మాట.

    అవునేమో. ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కదా. ఇంకా యేమేం వింతలు జరుగుతాయో. అన్నట్లు శ్రీగాలి జనార్దన రెడ్డిగారికి కేంద్రమంత్రి పదవీ యోగం వస్తుందా తొందరలో? వేచి చూడండి.

    రిప్లయితొలగించండి
  2. శ్యామలీయం గారు,

    మన దేశంలో ఏదైనా సాధ్యమే. అయితే, లక్ష్మీనారాయణ లాంటి నిజాయితీ గల కొంత మంది అధికారులు మన దేశంలో వుండబట్టే ఇంకా మనం బతికున్నాం.

    రిప్లయితొలగించండి
  3. శ్రీ లక్ష్మినారాయణ గారిలాంటి సత్యకాలపు అధికారులు ఈ కాలంలో అరుదాతి అరుదు!అటువంటివారిని అవసరమయిన చోట అవసరమయినప్పుడు వాడుకొని మరోచోటికి బదిలీ చేస్తారు!తమ చెప్పుచేతల్లో ఉండని కొరకరాని కొయ్యలు రాజకీయనాయకులకు ససేమిరా రుచించనే రుచించరు!వారు కొరివితో తల గోక్కోరు!మంచి అధికారి వారికి చుక్కలు చూపించి ఉచ్చ పోయిస్తాడు!అయినా లంచగొండితనాన్ని జాతీయంచేసినా ప్రజలు నిమ్మకు నీరేత్తినట్లు చూస్తూ ఉండిపోయే దేశంలో ఎవరు ఉండి ఏమి చేయగలరు!నిజాయితీ గల అధికారులకు అండగా ఓటర్లు పత్రికలు న్యాయ స్థానాలు నిలవాలి!

    రిప్లయితొలగించండి