రాజకీయ నిరుద్యోగులకు ఎ పి పి ఎస్ సి ఆశ్రయం కల్పిస్తున్నట్లు ఇటీవల పుంఖాను పుంఖాలుగా వార్తలు వస్తున్నాయి. కేంద్ర సర్వీసులలో గుమస్తా, స్టెనోగ్రాఫర్ మరియు ఆఫీసర్ ఉద్యోగాలకు స్టాఫ్ సెలెక్షన్ కమీషన్ గత కొన్ని దశాబ్దాలుగా నియామకాలను చేపడుతోంది. ఈ పరీక్ష కేవలం ఆబ్జెక్టివ్ ప్రశ్నల ఆధారంగా మాత్రమె దేశవ్యాప్తంగా నాలుగు జోన్ల ద్వారా నిర్వహించబడుతుంది. పరీక్షలో వచ్చిన మార్కుల ద్వారా ఉద్యోగుల నియామకం జరుగుతుంది. ఈ విధానం పారదర్శకంగా జరుగుతుంది.
ఎ పి పి ఎస్ సి ఇచ్చే చిన్న చిన్న ఉద్యోగాలకు కూడా ఇంటర్వ్యూ పేరుతో డబ్బులు దండుకొనే విధానానికి ఇక నుండైనా స్వస్తి చెప్పాలి. బోర్డు సభ్యులను కూడా కేవలం పదవీ విరమణ చేసి నిజాయతీతో పేరుతెచ్చుకున్న IAS అధికారులను మాత్రమె నియమించాలి. ఎట్టి పరిస్తితులలో రాజకీయ నిరుద్యోగులకు అవకాశం ఇవ్వకూడదు. ఈ సంస్థ సభ్యులను నియమించే అధికారం కేవలం గవర్నర్ పర్యవేక్షణలో జరగాలి.
ఇలాంటి తక్షణ చర్యల ద్వారా మాత్రమే ప్రభుత్వం నిరుద్యోగులకు ఊరట కల్పించ గలదు.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి