26, జూన్ 2013, బుధవారం

కెమారాకే కాదు, ఏనుగుకి కూడా చిక్కాడు



ఈ మధ్య  వార్తలలో తరచూ మనం వింటున్నాం, ఏనుగులు, పులులు జనారణ్యంలోకి వస్తున్నాయని.    వాస్తవానికి మనమే జంతువుల  ఆవాసాలైన అడవులను నరికి, ఎక్కడపడితే అక్కడ చెరువులు, కుంటలు ఆక్రమిస్తూ, వాటి అరణ్యాలను మనమే హరిస్తూ ప్రకృతినే సవాలు చెస్తున్నాము.      ఏనుగులు కానీ, పులులు కానీ అడవి వదలి బయటకు రావాలని కోరుకోవు.   పులులైతే, వయసు మళ్ళిన తరువాత దానికి చెందిన అటవీ ప్రాంతంలోకి వయసులో వున్న వేరే  పులి ప్రవేసించి ఆక్రమణకు ప్రయత్నిస్తే (TERROTORIAL ఫైట్) వృద్ధ వ్యాగ్రాలు లేదా ఓడిపోయిన జంతువు తన టెరిటరీ కోల్పోయి బయటకు వస్తుంది.     అలాగే ఏనుగులకు ఒక   కారిడార్ వుంటుంది.    ఏనుగుల మంద ఎన్ని సార్లు ప్రయాణం చేసినా అదే దారులలో నడుస్తుంది.     దాని మల మూత్ర విసర్జన ద్వారా వచ్చే రసాయనాల వాసన వలన ఏనుగులు   దారి తప్ప కుండా వాటిన గమ్యం చేరుతాయి.    అడవుల నరికివేత ద్వారా ఆహారం, నీరు కోల్పోయిన జంతువులు జనావాసాల మీద పడుతున్నాయి.   


రెండు రోజుల క్రితం బెంగళూరు సిటీ నుంచి కేవలం 45 కిలో మీటర్ల దూరంలో మాలుర్ అటవీ ప్రాంతంలో (ఇక్కడకీ అతి సమీపంలో కొత్తగా పెద్ద పారిశ్రామిక వాడ వెలిసింది) పెద్ద ఏనుగుల మంద వచ్చింది.     ఏనుగు, చిన్న శబ్దం వచ్చినా పసికడుతుంది మరియు ఎక్కువ శబ్దం దానికి చికాకు కలిగిస్తుంది.   వాటి మానాన వాటిని వదిలి పెట్టకుండా మునిరాజు అనే వ్యక్త్రి కేవలం 30 అడుగుల దూరం నుంచి చూడడానికి ప్రయత్నం చేశాడు.   దురద్రష్ట వశాత్తు అదే సమయంలో అతని జేబులోని చరవాణి (సెల్ ఫోన్) మోగడంతో, ఒక పెద్ద ఏనుగు అతనిని వెంబడించి   తొండంతో చుట్టి కాలుకింద పడేసి తొక్కే సమయంలో సమీపంలో నిలబడి చూస్తున్న వారు చేసిన హంగామాకు భయపడి దూరంగా వెళ్ళింది.   ఈ ఘటనలో మునిరాజు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.       అక్కడకు దగ్గరలోనే వున్న విజయ కర్నాటక పత్రిక ఫోటో జర్నలిస్టు తను పరుగెడుతూ కూడా ఈ దురదృష్ట సంఘటనను తన కేమారాతో చిత్రాలు తీశాడు.  


జంతువులు మన జోలికి రావు, అలా అని వాటి జోలికి మనం వెళితే విషాదమే మిగులుతుంది.     


ఫోటో సౌజన్యం : విజయ కర్నాటక 

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి