నమస్తే తెలంగాణా పత్రిక అధిపతి, గుత్తేదారు అయిన రాజాం గారు తెలంగాణా రధం పేరిట ఒక వాహనాన్ని కృష్ణా జిల్లాకు పంపారు. దీని ఉద్దేశం, తీర ప్రాంత ప్రజలలో చైతన్యం తీసుకొచ్చి తెలంగాణాకు అనుగుణంగా వారి మద్దతు కూడగట్టడం. ఇది నిజంగా హర్షించదగ్గ చర్య. అయితే, ఇదే రాజాం గారు తన పత్రిక ద్వారా, అను నిత్యం ఇరు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వారి అంతర్జాల ఎడిషన్ లో వార్తా కధనాలకు పాఠ కులనుండి వచ్చే 'రీడర్స్ కామెంట్స్' ని మోడరేట్ చేసి ప్రచురిస్తారు. వారు మోడరేట్ చేసిన వ్యాఖ్యానాలు చూస్తె అర్ధమౌతుంది వారికి మిగిలిన ప్రాంత ప్రజల మీద వున్న అభిమానం. వాటి నిండా పచ్చి బూతులు. సభ్య సమాజం తలదించుకునేలా వుండే అసభ్యకర రాతలు.
ప్రెస్ క్లబ్ లో వేరే ప్రాంతం వాళ్ళు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే వాక్ స్వాతంత్రం కూడా లేకుండా చేసి, దానినే ఒక పెద్ద విజయంగా నమస్తే తెలంగాణా పత్రికలో ప్రచురించినప్పుడు వేరే ప్రాంత ప్రజలు గుర్తుకు రాలేదా! తెలంగాణా ప్రాంతంలో వేరే ప్రాంత ప్రజలు ఉండటానికి వీలు లేదని మీ పత్రిక ద్వారా అనేక సందర్భాలలో ప్రచురించారు. అప్పుడు తీర ప్రాంత ప్రజలు గుర్తుకు రాలేదా? పత్రికా స్వేచ్చ ముసుగులో ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టినప్పుడు లేని పెద్దరికం, ఇప్పుడు ఎక్కడ నించి వచ్చింది. సింగిడి కవులు పేరుతొ పచ్చి బూతులు రాసినపుడు గర్హించని మీ గురువింద నీతిని ఏమనాలి?
ఏ పత్రిక కూడా ఒకే ప్రాంతానికి పరిమితమై తన మనుగడ సాధించలేదు. కేవలం సర్కులేషన్ పెంచుకునేందుకు మీరు చేస్తున్న నాటకంలో భాగంగానే మీ దండ యాత్రగా భావించాల్సి వుంటుంది.
nice post....
రిప్లయితొలగించండి