సార్వత్రిక ఎన్నికలకు కేవలం 10 మాసాల గడువు ఉన్నపట్టికి, 29 మంది ఎంపీలను పార్లమెంటుకు పంపి యు పి ఎ ప్రభుత్వ మనుగడకు ఆధారమైన కాంగ్రెస్ సభ్యులను పార్లమెంటుకు పంపిన ఆంద్ర ప్రదెశ్కు ఎట్టకేలకు సముచిత గౌరవం దక్కింది.
తెరాసా నాయకుడు హరీష్ మాత్రం, మంత్రి వర్గ విస్తరణలో కూడా తెలంగాణాకు అన్యాయం జరిగిందని వాపోయారు.
రెండు దశాబ్దాల క్రితం వచ్చిన ప్రతిధ్వని అనే సినిమాలో బలగం పొట్టి సీతయ్య అనే ఒక కారెక్టర్ వుంది. అందులో పరుచూరి గోపాల కృష్ణకు సహాయకుడిగా ఒక విలేఖరి (అల్లు?) ఉంటాడు. ముఖ్యమంత్రి ఏ నిర్ణయం తీసుకున్నా దానికి వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ తయారు చేస్తాడు బలగం పొట్టి సీతయ్య అనే ప్రతి పక్ష నాయకుడు. ముఖ్యమంత్రి గారి భార్య ఆసుపత్రిలో వుంది అని విలేఖరి చెప్తాడు. అయితే రెండు స్టే ట్ మెంటులు రాస్కో, ఒకవేళ ముఖ్యమంత్రి గారు భార్యను చూడడానికి వెళితే, ఇక్కడ రాష్ట్రం అగ్గి మీద గుగ్గిలంలా వుంటే, ప్రజల్ని వాళ్ళ కర్మకు వదిలేసి భార్య కోసం మద్రాసు వెళతాడా అని రాస్కోండి. ఒక వేళ భార్యను చూడడానికి వెళ్ళాక పొతే, కట్టుకున్న భార్య మీదే ప్రేమ లేని వాడికి ప్రజల మీద ఈయనకేం ప్రేమ వుంటుంది అనేది రెండో స్టేట్మెంట్.
మొన్నటి దాకా, ఇక్కడి పిల్లలు వేల సంఖ్యలో పిట్టల్లా రాలిపోతూ ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే, తెలంగాణా ప్రాంతం నుంచి ఎవరు పదవుల కోసం పాకులాడినా, మంత్రివర్గంలో చేరినా వాళ్ళంతా తెలంగాణా ద్రోహులే అని చెప్పారు. ఇప్పుడేమో మంత్రి వర్గంలో తెలంగాణాకు అన్యాయం జరిగిందని అంటారు. మొట్టమొదటగా మంత్రివర్గంలో చోటు దక్కింది జైపాల్ రెడ్డి గారికి ఆ తరువాత సర్వే సత్యనారాయణ, బలరాం నాయక్ గార్లకు. చివరకు ఇంకా 10 నెలలు మాత్రమె ఉందనగా ఇప్పుడు మరో ఇద్దరికీ దక్కింది.
కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న 11 మంది తెలంగాణా ఏమ్పీలలో ఇద్దరు తెరాస కండువా కప్పుకున్నారు. పాపం రాజయ్యకు అనుకున్నది దక్కక కారు దిగాడు. ముగ్గురు ఎం పీ లు ఇప్పటికే మంత్రులు కాగా మిగిలింది ఐదుగురు మాత్రమే. ఈ ఐదుగురిలో ఒకాయన తెలుగు దేశం నుంచి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన జైపాల్ రెడ్డి బంధువు కాగా, అదే జిల్లాకు చెందినా ఇంకొక వ్యక్త్రి ఎన్నికలలోపు జగన్ దగ్గరికో, తెరాసా దగ్గరికో వెళ్ళే ఆలోచనలో వున్న ఇంకో పెద్ద మనిషి. ఒక్క సురేష్ శేట్కర్ తక్క మిగిలిన ఇద్దరు (పొన్నం, మధు యాష్కీ) వీలున్నప్పుడల్లా ముఖ్యమంత్రిని విమర్శిస్తారు. మరి మంత్రి వర్గంలో చోటు ఎలా దక్కుతుంది చెప్పండి హరీష్ గారు?
తెలంగాణా నుంచి మంత్రి పదవికి ఎక్కువ అర్హత కలిగిన ఎంపీలు ఎవరైనా వున్నారా అంటే, అది కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు గారు మాత్రమే. ఆయన మంత్రివర్గంలో చేరి వారి ప్రాంతాంకి కావలసిన నిధులు తెచ్చుకుంటే తప్పేంది? తెలంగాణాను ఉద్ధరిస్తే తప్పేంటి? ఆలోచించండి సారూ.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి