18, జూన్ 2013, మంగళవారం

ఉప ప్రాంతీయ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

పాపం కేకే!   ఎట్లుండే మనిషి ఎలా ఐపోయాడో చూడండి.    తెలుగులో సరిగా మాట్లాడ లేకపోయినా, ఆంగ్లం మరియు హిందీలలో అనర్గళంగా అర్ధంకాకుండా మాట్లాడే మన కేకే ఇప్పుడు ఒక ఉప ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి.     పేరు వినడానికి మాత్రం చాలా బాగుంది, అదేదో యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్ లాగా.      నావ లాంటి కారు నడిపే మన సరంగు కచరా గారు ఆయన్ని ఈ పదవి ద్వారా బోడి మల్లయ్యను చేసేశాడు.     ఇద్దరు ఎంపీలను తెరాసాలో చేర్పించిన మన కేకే  ఇప్పుడు జాతీయ స్థాయి పదవికి ప్రమోట్ అయ్యాడు.        


ఒకప్పటి పి సి సి అధ్యక్షుడు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు, రాజ్య సభ సభ్యుడు, మాజీ మంత్రి, బెంగాల్ ఎన్నికల ఇంచార్జ్ కి పట్టిన గతి ఇది.     మన కారు సారధి ఇచ్చిన షాక్కు దిమ్మతిరిగి మైండు బ్లాకు అయివుంటుంది పాపం.     

2 కామెంట్‌లు :

  1. లే లే....గట్ల ఎట్ల అయ్తది ..... కె.సి.ఆర్. తప్పుకుని గా అధ్యక్ష కుర్సీల కేకే ని కూకోబెట్టాలే!

    Narsimha K

    రిప్లయితొలగించండి