మన రాష్ట్రానికి చెందిన బి జె పి నాయకుడు, ఒకప్పటి జాతీయ పార్టీ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు గారు కర్నాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. కర్నాటక శాసన సభ ఎన్నికల సందర్భంగా ఆయన తన వోటు హక్కు వినియోగించుకోవడానికి మల్లేశ్వరం నియోజకవర్గం లోని ఒక పోలింగు బూతుకు వచ్చి, క్యూ లైను ఖాతరు చెయ్యకుండా సరాసరి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాడు. వోటర్లలో వి ఐ పి వోటర్లు ఉండరనే సత్యాన్ని పాపం మర్చి పోయాడు పాపం . కానీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తు చేసి లైను లో రమ్మని క్లాస్ పీకారు. నేను పార్లమెంటు సభ్యుడ్ని, వేరే కార్యక్రమం వుందన్నా, అక్కడ ఆయన్ని ఎవరూ గుర్తు పట్టలేదు, పత్తించుకొలెదు. చివరకు, బుద్ధిమంతుడిలా వరుసలో నుంచిని ఆయన తన అమూల్యమైన వోటు హక్కు వినియోగించుకున్నాడు.
అంత్య ప్రాసలతో, తనదైన శైలిలో నిరంతరం టి వి ల ద్వారా పత్రికల ద్వారా మనకు కనువిందు చేసే నాయుడు గారిని సామాన్య వోటరు గుర్తుపట్టక పోవడం నన్ను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది.
అదేంటీ ఈనాడులో అలా రాయలేదే ... ప్రజాస్వామ్యం మీద నమ్మకంతో వోటర్లను గౌరవించి తానే ( వెంకయ్య) క్యూలో వచ్చినట్టు రాసారే
రిప్లయితొలగించండిhttp://www.deccanherald.com/content/330429/bjps-venkaiah-naidu-falls-line.html
రిప్లయితొలగించండిమీకోసం, నేను పేపర్ కటింగు లింకు ఇస్తున్నాను.ఈనాడు లో అట్లానే వస్తుంది.