నోబుల్ పురస్కార గ్రహీత, 97 సంవత్సరాల కురువృద్ధుడు, దక్రిష్ణాఫ్రికా విముక్తి పోరాట యోధుడు నెల్సన్ మండేలా దురదృష్ట వశాత్తు ఆంద్ర ప్రదేశ్ రాజకీయ వార్తల్లో వ్యక్తి అయ్యాడు. శ్వేత జాతి పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి కారాగార శిక్షను అనుభవించిన మండేలా, మన జగన్ బాబు సరసన ఫ్లేక్సీలలో చేరాడు. జైలుకు వెళ్ళిన ప్రతి వాడు గాంధీలు, మండేలాలు కాలేరు. అలాగే, ప్రజా కోర్టులో నెగ్గిన ప్రతి వ్యక్తీ పునీతుడు కాలేడు. మహారాష్ట్రలో పేరు మోసిన పెద్ద అండర్ వరల్డ్ డాన్ అరుణ్ గవ్లి, స్వతంత్ర అభ్యర్ధిగా జైలు నుంచి పోటీ చేసి శాసన సభకు ఎన్నిక అయ్యాడు. నిన్న మొన్నటి దాకా జూనియర్, సీనియర్ ఎన్ టి ఆర్, ప్రభాస్ మొ॥ నటుల సరసన మాత్రమె చేరిన జగనన్న ఇప్పుడు కొత్తగా అంతర్జాతీయ స్థాయికి ఎదిగి మండేలా సరసన చేరడం చూస్తె, రాజకీయాలు ఎంతగా పతనావస్తకు చేరాయో అర్ధమౌతుంది.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి