బహిష్కృత తెరాస నేత, మంచి వక్త, న్యాయవాది రఘునందన్ పుంఖాను పుంఖాలుగా తెరాస కుటుంబం మీద గత రెండు రోజులుగా ఆరోపణలు చేస్తున్నారు. డబ్బులు వసూలు చేయడం తప్పేమీ కాదని, ఈ సారి ఎన్నికలలో సూట్ కేసులు తెచ్చిన వాళ్ళకే సీట్లు అని తెగేసి చెప్పి దానికి చట్ట బద్ధత కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తెరాసకు చెందిన న్యాయవాది, విద్యావంతుడు ప్రకాష్ గారు.
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను గత దశాబ్ద కాలంగా పరిశీలిస్తున్న వారికి ఈ ఆరోపణలు పెద్ద ఆశ్చర్యం కలిగించలెదు. పదే పదే ఈ విషయాలను తీర సీమాంధ్ర నేతలు చెప్తున్నా, వారు "ఆంధ్రోల్లు" కాబట్టి వాళ్ళ మాటలు మనం విశ్వసిన్చకూడదు. ఈ విషయాలు తెలిసిన చాలా మంది తెలంగాణా నేతలు కూడా తమ మీద "తెలంగాణా ద్రోహి" అనే ముద్ర పడుతుందనే భీతితో బయట పడ లేదు. కాంగ్రెస్స్ పార్టీ కె సి ఆర్ ను మానేజ్ చేస్తుండగా, అల్లుడు గారు విద్యాలయాయలు, సుపుత్రుడు కార్పోరేట్ రంగాన్ని, కుమార్తె సినీ రంగాన్ని ఆట ఆడి చ్చారు. ఇటీవల ఫిక్సింగ్ లో పట్టుబడ్డ శ్రీశాంత్ ఒక టవల్ ను బయటకు ప్రదర్శించడం ద్వారా సంకేతం ఇచ్చి బుకీలను సంతోషపరిచాడు. ఈ టెక్నిక్, మన సినీ రంగంలో ఎప్పుడో ప్రారంభమైంది. తెరాసకు సంబంధించిన, సినిమాలతో సంబంధం లేని తెరాస నాయకులను, సి డి విడుదుల కార్యక్రమాలకు, ముహూర్తం షాట్ లకు పిలవడం ద్వారా, అమాయకులైన తెరాస కార్యకర్తలకు సిగ్నల్స్ ఇస్తారు. మనకు రావలసింది మనకు ముట్టింది, ఈ సినిమా షూటింగ్ మీద దాడులు చెయ్యొద్దు అని ఉద్యమ కారులకు అర్ధమౌతుంది. అలాగే, స్కూళ్ళు, కాలేజీలు బందు అంటారు. "అదియును నీ పతి ప్రాణంబు దక్క" అన్నట్లు, చైతన్య, నారాయణలకు మాత్రం ఈ బందు వర్తించకుండా జాగర్త పడతారు. కేవలం ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు (ఎక్కువ శాతం పేద విద్యార్ధులు ఇక్కడ చదువుతారు) , విశ్వ విద్యాలయాలు మాత్రం ఎంచక్కా మూసేస్తారు. హైదరాబాదులో రెండు సంవత్సరాల క్రిందట, కార్పోరేట్ కంపెనీల ప్రముఖుల్ని అందర్నీ ఒక చోట సమావేశ పరచి, తెరాస పెద్దలు వాళ్లకి క్లాస్ పీకారు. మీరు భయపడవద్దు, మీ డబ్బుకు మేము రక్షణగా వుంటాం, అని శెలవిచ్చారు
ఏతా వాత రఘు నందన్ ఎపిసోడ్ వల్ల తేలింది ఏమిటంటే, హరీష్ రావ్ ఆకృత్యాలకు ఆగడాలకు తెరాస కుటుంబం కూడా విసిగిపోయిందని, పార్టీలో దాదాపు రెండవ స్థానంలో వున్న హరీష్ ఎప్పటికైనా తమ కంట్లో నలుసౌతా డని తెలిసే కెసిఆర్ కాని, ఆయన కొడుకు గాని హరీష్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చెయ్యలేదు.
ఈ కుటుంబ పతనాన్ని, దయచేసి తెలంగాణా పతనంగా చూడవద్దు. తెలంగాణా వేరు తెరాస వేరు అని ఆలోచించిన రోజు నిజాన్ని నిజంగా చూడగలుగుతారు. కందుకము వోలె సజ్జనుడు, మృత్తికము వోలె దుర్జనుడు .... అన్న పద్యం గుర్తొస్తొన్ది. నోటికి ఎంతోస్తే అంత మాట్లాడడం, సభ్యతా, సంస్కారం లేకుండా అసెంబ్లీ సాక్షిగా జయప్రకాశ్ నారాయణ్ మీద చెయ్యి చేసుకోవడం, పోలీస్ అధికారులను వ్రాయడానికి కూడా జుగుప్సు కలిగేలా బూతులు తిట్టడం, ఎ పి భవన్లో ఒక దళిత అధికారిని విపరీతంగా కెమారాల సాక్షిగా కొట్టడం వారి పతనానికి సూచికలు. లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి, వేర్పాటు మాత్రమె జిందా తిలిస్మాత్ లా సర్వరోగ నివారిణి అని చెప్పి అమాయకులను రెచ్చగొట్టి ఆత్మ హత్యలకు పురిగొల్పి, దానికి అందమైన పేరు 'బలిదానం' అని వాటిని పదే పదే చెప్తూ, టి వి లలో చూపిస్తూ గ్లోరిఫై చేసే ప్రయత్నం చేసారు. ఎం తో మంది కన్న తల్లులకు కడుపు శోకం మిగిల్చారు . ఇన్ని పాపాలు చేసిన వ్యక్తులకు తమ పాపలు రాబోయే రోజుల్లో కట్టి కుడుపుతాయి అనడంలో సందేహం లేదు.
లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి,
రిప్లయితొలగించండివేర్పాటు మాత్రమె జిందా తిలిస్మాత్ లా సర్వరోగ నివారిణి
అని చెప్పి అమాయకులను రెచ్చగొట్టి
ఆత్మ హత్యలకు పురిగొల్పి,
దానికి అందమైన పేరు 'బలిదానం' అని వాటిని పదే పదే చెప్తూ,
టి వి లలో చూపిస్తూ
గ్లోరిఫై చేసే ప్రయత్నం చేసారు.
ఎం తో మంది కన్న తల్లులకు కడుపు శోకం మిగిల్చారు .
ఇన్ని పాపాలు చేసిన వ్యక్తులకు
తమ పాపలు రాబోయే రోజుల్లో
కట్టి కుడుపుతాయి అనడంలో సందేహం లేదు. >>>>>>>>>>>>>>>>>>
Ahaa em chapaavayyaa. achcham Lagadapaati anamngu shishyudilaa .
Why can't you worship Kancha Illaiah as hero? He spills very strong venom on Telangana movement in the name of caste.
రిప్లయితొలగించండిఐలయ్య గారి దగ్గర నేర్చుకొనేది ఏమైనా వుంటె తప్పక నేర్చుకుంటాను. మీకు నచ్చే విధంగా ప్రపచం మొత్తం ఉంటుందనుకొవడం పొరపాతు. కంచె ఎలయ్య చెప్పేది ఎంతవరకు నిజమో భవిష్యత్లో తెలుస్తుంది. మీరు హరీష్ రావు గారి భక్తుల్లాగా కలకాలం అణిగిమణిగి ఉండాలని, భావ ప్రకటనా స్వేచ్చను అడ్డుకోవాలని కోరుకుంటున్నాను.
రిప్లయితొలగించండిమీరు జీవితాంతం కె సి ఆర్ కుటుంబానికి విధేయులుగా వున్నా సరే, నేను మాత్రం వ్యక్తి పూజ చెయ్యను.
రిప్లయితొలగించండి