ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్లు అనేది సామెత. మంచి మాస్టారుగా, నిజాయితీ పరుడుగా పేరున్న దాడి వీరభద్ర రావు తెలుగు దేశంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణం తరువాత ఆ పార్టీతో బంధం తెంచుకున్నారు. ఈ విషయంలో ఆయన తప్పు పెద్దగా లేనప్పటికీ, ఆయన జగన్ గూటికి చేరతారని వస్తున్నా వార్తలు ఆయన అభిమానుల్ని కలవర పెడుతున్నాయి. నేడో, రేపో చంచల్గుడా జైలుకు వెళ్లి తీర్ధ ప్రసాదాలు స్వీకరిస్తారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రిగా, మంచి వక్తగా, శాసన మండలి ప్రతిపక్ష నాయకుడిగా, నిజాయతీ పరుడిగా పేరున్న దాడి జైలు పార్టీకి వెళ్ళడం ఆత్మహత్యా సదృశం కాగలదు.
3, మే 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి
(
Atom
)
జైలు పార్టీ బాగా మేపుతోంది, నిజాయతా? రాజకీయ నాయకుడు నిజాయతీనా!
రిప్లయితొలగించండి