17, మే 2013, శుక్రవారం

విభజన వాదంతో నష్టపోయిన తెదేపా


బాదల్ దేఖ్కె బాల్టీ ఖాళీ కర్తే క్యా - మబ్బును చూసి వున్న నీళ్ళు ఖాళీ చేయడం - ఇదో    నానుడి .   ఇది సరిగ్గా తెదేపా కు  వర్తిస్తున్ది.     పట్టుమని పది మాటలు కూడా ఏ  విషయం మీద మాట్లాడలేని ఎర్రబల్లి, రెచ్చిపోయే   రేవంత్ రెడ్డి, అతిగా మాట్లాడే నాగం, తెరాస మద్దతు ఇచ్చినా  ఘనపూర్ లో ఓడిపోయిన కడియం, మొ॥ వారి మాట విని తెరాసాతో పొత్తుకోసం తహతహ లాడి , తీర సీమంధ్ర ప్రాంతంలో జరగబోయే నష్టాన్ని అంచనా వెయ్యకుండా, స్వర్గీయ  ఎర్రన్న నాయకత్వంలో తెలంగాణపై ఒక కమిటీ వేసారు.


ఆ,  కాంగ్రెస్స్ తెలంగాణా ఇవ్వోచ్చిందా, మనం ఇచ్చేది కేవలం పార్టీ  తీర్మానమే కదా అని ఒక కాగితం ఇచ్చారు.      కె సి ఆర్ ఆహార దీక్షతో పరిస్తితులు మారి వీర తెలంగాణ వాదం అనే సుడిగుండంలో తెదేపా చిక్కుకుంది.  


మీరు శాసన సభలో తీర్మానం చెయ్యండి , మేము పొడుగు సంతకం పెడతాం, అని రెచ్చగొట్టారు.    చేతులు కాలాయి, ఎన్ని ఆకులు పట్టుకున్నా ఉపయోగం లేదు.     నిన్న కాక మొన్న పుట్టిన వై ఎస్ ఆర్ పార్టీ చూడండి, మా చేతుల్లో ఏమీ లేదు, అంతా  కేంద్రం ఇష్టం అని అసలైన రెండు కళ్ళ ధోరణిని వ్యక్త పరచిన్ది.    కానీ "రెండు కళ్ళ సిద్ధాంతి" అనే  టైటిల్ మాత్రం బాబు గారికి దక్కింది.       దమ్ముంటే, కేంద్రానికి మళ్ళీ లెటర్ ఇవ్వండి అప్పుడు మిమ్మల్ని నమ్ముతాం అని తెరాసా రెచ్చగొట్టింది.   తే తెదేపా బృందం బాబు గారిని మళ్ళీ కల్లోలంలోకి నెట్టింది.   మీరు ఉత్తరం ఇవ్వండి, తెలంగాణ  ప్రాంతంలో మనకిక తిరుగుండదు అని చెవిలో జోరీగలా శబ్దం చేస్తూ బాబుని  తప్పుదారి పట్టించారు.    మరో సారి  లిఖితపూర్వకంగా గృహ శాఖామాత్యులు షిండే గారికి ఇచ్చారు.    ఈ ఉత్తరం కూడా అంత  స్పష్టంగా లేదు, మీరు జై తెలంగాణా అని అనాలి అని తెరాసా చెప్పిందే తడవుగా, అవును మేము తెలంగాణాకు వ్యతిరేకం కాదు అని పదే  పదే  చెప్పారు బాబు గారు.    రాజు గారి పెద్ద భార్య పతివ్రత అంటే అర్ధం తప్పోస్తుంది కాబట్టి , మేము తెలంగాణకు అనుకూలం అని చెప్పాలి అని పట్టు పట్టారు.   ఏదో అశ్వద్ధామ కుంజరః అన్నట్లు, మేము అనుకూలమే అని బాబు గారు చెప్పారు.     అమ్మా అదేమీ కుదరదు - మీరు కూడా మాతో కలిసి ఉద్యమాలు చేసి ఆంధ్రూల్లు దోపిడీ చేస్తున్నారు, వాళ్ళని తరిమి కొట్టాలి, మాది మాగ్గావాలి అని నినదిస్తూ ,  బస్సులు రైళ్ళు తగలపెట్టి మీ నిజాయితీని నిరూపించుకోండి అప్పుడే మిమ్మల్ని నమ్మేది అని శాసించారు.     


రాజకీయ చాణుక్యుడైన బాబు గారు ఈ విషయంలో బొక్క  బోర్లా పడ్డారు, తనకు తెలియకుండానే తెరాసా రాజకీయ క్రీడలో పావుగా మారి  , ఇరు ప్రాంతాల్లో నష్టపోయారు.   ఈ ప్రక్రియలో ఎవరైతే బాబు వెంట నడిచి ఆయన్ని రెచ్చగొట్టి, తెరాసాని బూతులు తిట్టారో, వారంతా సైకిల్ దిగి కారు ఎక్కి వారే ఇప్పుడు బాబును 'కారు'కూతలు కూస్తున్నారు .   ఈ పరిణామంతో  బాబు గారి పరిస్తితి   రెంటికీ చెడ్డ రేవడి అన్న చందమైంది.      విభజన సెంటిమెంటు తీవ్రంగా వున్న వరంగల్, కరీం నగర్లలో  మిగిలిన ఎర్రబల్లి, రమణ లాంటి వాళ్ళు కూడా సైకిల్ దిగి కారో కమలమో ఎక్కేసినప్పుడే మాత్రమె తెదేపా తన  పార్టీ  ప్రక్షాళన చేసుకొనే   అవకాశం వుండదు.  


బాబు గారూ - ఎవరైతే ప్రస్తుతం కె సి ఆర్ ను బూతులు తిడుతున్నారో వారందరి మీద ఒక్కన్ను వేసి వుంచండి.  వాళ్ళంతా ఆ పార్టీలోకి వెళ్ళేవారే , బహుశా తెరాస అధినేత, తనను  ఎవరు ఎక్కువ బూతులు తిడుతున్నారో రోజూ టి వి చూసి వారికి గేలం వేస్తుండ వచ్చు.   ఇలాంటి వారిని తన పార్టీలోకి తీసుకోవడం వలన మీ పార్టీని ఖాళీ చెయ్యచ్చు, వీళ్ళ బూతులు వినే బాధ నుండి తనూ తప్పుకోవచ్చు.    తెలివంటే అదే మరి, కె సి ఆర్ ను చూసి నేర్చుకోండి. 

3 కామెంట్‌లు :

  1. కెసియార్ తెలివిని చూసి మీరు మూర్చ పోవలసిందే. ఆయన పార్టి తెలంగాణా తెచ్చిందా, తేగలుగుతుందా అన్న విషయం వదలి, పార్టి ఫిరాయింపు దార్లకు గాలం వేశాడని, చంకలుగుద్దుకోవటం కెసియార్ చేయవచ్చేమోగాని, బ్లాగులు రాసుకొంటూ రోజు సమాజంలో మంచి చేడు చర్చించే మీలాంటివాడు చేస్తే చాలా అసహ్యంగా ఉంట్టుంది. వెధవలను సమర్ధించినట్లౌతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను రాసిన విషయాన్ని మీరు పూర్తిగా చదివలేదు అని అనిపిస్తుంది. దయచేసి పూర్తిగా చదవండి.

      తొలగించండి
  2. తెలుగు దేశం పార్టీ నష్టపోతోందనో లేక మరో పార్టీకి దెబ్బనో అని అనుకుంటూ, అసలు తెలుగు వాళ్ళు బజారున పడుతున్నారు అన్న సంగతి మరిచిపోతున్నారు మన రాజకీయ విభజన వాదులు. ఈ రకరకాల ఉద్యమాలు, కుళ్ళు రాజకీయాల వలన రాష్ట్రం సర్వనాశనం అయింది. మనకన్నా వెనుకున్న రాష్ట్రాలు ముందుకు పరిగెడుతుంటే, మనం మడుకూ, మనలో మనం కొట్టుకుంటూ రాష్ట్రాన్ని దిగువ నుండి మొదటీ రెండవ స్థానాలు వచ్చేట్లుగా చక్కటి కృషి చేస్తున్నాము. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందాన; మన రాష్ట్రంలో అన్నీ ఉండి కూడా ఒకరినొకరు డామినేట్ చెయ్యాలన్న దిక్కుమాలిన బుద్ధితో తెలుగు జాతిని అవమాన పరుస్తున్నారు మన రాజకీయ దు రంధురులు.

    రిప్లయితొలగించండి