12, మే 2013, ఆదివారం

తిరుమలలో ఇంకా కొనసాగుతున్న తమిళ భాష పెత్తనం


భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో ఆంద్ర రాష్ట్రంలో భాగమైన  తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వపు తమిళ ఆధిపత్యంలోనే ఇంకా ఉన్నట్లుగా అనిపిస్తుంది.    ఇందుకు ఉదాహరణగా కొన్ని రకాలైన సేవల పేర్లను పరిశీలించండి :

పరకామణి
కొయిల్ ఆళ్వార్  తిరుమంజనం
తిరుచ్చి
తిరుమాడవీధి
తిరుప్పావై
ఊంజల్ సేవై
తిరుమంజనం
తోమాల సేవ
మేల్చాట్ వస్త్రం
పోటు
పడి
వగపడి

చెప్పుకుంటూ పోతే ఎన్నో అర్ధం కాని అరవ పేర్లు.   తమిళ భాషకు వ్యతిరేకంగా చెప్తున్న విషయం కాదు, తెలుగు భాషపై వున్న అభిమానం మాత్రమే.     స్వరాష్ట్రం ఏర్పడి ఐదు దశాబ్దాలు దాటినా ఇలాంటి వాటిని పట్టించుకొనే నాధుడు లేడు.    పరకామణి అంటే కానుకలు లెక్కించే ప్రదేశం, ఊంజల్ సేవ అంటే ఉయ్యాల సేవ అని, పోటు అంటే వంట గది అని, మేల్చాట్ వస్త్రం అంటే శేష వస్త్రం అని తెలుగులో (ఇంకా సరైన, ఖచ్చితమైన పేర్లు ఉండచ్చు) ఉపయోగించలేమా?

ప్రపంచ మహాసభలు జరిగిన తిరుపతి నుంచే తెలుగు వాడకాన్ని మొదలుపెట్టడం అత్యవసరం.  

5 కామెంట్‌లు :

  1. In your blog name the word kachada is from Telugu language? Pardon my ignorance....

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ‌ అజ్ఞానం గురించి చర్చ అనవసరం కాని, ఈ‌ టపాలో లేవనెత్తిన విషయం ఆలోచించదగ్గది.

      తొలగించండి
  2. అజ్ఞాత గారెవరో,

    బాగా 'వాయించా'రండీ !!

    తిరుమల స్వామి యే అరవ దైవం ఇక ఆ పేర్లు అట్లా గే ఉంటాయి మరి . రామానుజుల వారి అరవ దైవమాయే మరీను !!

    జిలేబి

    రిప్లయితొలగించండి