27, ఏప్రిల్ 2013, శనివారం

సి బి ఐ స్వతంత్రంగా వ్యవహరిస్తుందని ఇప్పటికైనా ఒప్పుకోండి


సాక్షి పత్రిక చదవాలంటే భయం.   ఏ వార్త చదివినా మనసులో ఒక రకమైన నెగటివ్ ధోరణి బయలు దేరుతుంది.    సిబిఐ,  బొగ్గు కుంభకోణం విషయంలో  న్యాయస్థానంలో దాఖలు చేసిన  ఒక అఫిడవిట్లో, న్యాయ శాఖామంత్రి మరియు ప్రధాన మంత్రి కార్యాలయం అధికారులు కొంతమంది తాము తయారు చేసిన ముసాయిదా  నివేదికను ముందుగానే చూశారని వాగ్మూలం ఇచ్చింది.      ఈ వార్తను పట్టుకుని సిబిఐకి దురుద్దేశాలు అంటగట్టే ప్రయత్నం చేసింది సాక్షి పత్రిక.   సిబిఐ అధికార పక్షానికి కొమ్ము కాస్తుందని, జగనన్నును కూడా అలానే జైలులో పెట్టారని చెప్పే ప్రయత్నం చేసింది.   


సిబిఐ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తుంది అన్న ఆరోపణ నిజమైతే, వారు దాఖలు చేసిన అఫిడవిట్లో, తాము ఆ నివేదికను ఎవరికీ చూపలేదనే చిన్న అబద్ధం చెప్పి కాంగ్రెస్ పార్టీని కష్టాలనుంచి బయట పడేసేది.   పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న ఈ తరుణంలో ఒక నిజాన్ని బట్ట బయలు చేసి ధైర్యంగా ముందుకొచ్చిన సిబిఐ ను అభినందించాల్సిందే.        


నిజాయతీ పరుడు, విద్యాధికుడు ఐన లక్ష్మీనారాయణ లాంటి అధికారులు ఈ దేశంలో ఇంకా వున్నారు కాబట్టే, ప్రజా ధనాన్ని దోపిడీ చేసిన కొంత మందైనా కారాగారాల్లో చిప్ప కూడు తింటూ  మగ్గుతున్నారు .   అపర శ్రీ కృష్ణ దేవరాయలుగా తనను తానూ అభివర్ణించుకున్న గాలి సోదరులను అక్కడి ప్రజలు పూర్తిగా మర్చిపోయి స్వేచ్చా వాయువులు పీలుస్తున్నారు.     నూరు గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలి వానకు పోయింది అన్న నానుడి మన రాష్ట్రంలో కూడా నిజమవ్వడానికి ఎంతో దూరం లేదు.    

4 కామెంట్‌లు :

  1. CBI ఎందుకు అవినీతిపరులను ఎందుకు సంప్రదించింది? అన్నదానికి మీ సమాధానం అర్థవంతంగా వున్నదనే భావిస్తున్నారా? ఎందుకు? జగన్‌లాంటి అవినీతిపరుడు, దొంగ, భూబకాసురుడు వేలెత్తిచూపే ఆస్కారం ఇచ్చింది ఎవరు? చార్జిషీటు నేరస్థులకు చూపించే పైలు చేయాలన్న సాంప్రదాయం వుందా?

    రిప్లయితొలగించండి
  2. సిబి ఐ వారు స్వయంగా నిందుతుల దగ్గరికి వెళ్ళి, ఇదిగోండి నివేదిక చూసి కరెక్టు చెయ్యండి అని చెప్పరు కదా ! ఎగ్జికుటివ్ ను సాసించేది చట్ట సభ సభ్యులు. వారి అధికారానికి ఎంతో కొంత లోబడతారు అధికారులు. కానీ, ప్రస్తుత కేసులో - భవిష్యత్లో ఏ మంత్రి కూడా అధికారులను లోబరుచుకోవడానికి భయపడే మాదిరిగా సిబి ఐ తన అఫిదవిట్ లో వాస్తవాలను బట్ట బయలు చేసింది, ఇది హర్షించ తగిన విషయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏమిటి హర్షిస్థున్నారో ఎందుకు హర్షిస్తున్నారో మీ ఆనందం మీదిగాని, నివేదిక కోర్టుకన్నా ముందుగా ఆరోపితులకు ఎందుకు చూపించినట్టు? బెదిరించి మామూలు వసూలు చేసుకోవడానికా? అదిచెప్పండి. కచడాలా డొంకతిరుగుడుగా చెబితే కాదు.

      తొలగించండి
  3. లక్ష్మినారాయణ లాంటి వాళ్ళు చాలామందికి ఇప్పుడు హిరొ ఐపొయాడు . ఏఅహికారులకైనా సొంతకొరలంటూ వుండవు అధికారంలొ వున్న వాళ్ళు ఎలా ఆడిస్తె అలాఆడతారు.అంతకుమించి మరేమీ కాదు. ఒక వేల రాజశెకర్ రెడ్డి బతికి వున్నటైతె ఆవిచారణ జరిగేదా? చనిపొయినా జగన్ కాంగ్రెస్ పార్టిని వీడకుంటె విచారణ జరిగేదా?. సొనియా అల్లుడి పైన విచారణ ఎందుకుజరగలే? అక్కడి అధికారుడిని ఎందుకు బదిలీ చేశారు.?

    రిప్లయితొలగించండి