27, ఏప్రిల్ 2013, శనివారం

తెరాస ఒంటరి పోరు తెలంగాణాను తెస్తుందా!


తెరాసా అధినేత చంద్ర శేఖర్ రావు, వచ్చే సార్వత్రిక ఎన్నికలలో 100 శాసన సభ, 15 పార్లమెంటు స్థానాలు తమ పార్టీకి దక్కుతాయని ఆశించడంలో ఏ  మాత్రం తప్పులేదు.     అయితే అన్ని సీట్లు వస్తాయో రావో కాలం నిర్ణయించాల్సి వుంది.    1969 సంవత్సరంలో జరిగిన ఉద్యమంతో పోలిస్తే, గత 3 సంవత్సరాలుగా జరుగు తున్న ఉద్యమం అంత గొప్పగా లేదనేది నిర్వివాదాంశం.   1971లో జరిగిన ఎన్నికలలో చెన్న రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణా ప్రజా సమితి 14 స్థానాలలో 10 స్థానాలు దక్కించుకుంది.  హైదరాబాద్ స్థానంలో కూడా తెప్రసనే గెలిచింది.    ఆ కాలంలో, కేవలం 3 పార్టీలు మాత్రమె ఎన్నికలలో ఉన్నాయి.    కాంగ్రెస్, కమూనిస్ట్ మరియు తెప్రస.  ఈ మూడు పార్టీలలో కేవలం తెప్రస మాత్రమె ప్రత్యెక రాష్ట్రం కోరుకుంటే, ఉభయ కమునిస్టులు, కాంగ్రెస్ విశాలాంధ్ర వాదంతో ఎన్నికలలో పోటీ చేశాయి.     కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం వున్న ప్రముఖ నాయకులంతా ఆనాడు తెప్రస నుంచి పోటీ చేసి గెలిచినా వారే.   ప్రస్తుత పరిస్తితి అందుకు భిన్నంగా వుంది.     తెరాసాతో పాటు, కాంగ్రెస్ (తెలంగాణా ప్రాంతంలో), తెదేపా, సిపిఐ, భాజపా    ప్రత్యేక వాదాన్ని మోస్తున్నాయి.  నిర్ణయం ఇదమిద్ధంగా చెప్పని  చెప్పని వైకాపాకు కూడా అంతో ఇంతో వోటు బాంకు వుంది.    ఇలాంటి పరిస్తితులలో తెరాసా ఒంటరి పోరుకు సిద్ధం అవడం సాహసోపేత నిర్ణయం.  ఉత్తర తెలంగాణలో తెరాసాకు గట్టి పట్టున్న మాట వాస్తవం.   నగర ప్రాంతాలు, వాటి శివారు ప్రాంతాలలో ఉన్న స్థానికేతరులు తెరాస ను ఆదరించక పోవచ్చు.    మొదటి నుంచి తెలంగాణా కోసం చిత్తసుద్ధితో  ఉద్యమిస్తున్న వారిలో భాజపా, భాకపా కూడా  ప్రధమ వరసలో వుంటాయి.   ఈ పార్టీలు కేవలం ఉద్యమాలలో మాత్రమే పాల్గొంటాం, ఎన్నికలలో పోటీ చేయకుండా మడి కట్టుకుంటాం అనే ప్రశ్న ఉత్పన్నం కాదు.  ఇప్పటికి కూడా అంతో ఇంతో గ్రామ స్థాయిలో కార్యకర్తలున్న పార్టీ తెదేపా. కాంగ్రెస్కు వుండే  సామ్ప్రదాయక వోట్లు వేరే ఖాతాలోకి మళ్లే అవకాశం లేదు.     ఈ కారణాల దృష్ట్యా, మొత్తం సీట్లు మనకే వస్తాయి అనుకోవడం ఆత్మహత్యా సద్రుశం.  


చంద్ర శేఖర్ రావు తెలంగాణాని ఫణంగా పెట్టి ఒంటరి పోరులోకి దిగితే, తను ఆశించినట్లు వోట్లు సీట్లు రాకపోతే, ప్రత్యేక రాష్ట్రం అనే అంశం శాశ్వతంగా  తెరమరుగయ్యే ప్రమాదం వుంది.   ఒక వేళ తను ఆశించినట్లు సీట్లు వచ్చినా, ఆ సీట్ల అవసరం ఎన్దిఎ కి గానీ యుపిఎ కి గానీ ప్రభుత్వ ఏర్పాటులో అవసరం లేకపోతే, తెరాస లక్ష్యం నెరవేరక పోవచ్చు.   


3 కామెంట్‌లు :

  1. వసూళ్ళలో వాటాలు అందరికీ పెట్టడం కన్నా ఒకరే బొక్కడం మంచిది.

    రిప్లయితొలగించండి
  2. అవగాహనలేకుండా తెలంగాణా గురిoచి మాట్లవద్దు ,తెలంగాణా ప్రజల సమశ్యలకు కారణాలు ఎన్నో ,అంతిమ లక్చ్శం ప్రత్యేక తెలంగాణా ....కాకపోతే ఎలాసాధ్యం అనేది ఎవరి పద్ధతిలో వారు చేస్తారు ,అణచడానికి ప్రయత్నాలు చేసేవారు అది చేస్తారు ,,,కావల సింది ప్రజా ల రాజ్యంగా హక్కుల పరిరక్చన ,సామాజిక న్యాయం

    రిప్లయితొలగించండి
  3. "1971లో జరిగిన ఎన్నికలలో చెన్న రెడ్డి గారి నాయకత్వంలోని తెలంగాణా ప్రజా సమితి 14 స్థానాలలో 10 స్థానాలు దక్కించుకుంది. హైదరాబాద్ స్థానంలో కూడా తెప్రసనే గెలిచింది."
    " ప్రస్తుత పరిస్తితి అందుకు భిన్నంగా వుంది. తెరాసాతో పాటు, కాంగ్రెస్ (తెలంగాణా ప్రాంతంలో), తెదేపా, సిపిఐ, భాజపా ప్రత్యేక వాదాన్ని మోస్తున్నాయి. "
    " ఒక వేళ తను ఆశించినట్లు సీట్లు వచ్చినా, ఆ సీట్ల అవసరం ఎన్దిఎ కి గానీ యుపిఎ కి గానీ ప్రభుత్వ ఏర్పాటులో అవసరం లేకపోతే, తెరాస లక్ష్యం నెరవేరక పోవచ్చు. "
    అంటూ రాసిన వారు "మాకు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు" అని సిగ్గు, ఎగ్గు లేకుండా ఒప్పుకొన్నట్టే కదా!

    రిప్లయితొలగించండి