ఇటీవల నల్గొండలో జరిగిన సదస్సులో వెంకయ్య మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో తెలంగాణాను కమలం పువ్వులో పెట్టి ఇస్తాం అని హామీ ఇచ్చారు. అశ్వద్ధామ హతః ; కుంజరః అన్నట్లు, షరతులు ఏమిటి అనే విషయం మాత్రం పైకి ప్రస్తావించలేదు. ఆ షరతులు ఏమై ఉండవచ్చు --
అ) తెలంగాణలో మాకు కనీసం పది పార్లమెంటు స్థానాలు గెలిపించి ఇవ్వాలి
ఆ) దేశంలో మాదే అతి పెద్ద పార్టీగా నెగ్గాలి
ఇ)మిత్ర పక్షాలు (మూలాయాం మొదలు కొని నితీష్ వరకు - మళ్ళీ తెలుగు దేశం కూడా కావచ్చు) విభజన ప్రతిపాదనకు ఒప్పుకోవాలి
ఈ) చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యం; కానీ ఈ నిబంధన దేశంలో అత్యంత పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్కి మాత్రం వర్తించదు.
మీరు కారు/మోటార్ సైకిల్ పత్రికా ప్రకటన చూసే వుంటారు. మా వాహనం లీటరుకు 80 కి మీ ఇస్తుంది * అని రాస్తారు. ఎలాంటి పరిస్తితులలో ఇస్తుంది -- రోడ్డు మీద ఇతర వాహనం ఎదురు రాకూడదు; వేగ నిరోధకం వుండకూడదు; బండిని టెస్టు చేసేప్పుడు ఎవరూ అక్కడ వుండకూడదు; మా ఎక్స్పర్టు డ్రైవరు మాత్రమె నడపాలి మొ॥
రామాలయం కడతాం అని చెప్పి, దేశ వ్యాప్తంగా అల్లర్లు సృష్టించి, అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం ఆ రాముడికి హారతి కర్పూరం కూడా వెలిగించని వీళ్ళకు తెలంగాణా పై మోసం చెయ్యడం ఒక పెద్ద లెక్కా ! తస్మాత్ జాగ్రత్త
మీరు చెప్పే వరకూ ఎవరికీ తెలియదండీ విషయం. ఎంత బాగా కనిపెట్టారో..
రిప్లయితొలగించండిభయంకరుడికి అర్ధమైనందుకు సంతొషం
రిప్లయితొలగించండి