18, ఏప్రిల్ 2013, గురువారం

బయ్యారంపై అనవసర రాద్ధాంతం


ముఖ్యమంత్రి గారి కార్యాలయం బయ్యారం గనులను వైజాగ్ స్టీల్ ప్లాంట్ (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) కు లీజుకు ఇస్తున్నట్లు, ఇందుకు ప్రతిగా గనులకు దగ్గరలో ఖమ్మం జిల్లాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పెడుతున్నట్లు ప్రకటించింది.   ఇది సంతోషించాల్సిన విషయం.     మనరాష్ట్రంలో కొన్ని విచిత్రమైన మనస్తత్వాలు, పార్టీలు దురదృష్ట వశాత్తు మనుగడలో వున్నాయి.      ఇవ్వాళ ఏ వార్తా ఛానల్ చూసినా, ఏ నాయకుడు మాట్లాడేది విన్నా, విషయం అర్ధం కాదు.    


ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు, ఏదో ఒక వాదం ముసుగులో వోట్ల వేటలో వున్నారు.    ఈ నాయకుల డిమాండు ఏమిటి - ఖమ్మం జిల్లాలో ఉక్కు కర్మాగారం పెట్టి, అక్కడ దొరికె ముడి ఖనిజాన్ని వినియోగించాలి, తద్వారా, స్థానికంగా ఉద్యోగ, వ్యాపార అవకాశాలు కల్పించాలి.        ముఖ్యమంత్రి గారి ప్రకటన చెప్పింది కూడా అదే కదా!    


గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ గనులు ప్రైవేటు వ్యక్తుల చేతిలో వుంటే, వార్తా పత్రికలూ కధనాలు ప్రచురించే వరకు, ఒక్క పార్టీ వాడు నోరెత్త లెదు.     కిరణ్ కుమార్ రెడ్డి గారు అత్యంత పారదర్సకంగా, ఈ గనులను రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు కట్టబెడుతుంటే, ఒకడేమో కరీంనగర్లో ఉక్కు కర్మాగారం కావాలంటాడు, ఇంకొకడు వరంగల్, మరొక పార్టీ వాడు వరంగల్-ఖమ్మం సరిహద్దుల్లో, ఇంకొక నాయకుడు ఈ కంపనీ పేరులో వైజాగ్ అని వుంది కాబట్టి ఇది ఆంద్రోళ్ళ కంపనీ అంటాడు .   ఒకడేమో, తెలంగాణలో దొరికే ఖనిజం ఇక్కడే ఉండాలంటాడు.    స్టీలు తయారు చెయ్యాలంటే, బయ్యారం ఖనిజం కావాలి, సింగరేణి బొగ్గు కావాలి, కర్నూల్లో దొరికే సున్నపు రాయి కావాలి, నెల్లూరు జిల్లాలో దొరికే మాంగనీసు కావాలి.    తయారైన ఉక్కును విదేశాలకు తరలించాలంటే, ఆంద్ర ప్రాంతంలో వున్న నౌకా రవాణ మార్గాలు కావాలి.       


భారత దేశంలో ప్రస్తుతం స్టీలు కర్మాగారాలు పీకల లోతు కష్టాల్లో వున్నాయి.    డిమాండు కంటే సప్లై చాలా అధికంగా వుండటం వలన చాలా కంపనీలు దిక్కుతోచని స్తితిలో వున్నాయి.  ప్రస్తుతం ఆతోమోబైలు గ్రేడ్ స్టీలు కిలో ధర వుల్లిపాయల ధరతో సమానంగా వుంది.       ఇలాంటి పరిస్తితులలో ముఖ్యమంత్రి గారి ప్రతిపాదన బహుశా -- బయ్యరంలో స్పాంజ్ ఐరన్, పెల్లటైజేషన్  వరకు తయారు చేసి, ఆ పెల్లెట్స్ను వైజాగ్ స్టీల్ ప్లాంట్లో హాట్ రోలింగ్ చెయ్యడం. లేదా బెనేఫికేషన్ ప్లాంట్ ద్వారా ఓరును శుద్ది చేసి స్లర్రీని గొట్టపు మార్గం ద్వారా వైజాగ్ స్టీల్ ప్లాంటుకు తరలించడం.      దీనివలన, ఒక ప్రభుత్వ రంగ సంస్థ బాగు పడుతుంది.    ఖమ్మం జిల్లాలోని ఉక్కు కర్మాగారం వలన ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలుగుతుంది.   వైజాగ్ స్టీలు ప్లాంటు లగడపాటిదో, టిఎసార్డో, మరో ప్రైవేటు వ్యక్తిదో కాదు.   ఇది ప్రభుత్వ రంగ సంస్థ.       


ప్రభుత్వ రంగంలో పూర్తి స్థాయి ఉక్కు కర్మాగారం స్తాపించాలంటే, కనీసం ఆరు  మిలియన్ టన్నుల వార్షిక సామర్ధ్యానికి 30,000 కోట్లు అవసరం.    ప్రభుత్వ రంగంలో ఇప్పటికే వున్న వైజాగ్ స్టీల్ ప్లాంటును ఖాయిలా చేసి, ఇంకో 30,000 కోట్లు (అది జగన్, కచరా, వినోద్, నాగం మొ॥ సొమ్ము కాదు) పన్నులు కట్టే వారి డబ్బు వృధా చెయ్యాలా, ఇది సరైన వాదనేనా!

4 కామెంట్‌లు :

  1. వీళ్ళకి ఆ మాత్రం తెలివి ఉంటె , తెలంగాణా డిమాండ్ వచ్చేదే కాదు .
    అన్నింటికీ ఆంధ్ర పేరు చెప్పి ఏడవడం ఒక అలవాటు అయిపొయింది అంతే

    రిప్లయితొలగించండి
  2. సత్యం చెప్పారు, మన దేశం లో ప్రతీదీ రాజకీయమే.

    రిప్లయితొలగించండి
  3. తరలించడానికి ఆంధ్ర జహాజ్ కైకు? వోయిచ్చు బోల్తహై న రే భయ్ మజగాన్ డాకులో హమారా జహాజ్ హై. లారీమే మజగాన్ డాక్ జాతాహై వహాసే చైనా భేజ్తా హై, ఆంధ్రావాలా జహాజ్ కైకూ? సబ్కో ఏకేక్ ఇనుప కొలిమి పెట్టియ్యాలె. అదే కర్మాగారం, ఆడనే అందరికీ నకరీ.

    రిప్లయితొలగించండి