18, ఏప్రిల్ 2013, గురువారం

వాక్ స్వాతంత్ర్యం మీద దాడి


రాజ్యాగంలోని ఆర్టికల్ 19 ప్రకారం మనకు కొన్ని రకాల హక్కులు సిద్ధించాయి, అందులో వాక్ స్వాతంత్ర్యం కూడా ఒకటి.     నిన్న ప్రెస్ క్లబ్బులో జరిగిన దాడికి లోగడ తస్లీమా నస్రీన్ మీద ముష్కర మూకలు జరిపిన దాడికి పెద్ద తేడా లేదు.    నిన్న విశాలాంధ్ర మీద జరిగిన దాడి కొంత మంది "జర్నలిస్టులు" అని పిలవబడే  అల్లరి మూకల పని.    దీనికి మన చదువుల తల్లి ఒడిలో ఏళ్ల తరబడి డిగ్రీలు చదివే విద్యార్ధులు తొడయ్యారు.    అత్యంత పవిత్రమైన న్యాయవాద వృత్తిలో వుండి చట్టాన్ని కాపాడాల్సిన వాళ్ళు కూడా ఈ దాడిలో నల్ల కోట్లు వేసుకొని మరీ భాగస్వాములైనారు.    


ఎంతో బలంగా వున్న తెలంగాణా వాదం, విశాలాంధ్ర ప్రచురించిన పుస్తకంతో ఆవిరైపోతుందా!   వాళ్ళు చెప్పేవి అబద్దాలైతే, దానికి ప్రతిగా ఎక్కడ తప్పు రాశారో చెప్పాలి కానీ, బూతులు తిట్టడం, అద్దాలు పగల గొట్టడం సభ్య సమాజం క్షమించదు. 


ఇటీవలే ABN టి వి లో జరిగిన చర్చలో, ఉద్యోగ సంఘాల నాయకుడు విఠల్ మాట్లాడుతూ, పుస్తకాన్ని దిల్లీలో విడుదల చెయ్యడం సమంజసంగా లేదు, హైదరాబాదులో విడుదల చెయ్యొచ్చు, ఆ స్వేచ్చ ప్రభాకరకు వుంది అని సెలవిచ్చారు.     ఈ చర్చను http://www.youtube.com/watch?v=o_UBP_DJg-Y చూడండి.     


ఇలాంటి దాడులు తెలంగాణలో నివసించే లక్షలాది మంది ఇతర ప్రాంతాల వారి మీద ప్రభావాన్ని చూపించే అవకాశం వుంది, దీనివలన తెలంగాణా ఉద్యమానికి లాభం కంటే నష్టమే ఎక్కువ.    

2 కామెంట్‌లు :

  1. ఎవరైనా ఒకరు అబద్దం ఆడుతున్నప్పుడు , అది అబద్దం అని చెప్తే , గట్టిగా అరిచి, కొట్టినంత పని చేసి మన మీద కి వస్తారు .
    అదే నిజం చెప్పేవాడు ఎప్పుడూ సైలెంట్ గానే ఉంటాడు .

    నిన్న కుడా అదే జరిగింది, వీళ్ళవి అబద్దాలు అన్న సంగతి ఎక్కడ బయట పడిపోతుందో అన్న భయంతో , ఎలా అయినా పుస్తకాన్ని ఆపాలని వాళ్ళకే చేతనైన, తెలిసిన మార్గం లో వచ్చారు , దానికి ఉస్మానియా లో అంకుల్స్ యదా శక్తి తోడ్పాటు అందించారు .

    హైదరాబాద్ వీళ్ళ అబ్బ సొత్తు , ఇక్కడ గొడవలు చేసిన వీళ్ళే చెయ్యాలి, దొమ్మి లు చేసినా వీళ్ళే చెయ్యాలి , ఎవరు కూడా వేలెత్తి అడగకూడదు , అడిగితె వాడు తెలంగాణా ద్రోహి . సరిగ్గా ఉంటె ఎప్పుడో వచ్చేది తెలంగాణా ఇలాంటి లంగా వేషాలు వేయడం వల్లే ఆగిపోయింది .

    వాడెవడో ఆకాశా బాబా అంట, వాడు వాడి బూతు కవితలు , అందరు వాడి బూతు కవితలు చదవాలని , పోస్ట్ కి హెడ్డింగ్ కుడా అదే పదం పెట్టాడు , అదేమీ పైశాచిక భావాలో మరి . చాలా రోజుల తరువాతా బూతు కవితలు చదివాను , కాలేజీ టైం లో కొందరు పిచ్చి ఎదవలు ఇలానే బూతు కవితలు రాసేవారు, ఇప్పుడు మల్లి ఇన్నాళ్ళకి చదివాను .

    రిప్లయితొలగించండి
  2. http://www.namasthetelangaana.com/News/LatestNews.asp?category=1&subCategory=1&ContentId=228668

    నేటి నమస్త తెలంగాణాలో వచ్చిన వార్త చదవండి. సభకు పట్టుమని పది మంది కూడా లేరు అని వారే అంటారు, 100 మంది పైగా వున్న మన విద్యార్ధులు, న్యాయవాదులు, పాత్రికేయుల మీద దాడి చేసారు అంటాడు. ఏమిటో, ఈ దౌర్జన్యాలు 2014 దాకా భరించాలి.

    రిప్లయితొలగించండి