4, ఏప్రిల్ 2013, గురువారం

ఈలం పోరుకు భాజపా ఆజ్యం


తమిళ్ నాడులో జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుకు యశ్వంత్ సిన్హా భాజపా తరఫున ఆజ్యం పోశారు.       ప్రత్యేక ఈలం రాష్ట్రం ఏర్పాటుకు లంకలో జరుగుతున్న (ఆగిపోయిన) పోరుకు భాజపా తరఫున మద్దతు ప్రకటించారు.     


ప్రభాకరన్ కొడుకును దారుణంగా చంపడం గర్హనీయం .   కానీ, ప్రభాకర్ చేసిన దారుణాల వలన మరణించిన వారు, అంగవికలురు అయిన వారు శ్రీలంకలో వేల సంఖ్యలో వున్నారు.    యువకుడు, సమర్ధుడు అయిన మన దేశ ప్రధానిగా పని చేసిన రాజీవ్ గాంధీని పొట్టనపెట్టుకున్న రక్త పిపాసి, దుర్మార్గుడు ప్రభాకరన్.  యుద్ధం తరవాతే శాంతి స్థాపన జరుగుతుంది.    అది లంక కావచ్చు, ఆఫ్గనిస్తాన్ కావచ్చు పంజాబ్లోని స్వర్ణ దేవాలయం కావచ్చు.    


శ్రీలంక విషయంలో భారత దేశం అతిగా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.   మన చుట్టూ వున్నా దేశాలైన చైనా, పాక్, నేపాల్, బంగ్లాదేశ్లతో మన సంబంధాలు అంతంత మాత్రం గానే వున్నాయి.      ఇలాంటి పరిస్తితులలో, మన పొరుగు దేశాల అంతర్గత విషయాలలో అతిగా జోక్యం చేసుకోవడం అర్ధరహితం.    బాధ్యత గల ప్రతిపక్షంగా ఉండాల్సిన భాజపా కేవలం కొన్ని వోట్ల కోసమో, సీట్ల కోసమో రాజకీయం చెయ్యడం క్షమించరాని విషయం.   


ద్రావిడ పార్టీలు అతిగా స్పందించి క్రికెట్ ఆటగాళ్ళని తమిళనాడులో ఆడనీయమని మొండికేశారు.   శ్రీలంక అధ్యక్షులు రాజపక్షేకి, ఆ దేశ అంతర్గత భద్రత ముఖ్యం కానీ క్రికెట్ కాదు.   అదే లంక క్రికెటర్లు భాజపా పాలిత రాష్ట్రాలలో ఆడవచ్చు, ఎలాంటి అభ్యంతరము లెదు.   రాజకీయం అంటే ఇదే మరి.    భారత దేశంలో తమిళ్ నాడు ఒక అంతర్భాగం.    విదేశంలో మన పౌరుడు  కష్టంలో వుంటే, భారతీయుడు కష్టంలో వున్నట్లు కానీ, వాడు తమిళ్ నాడుకు చెందినా వాడా లేక గుజరాతుకు చెందిన వాడా అని చూడ వలసిన అవసరం లెదు.    క్రికెటర్లను బహిష్కరించడం ద్వారా నిరసన తెలియ చేయడం ఒక మార్గం అయితే, దేశం మొత్తంలో జరగాలి, అంతే కానీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని చూడకూడదు.    


మన దేశ ఆంతరంగిక విషయాలలో ఇతర దేశాలు జోక్యం చేసుకోవడం కూడదు అని గట్టిగా కోరే మనం, ఒక స్వతంత్ర దేశమైన శ్రీలంక విషయంలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లెదు.      రాజేవ్ గాంధి ఐ పి కె ఎఫ్ ను లంకకు పంపించింది కూడా వారి కోరికమీద మాత్రమే కానీ, స్వతంత్ర నిర్ణయం కాదు.      


త్వరలో జరుగనున్న ఎన్నికలలో గెలుపు మాత్రమే ప్రాదిపదికగా మతాల ప్రాతిపదికిన, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలను విడదీసి,  భాజపా చెయ్యబోయే విన్యాసాలు నేలబారు మనిషికి రోతపుట్టే ప్రమాదం లేకపోలేదు.    

4 కామెంట్‌లు :

  1. ఇది శ్రీలంక అతర్గత వ్యవహారం ఎంతవరకూ అవుతుందో అంతవరకూ శ్రీలంక-భారత్ ద్వైపాక్షిక వ్యహవారమూ అవుతుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
  2. మన దేశ పౌరులు పెద్ద సంఖ్యలో వున్నారు కాబట్టి, వారికి మద్దతు తెలియచేయడంలో తప్పులేదు. కానీ, ప్రభాకరన్ను మిగిలిన పౌరుల్ని కిరాతకంగా చంపి కొన్ని సంవత్సరాలు దాటింది. మధ్యంతర ఎన్నికల ముందు మాత్రమె, ద్రావిడ పార్టీలకు ఎందుకు గుర్తొచ్చిందో ఆలొచించాల్సిన విషయం.

    రిప్లయితొలగించండి
  3. "మన దేశ పౌరులు పెద్ద సంఖ్యలో వున్నారు కాబట్టి..."
    ఎవరండీ మన దేశ పౌరులు? శ్రీలంక తమిళులంతా శ్రీలంక పౌరులే. ఇలాంటి అవగాహనాలేమితోనే భారత రాజకీయ పార్టీలు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాయి అని నా అభిప్రాయం.

    అదే సమయములో లంక తమిళుల హక్కులకోసం పోరాడటమంటే శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టటమూ కాదు. లంక నుండి స్వాతంత్ర్యం కోరే హక్కు తమిళులకు, నిరాకరించే హక్కు లంకకూ ఉంది. ఈ విషయములో వేలు పెడితేనే అది శ్రీలంక వ్యవహారాల్లో తలదూర్చినట్టు అవుతుంది. శ్రీలంక ప్రభుత్వం ప్రదర్శించే జాత్యహంకారాన్ని (ఉంటేగింటే) ప్రశ్నించటం పొరుగుదేశంగా అది భారత నాయకత్వం బాధ్యత, హక్కు. ఇక దీనికీ కాశ్మీరుకు పోలిక పెట్టే మేధావులకు ఓ లాల్ సలాం!

    1930 నుండి దగ్గరదగ్గర 1970లవరకూ ఉన్నంత ద్రావిడ ఉద్యమ ఉధృతి ప్రస్తుతం లేదు. ప్రస్తుత భారతీయ తమిళుల ప్రాధాన్యతలు వేరు. వారి వివేకాన్ని గౌరవిద్దాం.

    ప్రభాకరనో లేదూ మరొకరో కేవలం కూరలో కరివేపాకులు అంతే.

    రిప్లయితొలగించండి
  4. కరుణానిధిగాడూ, ద్రవిడపార్టీలు పోతేగాని తమీళనాడు ప్రశాంతంగా ఉండదు. వాడు దృతరాష్ట్రుడులాంటి వాడు . జయలలిత గాంధారిలాంటిది./ ఇద్దర్నీ ఒకే జైల్లోవేసి గొడ్దును బాదినట్టు బాదాలి

    రిప్లయితొలగించండి