నిన్న కె సి ఆర్ గారు బోధన్ సభలో మాట్లాడుతూ, మన రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతున్నదని సెలవిచ్చారు. వంద చంద్ర బాబులు వచ్చినా, ఇంకో వంద జగన్ లు వచ్చినా ఈ రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని అందులో తె రా స పాత్ర ఉత్క్రుష్టమైనదని ఆయన వక్కానించారు. అలాగే, తెలంగాణా ఇవ్వని కాంగ్రెస్ ను బొంద పెట్టాలని, మత తత్వ శక్తులతో కలిసే ప్రసక్తే లేదని చెప్పారు.
సగటు వోటరుకు అంతుబట్టని విషయం ఏమిటంటే -
అ ) మత తత్వ పార్టీలతో జట్టు కట్టరు - అంటే భాజపాతో పొత్తు లేనట్లే
ఆ ) బాబు తెలంగాణా ద్రోహి - జట్టు కట్టే అవకాశం లేనే లేదు
ఇ ) వామ పక్షాలు, ఏ పక్షం కాని లోక్ సత్తాతో కలిసి సాధించేది సూన్యం
ఈ ) కాంగ్రెస్ ని బొంద పెట్టాలి కాబట్టి , వారితో పొత్తు అసాధ్యం
ఉ ) చివరకు మిగిలింది జగన్ బాబు - ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఎవరైనా ముందస్తు ఎన్నికలు కావాలి అని కోరుకొనే పార్టీ అంటూ వుంటే అది కేవలం తెరాసా మరియు వైఎస్ఆర్ పార్టీలు మాత్రమే. రాజశేఖర్ రెడ్డిని కానీ, వారి పిల్లలను కాని అంత తీవ్రంగా విమర్సించిన్ దాఖలాలు తెరాసా కు లెవు. ఎవరైనా గట్టిగా ఒత్తిడి పెడితే తమల పాకుతో..... అప్పుడప్పుడు ఒక విమర్శ చేస్తారంతే.
తీర, సీమాంధ్ర లో నాయకులు జగన్ పార్టీ వైపు అడుగులు వెయ్యడానికి ప్రధాన కారణం ఆ పార్టీ వారు ఎట్టి పరిస్తితులలో విభజనకు ఒప్పుకోరనే నమ్మకంతోనే, మరి అలాంటి పార్టీతో తెరాసా సంకీర్ణం ఎలా ఏర్పాటు చెయ్యగలుగు తుంది.
గతంలో కూడా కెసిఆర్ గారు కోరుకున్నది ఒకటే, సీమాన్ధ్రలో జగన్ పార్టీ, తెలంగాణలో తన పార్తీ. మరో ముఖ్య విషయం - రాబోయేది సంకీర్ణ ప్రభుత్వం అనుటున్నవారు, అదే సందర్భంలో తమతోనే ప్రత్యేక తెలంగాణా 2014లో వస్తుంది అంటారు . ఈ రెండు విషయాలు పొంతన లేకుండా వున్నాయి.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి