తప్పు చేసినా చెయ్యకపోయినా ఏ కన్నతల్లి కూడా తన బిడ్డ జైలులో ఉండటాన్ని జీర్ణించుకోలేదు. ఇది డబ్బు వున్నవాళ్ళకైనా లేని వాళ్ళ విషయంలోనైన సహజం . అందుకు విజయమ్మ గారు ఏ మాత్రం మినహాయింపు కాదు.
ఆవిడ నిన్న ఎకనామిక్ టైమ్స్ పత్రికకు (ఈ పార్టీకి చెందిన నాయకులు ఎవ్వరూ స్థానిక పత్రికలతో మాట్లాడరు) ఇచ్చిన ముఖా ముఖిలో తన కొడుకు కాంగ్రెస్ను వీడవద్దని చెప్పినా ఆలకించ లేదు అని వాపొయారు. కాంగ్రెస్ పార్టీ వై కా పా ను విలీనం చెయ్యమంటున్నా తాము దానికి అంగీకరించడం లేదు అని, కేవలం పొత్తుకు మాత్రం సిద్ధం అని చెప్పకనే చెప్పారు. బహుశా జగన్ గారికి ప్రజా రాజ్యం "విలీనం" గుర్తొచ్చి వుంటుంది. 18 శాతం ఓట్లు తెచ్చుకున్న చిరంజీవి పార్టీ ఒక కేంద్ర మంత్రి పదవితో, ముగ్గురు రాష్ట్ర మంత్రి పదవులతో విలీనం కావలసి వచ్చింది. జైలు నుంచి ఇప్పుడప్పుడే బయటపడే మార్గం లేక విక్కీ లీక్స్ లాంటి ఇలాంటి లీకులు కావాలనే రాజకీయ నాయకులు ఇస్తుంటారు. వీటినే "ఫీలర్స్" అంటారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలంటే వై సి పి అవసరం ఎంతైనా వుంది.
చిరంజీవిలా లొంగిపొయెకన్నా శరద్ పవార్ లాగా కాంగ్రెస్ను అంటిపెట్టుకొని కావలసిన మంత్రి పదవి తనకు తన వాళ్ళకు తీసుకుంటూ చీటికి మాటికి బెదిరిస్తూ ఎంచక్కా కాలక్షేపం చెయ్యవచ్చు. అదే పవార్ గారు కాంగ్రెస్ పార్టీలో కొనసాగితే, కుల సమీకరణాలలోనో ప్రాంతీయ సమీకరణాలలోనో లేక విదేయ/అవిధేయత వలననో మంత్రి పదవి ఇంత కాలం దక్కి వుండేది కాదు. అందుకే అంటారు ఏనుగు తోకగా వుండే కన్నా తొండంగా ఉండటమే గౌరవం .
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి