12, మార్చి 2013, మంగళవారం

కర్ణాటక స్థానిక సంస్థలు "హస్త"గతం


ఇటీవల జరిగిన   కర్నాటక రాష్ట్ర గ్రామ పంచాయితీలు, పురపాలక సంఘాలు, జిల్లా పంచాయితీలు మరియు నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ తన ఆధిక్యతను చాటింది.   


నూరు గొడ్లను తిన్న రాబందు ఒక గాలి వానకు నేలకొరిగినట్లు, బళ్ళారి లోని 35 కార్పోరేట్ స్థానాలకు జరిగిన ఎన్నికలలో 26 స్థానాలు కాంగ్రెస్ గెలుచుకోగా, భాజపా కనీసం ఒక్క స్థానాన్ని కూడా దక్కించుకోలేక పొయిన్ది.  గాలి మిత్రుడు శ్రీరాములు స్థాపించిన బి ఎస్ ఆర్ పార్టీ (దీని గుర్తు కూడా సీలింగు ఫానే) కూడా బళ్లారిలో మట్టి కరిచింది .   కనీసం ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న హుబ్లి-ధార్వాడ్ కార్పోరేషన్లో కూడా భాజపా పూర్తి ఆధిక్యం సాధించలెకపొయిన్ది.    మోడీ గారిని ప్రధానిగా చేయడానికి భాజపాకు కర్నాటక చాలా కీలకం.   అలాంటి కీలక రాష్ట్రంలో అంతర్గత కుమ్ములాటలు మితిమీరిన అవినీతి వల్ల భాజపా పరువు పొగొట్టుకుంది. 


యడియూరప్ప కొత్తగా పెట్టిన పార్టీ కర్నాటక జనతా పక్ష తను సొంతంగా అనుకూల ఫలితాలు సాధించలేక పోయినా  భాజపా వోట్లను గణనీయంగా చీల్చడంద్వారా భాజపాను మాత్రం చావుదెబ్బకొట్టి దాదాపు 3వ స్థానానికి నెట్టివేసి ఆ పార్టీకి తన అవసరం ఎంత వుందో తెలియపరచాడు.    కేవలం కొన్ని గ్రామీణ ప్రాంతాలకు మాత్రమె పరిమితమైన జనతాదళ్ కూడా ఈ ఎన్నికలలో అనూహ్యంగా పుంజుకొని తన ఉనికిని చాటుకుంది. 


కేవలం 3 నెలలోపు జరగనున్న రాష్ట్ర శాసన సభ ఎన్నికలలో ఇదే తరహా  ఫలితాలు పునరావృతమయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి.   

1 కామెంట్‌ :

  1. ఈ రోజు భారతీయ ఎన్నికలకి పట్టిన దౌర్భాగ్యమే ఓట్ల చిలిక. ఎవరికీ వారు తమ స్వార్ధ రాజకీయాలకి ప్రజలని బలి చెస్తున్నారు. ఇకపోతే కర్నాటక వ్యవహారం బిజెపి ఇలా కోరి తెచ్చుకొన్న కొరివె. కాంగ్రెస్సుని తిట్టే బిజెపి, కనీసం తమ ముఖ్యమంత్రిని 5 ఏళ్ళు ఉంచాలన్న కనీస పరిజ్ఞానం లేకోవటం, పార్టిలోని కుమ్ములాటలని కాంగ్రెస్సు తరహాలోనే ప్రోత్సాహించటం వల్లనే ఈ దుస్థితి పట్టింది. మన దేశంలో ఏ రాజకీయ పార్టికి భేదం లేదని, అన్ని ఒకేరకం జబ్బుతో బాధపడుతున్నాయని కర్ణాటక బిజెపి నిరుపించింది.

    రిప్లయితొలగించండి