12, మార్చి 2013, మంగళవారం

మో'ఢీ' మన దేశ ప్రధాని పదవికి అర్హుడా!


ప్రస్తుతం మన దేశంలో నడుస్తున్నది సంకీర్ణాల యుగం.  రాబోయే కాలంలో కూడా అదే కొనసాగబోతోంది.    పుట్టగొడుగుల లాగా పుట్టుకొస్తున్న ప్రాంతీయ పార్టీలు దేశంలో  100 దాకా వున్నాయి.  ప్రాంతీయ పార్టీల ప్రధమ ప్రాధాన్యం తమ ప్రాంతం గురించో, రాష్ట్రం గురించో వుంటుంది.    ఏ పార్టీ అధికారంలోకి రావాలనుకున్నా కనీసం డజను ప్రాంతీయ పార్టీల మద్దతు లేకుండా కష్ట సాధ్యం.   


ఇలాంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ గత 9 సంవత్సరాలుగా అనేక ఒడిదుడుకులను, బెదిరింపులను ఎదురుకుంటూ ఎంతో సమన్వయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నది.       భాజపా చెప్తున్నట్లు మోడీ గారు మన ప్రధాని అయితే దేశాన్ని గుజరాత్ లాగా చేస్తాడు అని.     గుజరాత్ లాగా అంటే ఏ విషయంలో?     ఈ మధ్య పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఆర్ధిక సర్వే ఫలితాలలో గుజరాత్ దేశంలో ఎన్నో స్థానంలో వుంది?    జి డి పి లో బీహార్, ఎం పి, మహారాష్ట్ర తరువాతి స్థానం గుజరాత్ కు దక్కిన్ది.   అలాగే గ్రామీణ ప్రాంత ఉపాధి కల్పనలో రాజస్థాన్, మహారాష్ట్ర, ఎం పి, కర్ణాటకల తరువాతి స్థానం గుజరాత్  ది.   వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల జాబితాలో మాత్రం రెండవ స్థానంలో వుంది.   


గుజరాతీయులు వస్తుతహా వ్యాపార నైపుణ్యం కలవారు.    ఈ విషయం, బొంబాయిలో వున్న గుజరాతీయులు ఆ తరువాత గుజరాత్లో వున్న స్థానిక వ్యాపారులు దీనిని రుజువు చేశారు.    అక్కడ అభివృద్ధి కూడా కేవలం పట్టణాలకు మాత్రమే పరిమితం.      ఇప్పటి వరకు మన ప్రధానులుగా చేసిన వారు అత్యంత విద్యావంతులు, మచ్చ లేని వారు, అన్ని మతాలను కలుపుకొని పోయే విశాల దృక్పధం కల వారు.     మన పొరుగు దేశాలతో అంతగా సఖ్యత లేని ప్రస్తుత పరిస్తితులలో మోడీ లాంటి వ్యక్తి ఈ సువిశాల భారత దేశానికి సమర్ధుడైన నాయకుడు కాగలుగుతాడా, అసలు ప్రజలు, రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతారా కాలమే నిర్ణయిస్తుంది. 

4 కామెంట్‌లు :

  1. జి.డి.పీ. రేట్ లో బీహార్, మహారాష్ట్రల తరువాత గుజరాత్ కాదు. బీహార్ జి.డి.పీ. వృద్ది రేట్ లో ముందుంది, కాని జి.డి.పీ లో కాదు. అంటే ఆ రాష్ట్ర పాత జి.డి.పీ లతో పోలిస్తే ఈ సారి వృద్ది ఎక్కువగా ఉంది. గుజరాత్ జి.డి.పీ లో మహారాష్ట్ర కంటే వేనేకే ఉంది. అల్లాగే మన రాష్ట్ర జి.డి.పీ. కూడా బాగానే ఉంది. అందుకు కారణం మన రాష్ట్రాలు పెద్ద రాష్ట్రాలు కావడమే. ఒక రాష్ట్ర అభివృద్ధి చూడాలంటే ఆ రాష్ట్ర తలసరి ఆదాయం, మరియు నిరుపేదల శాతం చూడాలి. అవి ముఖ్యంగా చుస్తే గుజరాత్ ఇతర రాష్ట్రాలకు అందనంత ఎత్తులో (సుమారు తొంబై వేల రూపాయలు)ఉంది. అలాగే పేదల శాతం అన్ని రాష్ట్రాల కంటే చాల తక్కువ ఉంది. మిరనట్టు గా ఉపాది కల్పనలో ఆ రాష్ట్రము వెనక పడలేదు. ఆ రోజు సర్వె వెల్లడించిన ప్రకారం, ఉపాది హామీ పనిదినాలు అధికంగా కల్పించిన రాష్ట్రాల లో మన రాష్ట్రము ముందుంది. మరో ముఖ్య విషయం, గుజరాత్ లో అభివృద్ధి పట్టణాలకు మాత్రమె పరిమితి అయిందనడం. కచ్ లాంటి ప్రాంతాల్లో కూడా గ్రామాలూ అన్ని సౌకార్యాలతో బాగుంటాయి, అది పాడి వాళ్ళ కానియండి, దురలవాట్లు లేకపోవడం వాళ్ళ కానియండి.
    మోడీ పై ఉన్న దురభిప్రాయం పై నేనేమి మాట్లాడను, కాని గుజరాత్ తిరిగిన వాడిగా, అక్కడి రైతులతో, కొన్ని స్వచ్చంద సంస్తలతో పని చేసినవాడిగా నేను చుసిన గుజరాత్, భారత దేశం కంటే చాల ముందుంది.

    రిప్లయితొలగించండి
  2. Dont joke. If BJP says Jai Samaikyandhra, then Modi will also become a hero like Asaduddin Owaisi.

    రిప్లయితొలగించండి
  3. మొదీ ప్రధానిని అవుతాదు అంటే, భాజపా చివరినిమిషంలొ జై సమైక్యాంధ్ర అనడానికి కూద సిద్ధపదచ్చు. అన్ని సీట్లు గెలిపించి అధికారంలొకి తెప్పిచ్చిన రాముణ్ణే కాదనుకున్న వాళ్ళకు తెలంగాన ఒక లెక్కా?

    ఒక ఎం ఎల్ సి అభ్యర్ధిగా ముస్లిం మతస్తుద్ని తెరాసా పొటీకి పెడితే, ఎక్కడ ఓటు అతనికి వెయ్యల్సి వస్తుందొనని ఎన్నికలకు గైర్హాజరు అవుతానని చెప్పిన భాజపా ప్రత్యెక వాదాన్ని ప్రజలు ఎలా నమ్ముతారు.

    రిప్లయితొలగించండి


  4. మోడిగారి ప్రధాని పదవి గురించి రాయదలుచుకోలేదు.కాని గుజరాత్ లో సమర్థుడైన పాలకుడుగా పేరుతెచ్చుకున్నాడు.ఐతే మోడీకి ముందు కూడా గుజరాత్ అభివృద్ధిపథం లోనే ఉంది.దానికి కారణం ప్రభుత్వచర్యలే కాక,గుజరాతీల తెలివి తేటలు,వర్తకవ్యాపారాల్లో వారి నైపుణ్యం.జి.డి.పి . జనసంఖ్య,సంపన్నత బట్టి ఉంటుంది.దానికన్నా పి.సి.ఐ.( వ్యక్తి సగటు ఆదాయం ) ముఖ్యం.అభివృద్ధి గణాంకాలు అన్నీ పరికిస్తే మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో ఒకటిగా ఉంటుంది.ఏ పార్టీ పరిపాలించినా.కాని ,జనాభా,వైశాల్యం ఎక్కువుండుట చేత ప్రాంతీయ భేదాలు,అసమానతలు కొంత ఉన్నవి.ఐతే మనకి వనరులు (resources) కూడా చాలా రాష్ట్రాలకన్నా ఎక్కువే ఉన్నాయి.తెలివితేటలతో,ఐకమత్యంతో ఇంకా కష్టపడి పనిచేస్తే బాగా అభివృద్ధి సాధించగలం.

    రిప్లయితొలగించండి