28, ఫిబ్రవరి 2013, గురువారం

కిరణ్ కుమార్ సమర్దుడే!

మన ముఖ్య మంత్రి గారు రాజకీయాలలో తనదైన ముద్రని నిలుపుకోవడానికి మొదటినుంచి ప్రయతం చేస్తున్నాడు  మరియు విజయం సాధిస్తున్నారు.     మంత్రి వర్గానికి తన  జిల్లాకు చెందిన ప్రత్యర్ధి పెద్దిరెడ్డిని దూరం పెట్టడం ద్వారా ప్రారంభమైన ఈ విజయం శంకర్ రావు గారి దగ్గరే ఆగక పొవచ్చు.   ప్రతిరోజు విమర్శించే డి ఎల్ గారి అభ్యర్ధిని ఆప్కాబ్ ఎన్నికలలో ఓడించి అతన్ని పార్టీలో పలుచన చేసే విషయంలో క్రుతక్రుత్యులైనారు.    బహుశా ఎన్నికలలోపు కడప జిల్లా వరకు ఈ జైత్ర యాత్ర కొనసాగ వచ్చు.      అద్దంకి ఎం ఎల్ ఎ గొట్టిపాటి,  జగన్ కు సన్నిహితమౌతుండటం గమనించి ఆయన గ్రానైట్ గనుల మీద ప్రభుత్వ శాఖల దాడులు జరిగాయి.    శంకర్ రావు కేసులు కూడా దర్యాప్తు జరిగినాయ్.    నల్గొండ సోదరులు కూడా ఆయనకు వ్యతిరేకంగా ఇటీవలి కాలంలో  నోరు మెదపడం లేదు.   మద్దతు ఉపసంహరిస్తామన్న ఒవైసీ సోదరులు చిప్ప కూడు తినాల్సి వచ్చింది.  


మొత్తంగా చూస్తే కాబినెట్ మీద, పార్టీ మీద పట్టు సాధించినట్లే కనిపిస్తున్నది.    ఇంతవరకు ముఖ్యమంత్రి మీద నేరుగా ఎవరు అవినీతి ఆరోపణలు చేసిన దాఖలాలు లెవు.     ఉద్యమాల కాలంలో ఎక్కడ అనవసరంగా మాట తూలకుండా తన పని తాను చెసుకుపొయారు.    ఎన్నో ఉపద్రవాలను తట్టుకొని నిలబడగలిగారు.     పరిపాలనలో గతానుభవం లేకపోయినా, ప్రస్తుత పరిస్తితులలో ముఖ్యమంత్రి సమర్ధతను అభినందించ వలసిన విషయమే.  

3 కామెంట్‌లు :

  1. ఉద్యమాల కాలంలో ఎక్కడ అనవసరంగా మాట తూలకుండా తన పని తాను చెసుకుపొయారు
    -----------------------------------------------
    ఏమిటా తన పని? అదే ఏమిపని పొడిచాడు?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అజ్యాత గారు,

      ఏమీ పొదవక పోయినా ఎవరినీ పొడవ లేదు కదా! మన రాష్త్రంలొ జరిగిన జాతర్లకు వేరొక వ్యక్తి ఐతే, పారిపోయి వుండే వారు.

      బహుశా ఆయన పి వి గారి నుంచి నేర్చుకొని వుండవచ్చు.

      తొలగించండి
  2. ఇది మాత్రం నిజమండి ఊహించని విధంగా నడుపుకుపోతున్నాడు బండిని నిజంగా సమర్థవంతుడైన నాయకుడే...కానీ జనం లొ పూర్వపు ముఖ్యమంత్రులకున్న హడావిడీ చరిష్మా లేదు!అసలు వాటి గురింఛి కిరణ్ గారు పట్టించుకోకూడదు ఎందుకంటే వ్యక్తి ఆధిపత్యం ప్రజాస్వామ్య ప్రభుత్వాలలో ఉండకూడదు ఉంటే వై.ఎస్ మరణానంతరం చూసాముగా ఆ అనవసరపు రాద్ధాంతం!

    రిప్లయితొలగించండి