21, ఫిబ్రవరి 2013, గురువారం

ప్రపంచ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు


నేడు ప్రపంచ మాతృ భాషా దినోత్సవ సందర్భంగా తెలుగు భాషాభిమానులకు మనః పూర్వక శుభాకాంక్షలు.   


తెలుగు భాష మాట్లాడే వారు ప్రపంచ వ్యాప్తంగా షుమారు 18 కోట్ల మంది వున్నారంటే అతిశయోక్తి లేదు.    తమళనాడు జనాభాలో దాదాపుగా 42 శాతం మంది తెలుగు వారే.    మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మొదలు, నటుడు ప్రతిపక్ష నాయకుడు విజయకాంత్,  వైగో లాంటి ఎందరో రాజకీయ నాయకులు తెలుగు మూలాలు కలిగిన వారె.    అక్కడ నాయకర్ అని పిలవబడే వాళ్ళు, నాయుడు అనే పేరు ఉన్న జనాభా, రెడ్డి కులస్తులు కూడా తెలుగు వారె.    వీరిలో చాలామంది చెన్నపట్నం, మధురై, కొయమ్బత్తూర్, తిరువళ్లూర్, కాంచీపురం మొదలైన ప్రాంతాలలో కృష్ణదేవరాయ కాలంలో వలస వెళ్లి స్థిరపడినవాళ్ళె.   


ఇదేకాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల వేర్పాటులో మనం కోల్పోయిన హోసూర్, క్రిష్ణగిరి, గుమ్మిడిపూంది, కోలార్, బళ్లారి, ప్రాంతాలలో తెలుగు వాళ్ళు కోట్లల్లో వున్నారు.    ఒరిస్సా రాష్ట్రంలో కలపబడ్డ బెర్హంపురం సంగతి చెప్పనవసరం లెదు.   ఒక్క కర్నాటక రాష్ట్రంలోనే షుమారు 39 మంది శాసన సభ సభ్యులు తెలుగు మూలాలు కలిగిన వారు వున్నారు.   


11 నుంచి 13వ శతాబ్ద కాలంలో శైవ వైష్ణవ వర్గాల మధ్య గొడవలు మన సమాజంలో చిచ్చు పెడితే, ఇప్పుడు కొంతమంది స్వార్ధ రాజకీయ నాయకులవల్ల తెలుగు వాడి కీర్తి మసకబారుతోంది.    పరాయి దేశస్తుడైన చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ దొర గారు తెలుగు భాష అవసాన దశకు చేరుతున్న సమయంలో మన పురాణేతిహాసాలను సేకరించి తాటాకులకు గ్రంధ దర్పమిప్పించాడు.      


డా॥ గరికిపాటి వారి సాగారఘోషలో చెప్పినట్లు "ఇతరులెల్లరు మెచ్చు భాష, కాని నేడు మనకు మన పిల్లలకు పనికిరాని భాష ....      దయచేసి తెలుగు వారం మన కుటుంబ సభ్యులతో తెలుగులోనే మాట్లాడుదాం, తెలుగును బ్రతికించుకున్దామ్.   

2 కామెంట్‌లు :

  1. "ఇదేకాక, భాషా ప్రయుక్త రాష్ట్రాల వేర్పాటులో మనం కోల్పోయిన హోసూర్, క్రిష్ణగిరి, గుమ్మిడిపూంది, కోలార్, బళ్లారి, ప్రాంతాలలో"

    హోసూర్, బళ్ళారి లాంటి ప్రాంతాలు 1953లోనే వేరు పడ్డాయి. భాషాప్రయుక్త రాష్ట్రాలు ఆ తరువాత మూడేళ్ళకు 1956లో ఏర్పడ్డాయి.

    రిప్లయితొలగించండి
  2. మీరు చెప్పింది నిజం. నేను 1953 1956 కలిపి రాశాను. తప్పును గమనించాను.

    రిప్లయితొలగించండి