3, మార్చి 2014, సోమవారం

సినీ నటులు రాజకీయాల్లో అవసరమా


తెలంగాణా వారి అదృష్టం - ఆ ప్రాంతంలో సినీ నటులూ తక్కువే, వారిలో రాజకీయాలలో ప్రవేశించిన వారు తక్కువే. ఎన్నిచేప్పినా విజయశాంతి ఆంధ్ర ప్రాంతము నుండే వచ్చిందనేది నిర్వివాదం.   బాబు మోహన్ మాత్రం దండయాత్రలు చేస్తున్నాడు.   కానీ తీర ఆంధ్ర ప్రదేశ్లో వోటర్లపై వీరి ప్రభావము చాలా ఎక్కువ.   నాకు గుర్తున్నంతవరకు క్రింది జాబితాలో ఇచ్చిన నటులందరూ ఏదో ఒక రకంగా ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చిన వారే -- 

1) ఎన్ టి ఆర్ 
2) కృష్ణ 
3) కృష్ణం రాజు 
4) విజయ నిర్మల 
5) జమున 
6) ఎ వి ఎస్ 
7) ధర్మవరపు సుబ్రహ్మణ్యం 
8) జీవిత/రాజశేఖర్ 
9) చిరంజీవి 
10) టి సుబ్బి రామి రెడ్డి 
11) రామానాయుడు 
12) రోజా 
13) మోహన్ బాబు 
14) కోట శ్రీనివాస రావు 
15) రావు గోపాల రావు 
16) కొంగర జగ్గయ్య 
17) నాగభూషణం 
18) శివప్రసాద్(తిరుపతి)
19) గిరిబాబు 
20) శివకృష్ణ 
21) నరేష్ 
22) దాసరి నారాయణ రావ్ 
23) జయసుధ 
24) శారద 
25) విజయ్ చందర్ 
26) జయప్రద 
27) కవిత 
28) మురళీ మోహన్ 
29) సుమన్ 
30) శాయి కుమార్ 
31) హరికృష్ణ 
32) బాలకృష్ణ 
32) పవన్ కళ్యాణ్ 

(బ్లాగు చదివే వాళ్ళు ఇంకొన్ని పేర్లు సూచించ వచ్చు) 

సినిమా వారు రాజకీయాలలోకి రాకూడదని నా ఉద్దేశం కాదు.   ఉపాధ్యాయుడు తన బోధనా వృత్తి మాత్రం చేస్తే బాగుంటుంది కానీ, దానితో పాటు జీవిత భీమా ఏజెంట్గా కూడా పని చేస్తేనే సమస్య.  

ఒక్క రామారావు తప్ప మిగిలిన వారికి రాజకీయాలు ఫుల్ టైం కాదు.   తీర సీమాన్ధ్రలో మొదటి నుంచి సినిమాలు చూడడం, నటులపై అవ్యాజమైన ప్రేమ పెంచుకోవడం చాలా ఎక్కువ.   ఈ సినీ అభిమానమే వోట్లుగా రూపాంతరం చెందుతుంది.   

ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రానికి కావాల్సింది ఉన్నత  విద్యావంతులైన నాయకులు.   పదవిని ఒక భూషణంగా కాకుండా సామాజిక బాధ్యతగా చూసే వ్యక్తులు.   ఆంధ్ర రాష్ట్రంలో మన నాయకత్వంలో,  అయితే గుత్తేదారు లేదంటే సినీ రంగం వారు మాత్రమే ఎన్నికలలో ముందుకు వస్తున్నారు.    కొత్తగా ఏర్పడబోతున్న ఆంధ్ర రాష్ట్రానికి ఉన్నత విద్యావంతులు, వ్యాపారాలు లేనివాళ్ళు, పదవిని సమాజ సేవకోసం మాత్రమే వినియోగించే వాళ్ళు అత్యవసరం.   

      

3 కామెంట్‌లు :

  1. నాకు తట్టిన మరి కొన్ని పేర్లు ఇవిగో. జయసుధ (Secunderabad MLA) గారి పేరు కావాలనే చేర్చలేదు.

    23. "ఊర్వసి" శారద, 24. (జయభేరి) మురళీ మోహన్ 25. కైకాల సత్యనారాయణ 26. జయప్రద 27. "కరుణామయుడు" విజయ్ చందర్ 28. "ప్రజా నాట్య మండలి" గుమ్మడి 29. "కలాపోసన" రావు గోపాల రావు 30. "క్లిష్ట పరిస్తితులు" నూతన్ ప్రసాద్ 31. రాజేంద్ర ప్రసాద్

    ఇదే తరహాలో సీమాంధ్ర నుండి రాజకీయాలలో ఉన్న వ్యాపారవేత్తల (పైనున్న జాబితాలో కొందరితో సహా) పేర్లు కూడా తలుచుకుంటే బాగుంటుంది. దాన్ని కూడా విశ్లేషిస్తే కొన్ని నగ్న సత్యాలు బయటపడే అవకాశం లేకపోలేదు.

    రిప్లయితొలగించండి
  2. jayasudha - really i have forgotten her name. rao gopal rao - i have mentioned in my list.
    gummadi, nutan prasad and rajendra prasad - these people were not there in electioneering politics. if we consider these 3 people, we may have to take venu madhav, ali etc., who have campaigned for TDP

    రిప్లయితొలగించండి