18, ఫిబ్రవరి 2014, మంగళవారం

తెలుగు ప్రజలకు శుభాకాంక్షలు


తెలంగాణా ఇచ్చేశారు.  అది కూడా 'మేజువాణి' ఓటుతో ఇచ్చేశారు. తలుపులేసి, బయట ప్రపంచానికి తెలియకుండా ఇచ్చారు కాబట్టి ఇది మూజువాణి కాకుండా మేజువాణి అనడమే సమంజసం.  మరో వింతేమిటంటే, ముగ్గురు స్త్రీలు కలిసి ఈ బిల్లును ఒంటి చేత్తో పరిష్కరించారు.   కాకపొతే ఇందులో ఇద్దరు విద్యాధికులు కాగా  మరొకరిది  వానాకాలం చదువు.   

గత ఆరు నెలల నుంచి విభజన వాదులు సమైక్య వాదులుగా (కొద్ది మంది) సమైక్య వాదులు విభజన వాదులుగా మారారు. బయటికి చెప్పినా చెప్పక పోయినా, భాజపా సీమాంధ్ర ప్రాంత నాయకులు సమైక్యవాదులుగా, సత్తి బాబు & పార్టీ, మాన్యులు డొక్కా గారు, పనబాక గారు, బాల రాజు గారు, కొండ్రు గారు, పుట్టు తెలుగు వారు కాని కేంద్ర అమాత్యులు, రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డి గారు  విభజన వాదులుగా మరారు.     సంతలో వింత ఏమిటంటే, హరీష్ రావు గారు, కె టి ఆర్ గారు  ఎప్పటిలా మాట్లాడే వారి మాట తీరుకు విరుద్ధంగా తెలంగాణాలోని   సీమాన్ధ్రాలకు అభయ హస్తం ఇస్తామనగా, పెప్పర్ రాజగోపాల్ గారు, చక్రవర్తి అశోక్ సామ్రాట్లాగా అస్త్ర సన్యాసం చేసి తెలుగు వారు విడిపోయినా ఐక్యంగా వుండాలని కాంక్షించారు. 

తెలంగాణలో స్థిర నివాసం ఏర్పరచుకున్న ఆంద్ర ప్రాంత ప్రజల పిల్లలు పది సంవత్సరాలు తెలంగాణా ప్రాంతంలో చదివితే సహజంగానే ఆ ప్రాంతంలో వున్న విద్య, ఉద్యోగాలకు అర్హత పొందుతారు.   2012 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు.   ఎన్ని సార్లు అబద్ధం చెప్పినా ఈ సంఖ్య 4.5 కోట్లు కాదు.   ఖమ్మం, నిజామాబాద్, నల్లగొండ, జంట నగరాలు, మహబూబ్ నగర్, మెదక్, రంగా రెడ్డి ప్రాంతాలలో తీర సీమాన్ధ్రులు కొన్ని దశాబ్దాల క్రితమే స్థిరపడి కనీసం 30 నుంచి 40 శాసన సభ్యుల ఎన్నికల ఫలితాలను శాసించే స్థితిలో వున్నారు.    దీనికి చిన్న ఉదాహరణ - మల్కాజ్గిరి పార్లమెంటు, ఖమ్మం పార్లమెంటు స్థానాల గెలుపుపై వివిధ పార్టీలలో వున్నసీమాన్ధ్ర నేతల  విశ్వాసం.   గత పది సంవత్సరాల ఉద్యమాన్ని జాగ్రత్తగా గమనిస్తే, తెలంగాణా ప్రాంతం నుంచి నోరు జారే నాయకులు ఎవరైనా వున్నారంటే, కేవలం 4 నుంచి 5 జిల్లాలకే పరిమితం.   గుత్తా సుఖేందర్ రెడ్డి పెద్దగా నోరు జారడు, ఎందుకంటే నల్గొండ పార్లమెంటు పరిధిలో గణనీయంగా ఆంద్ర ప్రాంత ప్రజలు వున్నారు.  అలాగే ఖమ్మం, మల్కాజ్గిరి, సికిందరాబాద్ మొ॥     ఇహ, జంట నగరాలలో వున్న ఏ పరిశ్రమలోనైనా, కేవలం ప్రతిభ ఆధారంగా వుద్యోగం ఇస్తారు గానీ, వీడు మన జిల్లా వాడనో లేక ప్రాంతం వాడనో ఉద్యోగంలోకి తీసుకోరు.   138 పై చిలుకు కేంద్ర సంస్థలు హైదరాబాదులో వున్నాయి మరి వాటిలో ఉద్యోగాలు తీర సీమాన్ద్రులకు దక్కవా అంటే - ఇది కూడా అవాస్తవం.   అన్ని స్కిల్డ్ ఉద్యోగాలకు దేశవ్యాప్త పరీక్ష ద్వారా మాత్రమే నియామకాలు వుంటాయి.   కాబట్టి ఆందోళన అనవసరం. ఈ విభజన వలన తీవ్రమైన నీటి యుద్ధాలు, అంతర్ రాష్ట్ర పన్నులు ఇరు ప్రాంత ప్రజల మీద తీవ్రంగా పడే ప్రమాదం వుంది.     అత్యంత దుర్భిక్షంతో వున్న రాయల సీమ ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రజలకు మాత్రం ఈ విభజన ఒక అశనిపాతం.   42 మంది సభ్యులతో కేంద్రాన్ని శాసించే స్థితిలో వున్న ఆంద్ర ప్రదేశ్, ఆ స్థానాన్ని కోల్పోయి పలుచన కావడం తధ్యమ్. 

దేశంలోని ఐదు ప్రధాన పట్టణాలతో పోలిస్తే, హైదరాబాదులో నివాసం తక్కువ ఖర్చుతో కూడుకున్నది.  సర్వ హంగులున్న ఈ పట్టణానికి, ధరలు పెరగక ముందే  తీర సీమాన్ధ్రులు అధిక సంఖ్యలో తరలి వచ్చి స్థిర  నివాసం ఏర్పరచుకోవచ్చు. ఆంద్ర ప్రాంతంలో కొంతమంది రాజకీయ నాయకుల గుప్పిటలో నలుగుతున్న రియల్ ఎస్టేట్ భూముల ధరలు ఆకాశాన్ని అంటుకున్న ఈ సందర్భంలో హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకోవడం ఉత్తమం . 

తీర సీమాన్ధ్రకు జరగబోయే అతి  పెద్ద నష్టం ఏదైనా వుంటే మొట్ట మొదటగా అది మత మార్పిడుల రూపంలో వుంటుంది. దేశ వ్యాప్తంగా క్రైస్తవంలోకి మార్పిడి జరిగేది తీర ప్రాంతాలలోనే.  ఈ విభజన వలన,  తిరుపతి ఏడు కొండలలో కొన్ని కొండలను దిగ మింగెయ్యాలని తలపెట్టిన ప్రియతమ నాయకుడి కొడుకు కాంగ్రెస్ సహకారంతో  అధికారం లోకి వచ్చే అవకాశం ఎక్కువ.   ఈ కుటుంబ ప్రాభవం పొందడానికి క్రైస్తవం లోకి బలవంతపు మత మార్పిడులు జరిగే ప్రమాదం వుంది.     

ఏతా వాతా విభజన వలన జరిగే పెద్ద లాభాలు ఏమైనా ఉన్నాయంటే, అవి రెండు మంత్రి వర్గాలు, రెండు చోట్లా రియల్ ఎస్టేటు ముసుగులో ప్రజలను పీడించే బేనామీ రాజకీయ నాయకులు మాత్రమే.   ఈ విభజన ద్వారా కాంగ్రెస్ భాజపాలు కుట్ర పూరితంగా ప్రాంతీయ, ఉప ప్రాంతీయ పార్టీలను దెబ్బ వెయ్యడం ద్వారా రాబోయే రోజులలో ప్రజలకు కేవలం తాము మాత్రమె దీక్కు అన్న సంకేతాన్ని సంయుక్తంగా పంపినట్లైంది. 

మరోసారి 29 వ రాష్ట్రం (అందునా తెలుగు రాష్ట్రం) తెలంగాణాకు శుభాకాంక్షలు!


9 కామెంట్‌లు :

  1. కొందరు వీరతెలంగాణావాదుల నయాసుహృద్భావరాగాలాపనలన్నీ సీమాంధ్రుల శ్రమధనాదులను ఇకముందుకూడా నిరంతరాయంగా అందుకోవాలన్న దుర్బుధ్ధితో మాత్రమే. ఇప్పటిదాకా దొంగలూ ద్రోహులూ ఐన సీమాంధ్రులు హఠాత్తుగా అత్మీయసోదరులై పోయారా వీరికి? వీరి వలలో సీమాంధ్రులు పడే అవకాశం కనిపించటం లేదు. పడకపోతే నిస్సందేహంగా సీమాంధ్ర స్వర్ణభూమి అవుతుంది త్వరలో. సీమాంధ్రులకు అభయ హస్తం రాజ్యాంగం‌ ప్రసాదిస్తుంది. వీరి దయాదాక్షిణ్యాలమీద సీమాంధ్రుల బ్రతుకు ఆధారపడిందన్న పిచ్చిభ్రమలు వీళ్ళు వదిలి పెట్టాలి. బహుశః రాజ్యాంగాన్ని‌ కూడా లెక్కజేయని భస్మాసురహస్తం అండ తమకు ఉందన్న ధీమాతో వస్తున్నాయేమో ఈ నయవాక్యాల ముసుగు వేసుకున్న గర్వోక్తులు.

    రిప్లయితొలగించండి
  2. శ్యామల రావు గారు,

    అయ్యా వందలాదిగా బిడ్డల్ని పోగొట్టుకున్నారు. ఉద్యమంలో ఒక మాట అంటరు ఉద్యమాకారులూ. ఆంద్రొల్లను కొట్టకుంటా తిట్టకుంటా, చంపకుండా, మేం కాపలా వుంటాం అని వారు అంత స్పష్తంగా చెప్తున్నారు కదా.. అర్ధం చేసుకోవాలి మీరు.
    మన బంగారం మంచిదైతే....

    రాజ్యంగం ఏ క్లాజులో ఉంది సార్ సీమాంధ్రులను కొడితే మిలట్రీ వచ్చి రక్షిస్తుందని. గతంలో మన తెలంగానా సోదరులు జె పి గారిని కొడితే ఏ రాజ్యాంగం అడ్డం వచ్చింది? జగ్జీవన్ రాం గారి కూతురి సాక్షిగా కాంగ్రెస్ ఎంపీలనబడే గుండాలు కొంత మంది ఎంపీలను కుమ్మితే (ఇది ఉత్తర భారత దేసం వారి సన్మానం) ఏ రాజ్యాంగం అడ్డం వచ్చింది. ఇంతవరకూ అధికారిక ఫుటేజీకే దిక్కు లేదు. ఏం హైదరాబాదులో మార్వాడీ వాళ్ళు బ్రతకడం లేదా?? ఈ సారి రాజ్యాగం పుస్తకం మార్వాదీల చేతులో పెట్టి అంధ్రా వాళ్ళను తన్నిస్తే, అందుకని, మనం కొడతాం అనే వాళ్ళ రక్షణలో వుందదమే మంచిది.

    రిప్లయితొలగించండి
  3. శ్యామల రావు గారు మీరు సామాన్యులు కాదు బాబూ.... లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ....

    - తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరుకుంటే అదో మహా పాతకం, దేశసమగ్రతకు ముప్పు. తాము కేంద్రాన్ని ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేస్తే అది మాత్రం ఒప్పు.

    - తాము తమిళులు తమ ఉద్యోగాలూ, నీళ్ళూ దోచుకుంటున్నారని ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాడితే అదో పెద్ద గొప్ప విషయం. సరిగ్గా అదే డిమాండ్లతో తెలంగాణవారు ప్రత్యేక రాష్ట్రం కోరితే అది తప్పు.

    - రాష్ట్రంలో తెలంగాణబిల్లును తిరస్కరించే తీర్మానాన్ని అజెండాలో లేకుండా, సభ ఆర్డర్లో లేకుండా ఉండగా ముప్పై సెకన్లలో చదివి గెలిపించుకుంటే ఒప్పు. పైగా ఇది "unchallanged vote" అని ముఖ్యమంత్రి సమర్ధించుకోవచ్చు. అదే కేంద్రం అజెండాలో చేర్చకుండా బిల్లు ప్రవేశపెడితేనే అది పెద్ద తప్పు.

    - తెలంగాణవారు తాము ఒక మార్చ్ చేసుకుంటానంటే అనుమతించక నిర్భందాలూ విధిస్తే కడుపుమండి నాలుగు విగ్రహాలు కూలదోస్తే అది మహాపాతకం. అదే తమ ఉద్యమాల్లో జాతీయనేతల విగ్రహాలను తీరుబడిగా కూలదోస్తుంటే ఒప్పు.

    - తెలంగాణ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటే అదో మహానేరం. అదే తమ ఎంపీలు వీధిరౌడీల్లా ప్రవర్తించి తోటి సభ్యులపై పెప్పర్ స్ప్రే చల్లితే అది ఒప్పు. వీడియోల్లో స్పష్టంగా గాలిలోకి విచక్షణారహితంగా స్ప్రే చేస్తున్నట్లూ, స్పీకర్ పై కూడా స్ప్రే చేసినట్లూ తెలుస్తున్నా కేవలం ఆత్మ రక్షణ అని వాదిస్తారు.

    * అసెంబ్లీలో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోవాలి, కాని పార్లమెంటులో మెజారిటి ప్రతినిధుల అభిప్రాయం తీసుకోకూడదు.

    * అసెంబ్లీ ఆవరణలో ఒక ఎంఎల్ఏ పై ఒక అనామకుడు చెయ్యి చేసుకుంటే ప్రజాస్వామ్యం ఖుని అవుతుంది, కాని సాక్షాత్తు అసెంబ్లీలోనే ఒక ఎంఎల్ఏ ఇంకో ఎంఎల్ఏపై దాడి చేస్తే ప్రజా స్వామ్యం ఉద్దరించబడుతుంది

    * తెలంగాణా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చి ఆ మాట నిలుపుకునే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెసువారు దేశ ద్రోహులు, కాని తెలంగాణా ఏర్పాటు చేస్తాం అని మాట ఇచ్చి ఆ మాట తప్పిన వారు దేశం ముద్దు బిడ్డలు.

    * - సినీనటి శ్రీయను కొందరు అడ్డుకుని "జైతెలంగాణ" అని అనమని బలవంతపెడితే మొత్తం తెలంగాణవాదులందరూ దానికి భాద్యత వహించాలి. అదే నటి తమన్నాను కొట్టినంతపని చేసి "జైసమైక్యాంధ్ర" అనమని బలవంతపెడితే ఎక్కడి దొంగలు అక్కడ గప్‌చుప్.

    - అదుర్స్ సినిమాను నడపకుండా అడ్డుకుంటామనిచెబితే వారు సంఘవ్యతిరేకులు. అదే రాంచరణ్ సినిమా తూఫాన్, మరో అల్లు అర్జున్ సిన్మా విడుదల కానీయకపోతే అది ఒప్పు.

    - తెలంగాణలో సకలజనుల సమ్మె చేస్తే అది విద్యార్థుల చదువులు ఖరాబు చేస్తుంది అని గగ్గోలు ( అందులో సగం దినాలు దసరా సెలవులే అయినా). అదే ఆంధ్రాలో వరసపెట్టి బందులు చేసినా, ప్రభుత్వ పాఠశాలలు నెలలతరబడి నడపక, ప్రైవేటు స్కూళ్ళు మాత్రం నడిపినా అది తప్పుకాదు.

    మీరు సామాన్యులు కాదు బాబూ. లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శ్యామల రావు గారు మీరు సామాన్యులు కాదు బాబూ.... లగడపాటికి తక్కువ, అశొక్‌బాబుకు ఎక్కువ....
      .....

      అయ్యా నేను సామాన్యుడనే. కనీసం‌ పేరుచెప్పుకుండుకు కూడా సిగ్గుపడుతూ అడ్డదిడ్డంగా వ్రాసిన మీరు మాత్రం మాన్యులు కారు సుమా! ఐనా రాజకీయనాయకుల ధోరణిలో మీరు చెలరేగిపోయినా, మీ ఆరోపణలకు సమాధానం ఇవ్వవలసిన అగత్యం లేదు.

      తొలగించండి
  4. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  5. పార్లమెంటులో మెజారిటీ అంటే ములాయం, మమతా మరియు తమిల నాడు వాళ్ళంతా వ్యతిరెకిస్తున్నారు - తెలుసా? బిల్లు వీగి పోయి ఉండేది.

    విభజన వార్త వచ్చినప్పుడు సీమాంధ్ర యెంత ప్రశాంతంగా స్వాగతించింది? ప్రతిపక్ష పార్టీల కన్నా అక్కడా ఇక్కడా అధికారం లోనే ఉన్న కాంగ్రెసు నియంత్రించగలిగి ఉండి కూడా రెండు ముఠాల్ని పోషించింది. రాయల తెలంగాణా కి అడగమని కేంద్రమే సూచించి రెచ్చగొట్టిందని వాళ్ళే చెప్పారు, గుర్తుందా?

    ఇదంతా తెరాసా లో విలీనాన్ని ఒప్పుకోని మధయ అంతరువు నాయకుల్ని మానసికంగా బ్రేక్ చెయ్యడానికి కికురె దగ్గిర్నించి అందరూ కలిసి ఆడిన వికృతమయిన రాజకీయం.సీమాంధ్ర పజలు యెవ్వరూ విభజనని యెప్పుడూ వ్యతిరేకించలేదు. ఈ మొత్తం దుష్ట వ్యవహారా లన్నింటిలోనో కాంగ్రెసు వాళ్ళే తమ అధిష్తానం సూచనల మేరకె ఇలా చేస్తున్నామని చెప్పినా యెవరికీ యెందుకలా చేస్తున్నారో అర్ధం కాలేదా?

    అధిష్టానం మీద కారాలూ నిరియలూ నూరిన కికురె రాజ్యసభ యెన్నికల్లో చాలా ఓపిగ్గా వాళ్ళ నందర్నీ గెలిపించాడు, యెందుకని? మొదట పార్టీ సమావేసంలో కేసీ ఆర్ విలీనానికి వ్యతిరేకంగా మాట్లాడగానే రాయల తెలంగాణా ఝలక్ ఇచ్చింది. నిరాహార దెక్షతో వెనక్కి తగ్గిన వీ హెచ్ యేమన్నాదు? "ఇప్పటికయినా విలీననికి ఒప్పుకఓ. ఒప్పుకోక పోతే యేం చేయాలో మాకు తెలుసు".

    ఇదంతా కాంగ్రెసు దశల వారీగా ఆడిన నాటకం. సంపద అధికారం కవల పిల్లలు. అధికారం ద్వారానే గొప్పవాళ్ళం కాగలమనుకున్న వాళ్ళు దానికోసం చట్టసభల గౌరవాన్నే కాదు, దేన్నయినా యే మాత్రమూ సిగ్గుపదకుండా అమ్మెయ్యగలరు!

    రిప్లయితొలగించండి
  6. యేది యేమయితేనేం, ఒక ఘట్టం ముగిసింది. అందరికీ మంచే జరుగుతుందని ఆశిద్దాం. అటూ ఇటూ కూడా కొంతకాలం పాటు కొత్తకొత్తగా ఉంటుంది, కాని తప్పదు - అలవాటు పడాలి.ప్రతి మనిషీ తను లక్ష్యంగా ఉంచుకోవల్సింది ఒకటే - నిన్నటి కన్నా ఇవ్వాళ, ఇవాల్టి కన్నా రేపు మరింత మెరుగా ఉండాలని.సమాజంలో బతికే మనిషి అతనేంతటి ఉన్నతుదనేది అతన్ కున్న స్నేహితు లెంత మంది అనేది నిర్ణయిస్తుంది కాబట్టి స్నేహ కుసుమాల్ని వికసించనిద్దాం వీలయినంత యెక్కువగా.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. యేది యేమయితేనేం, ఒక ఘట్టం ముగిసింది.
      దురదృష్తవశాత్తూ ఈ ఘోరఘట్టం ఇంకా ముగియలేదు. అటూ ఇటూ కూడా సమయానుకూలంగా మాట్లాడుతూ నాటకం రక్తికట్టుస్తున్న భాజపావారి సవరణలతో కేంద్రం చిక్కుల్లో ఉంది. ఈ సవరణలకోసం మళ్ళా లోక్‌సభకు వెళ్లవలసి వస్తుందనీ, అలా వెడితే ఈ‌ బిల్లు బోల్తా పడుతుందని వారు తెగ ఆందోళనపడుతున్నారనీ వార్తలు వస్తున్నాయి.

      అందరికీ మంచే జరుగుతుందని ఆశిద్దాం.
      ఆశించటంలే తప్పులేదు. అడియాశలో పేరాశలో నిరాశలో దురాశలో రకరకాల ఆశలు మనిషిని ఊరిస్తూ ఉండటమే జీవితం. చూదాం కాలప్రవాహంలో ఎటు కొట్టుకుపోతామో!

      తొలగించండి