28, డిసెంబర్ 2013, శనివారం

చింత చచ్చినా పులుపు చావని మాల్య


(అ)విజయ్ మాల్యా గారు ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం కూడా అర్ధ నగ్న చిత్రాలు  ముద్రించిన క్యాలెండర్లు విడుదల చేశారు.    ఇది ఆయన గారి స్థాయికి ఒక చిహ్నం.   ఇలా ముద్రించిన క్యాలెండర్లను కేవలం ఎంపిక చేయబడిన కొందరికి మాత్రమె ఆయన అందచేస్తారు.  

మన దౌర్భాగమేందంటే, ఇదంతా పన్నులు కట్టే వాళ్ళ డబ్బు మాత్రమే.   విపరీతమైన నష్టాలతో కింగ్ ఫిషర్ విమాన సంస్థ మూతపడ్డ తరువాత ఈయన మీద బాంకుల వాళ్ళు, సప్లైర్లు బోలెడు కేసులు పెట్టారు.బాంకులకే  సుమారు 7000 కోట్లు అప్పులు తీర్చాలి.    జాతీయ బాంకులు వీటిని నిరర్ధక ఆస్తుల కింద (NPA) తెల్చేసాయి.    బాధితులలో వీళ్ళు కాక ఉద్యోగులు, సప్లయర్లు, విమానాశ్రయాల వాళ్ళు, పెట్రోల్ కంపెనీ వాళ్ళు, మిగిలిన సప్లయర్లు కూడా వున్నారు.   కానీ ఆయన మాత్రం రంగు రంగుల సూటు బూటుతో దర్శనమిస్తున్నారు.  

గ్రామాలలో పొలం తాకట్టు పెట్టుకొని బ్యాంకులు  రైతులకు వ్యవసాయ ఋణం ఇస్తారు.   పంట పండినా ఎండినా, తీసుకున్న అప్పును గడువులోపు తీర్చకపోతే పాత కాలంనాటి మహింద్రా రోప్లాస్ జీపులో  గ్రామస్తులందరూ చూస్తుండగా తీసుకొని పోతారు.   కానీ మన కధలో మల్లయ్య లాంటి బడా పారిశ్రామికవేత్తలు మనదేశంలో కోకొల్లలు. అలాంటి వాళ్ళను మాత్రం ఎవ్వరూ ఏమీ చెయ్యలెరు.  దురదృష్టం,  ఆయను గారు స్వతంత్ర అభ్యర్ధిగా రాజ్య సభలో ఆరు సంవత్సరాల పాటు మనకోసం కష్ట పది పని చేసారు కూడా.   అంతే కాదు, లండన్లో వేలం వేస్తున్న టిప్పు సుల్తాన్ గారి కత్తిని కొన్ని కోట్లు వెచ్చించి కొనుక్కొని తన ఇంట్లో అలంకరించు కున్నారు.   ఈయన గారు ప్రభుత్వ బ్యాంకులకు కట్టాల్సిన ధనమంతా మనలాంటి మధ్యతరగతి వాళ్ళు కట్టే ఆదాయపు పన్ను డబ్బులే!   పారిశ్రామిక వేత్తలకిచ్చే అప్పుల విషయంలో, వాటి వసూళ్ళ విషయంలో కఠినంగా వ్యవరించాల్సిన అవసరం వున్ది.      

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి