3, నవంబర్ 2013, ఆదివారం

వెల వెల పోయిన దీపావళి


బెంగలూరు నగరం భిన్న భాషలకు, సంస్కృతులకు నిలయం.  నేను గత పది సంవత్సరాలుగా దీపావళిని ఇక్కడే జరుపుకుంటున్నాను.    కనీసం మూడు రోజులపాటు భయంకరమైన శబ్దాలతో జరుపుకునే ఈ పండుగ ఈ సారి ప్రతి సంవత్సరం వినిపించే శబ్దాలలో కనీసం 50 శాతం కూడా చప్పుడు లేదు.   దీనికి మూడు ప్రధాన కారణాలు - పెరిగిన ధరలు, సమయానికి అందని జీతాలు మరియు కాలుష్యంపై పెరిగిన అవగాహన.    


కొన్నైనా దీపావళి బాణ సంచా కొందామని మార్కెట్కు వెళితే, ఒక పాకెట్ విడి క్రాకర్స్ ధర 215/- చెప్పాడు.   అప్పుడు అర్ధమైంది నగరంలో శబ్ద కాలుష్యం  ఎందుకు తగ్గిందా అని.    బెంగళూరులో చెట్లు ఎక్కువగా వుండటం, పార్థీనియమ్ (కాంగ్రెస్ గ్రాస్ - ఇక్కడ కూడా ఆ పేరు తలనొప్పే), సముద్ర మట్టానికి సుమారు 800 మీటర్ల ఎత్తులో వుండటం, వాయు కాలుష్యం మొదలైన వాటి వలన ఇక్కడ రక రకాల అలర్జీలతో, ఆస్థమాతొ బాధపడే వాళ్ళు ఎక్కువ.   దీపావళి టపాకాయల పుణ్యమా అని గాలిలో గంధకం శాతం ఎక్కువ కావడం మరియు వ్యర్ధ పదార్ధాలు ఎక్కువగా కలవడం వలన అలర్జీతో బాధ పడేవారికి ఈ వారం రోజులు నరకం.   


వీటన్నిటి దృష్ట్యా బాణసంచా ఎంత తక్కువ వినియోగిస్తే అంత వాతావరణ కాలుష్యాన్ని తగ్గించిన వారమౌతాం. తెలుగు ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు.    

కామెంట్‌లు లేవు :

కామెంట్‌ను పోస్ట్ చేయండి