2, సెప్టెంబర్ 2013, సోమవారం

వై ఎస్ లేని లోటు తెలుస్తోంది


వై ఎస్ హెలికాప్టర్ కనుమరుగైన రోజు నేను మా బాస్ తో కలిసి యలహంకలోని ఒక రిసార్టులో భోజనం చేస్తున్నాను.    టి వి తెరపై వస్తున్న వార్తలను చాలా మంది గుంపుగా ఎగబడి చూస్తున్నారు.   ఉత్సాహం కొద్దీ నేనూ చూశాను.   జాడ తెలియని హెలికాప్టర్లో వై ఎస్ ఆర్ ఉన్నాడని, బ్రతికుండే అవకాశం తక్కువనీ ఆ వార్తా సారాంశం .   అప్పటికే ఆయనపై ఆయన గారి కుమారుడిపై చాలా అవినీతి ఆరోపణలు వున్నాయి.   వాటి ప్రభావం వలన నా మనసులో ఏ కోశానా  ఆయనంటే గౌరవం లేదు.   ఆయన చనిపోయిన తరువాత కూడా నేను ఒక్క క్షణం బాధ పడలేదు.   పైగా రోశయ్య గారు అత్యంత సీనియర్ మరియు అవినీతి అంటని నేత ముఖ్యమంత్రి అయ్యాడని సంతోషించాను.   కానీ ఆ తరువాత జరిగిన పరిణామాల నుంచి రాష్ట్రం కోలుకోలేని దెబ్బ తగిలింది.   14ఎఫ్ రద్దుకై క చ రా ఆహార దీక్ష చేస్తే, ఏకంగా చిదంబరం రాష్ట్రాన్నే రాసిచ్చాడు.   ఇది అందరికీ (తెలంగాణా ప్రాంతం వారితో సహా) ఊహించని పరిణామం.       మొట్టమొదటి సారిగా అప్పుడు అనిపించింది ఒక సమర్ధుడు అంతర్దానమైతే ఇన్ని విపరీతాలా అని .  కనీసం కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడే ముఖ్యమంత్రి అయినట్లయితే, ఈ సమస్య ఇక్కడ వరకూ వచ్చి వుండేది కాదు.    అప్పటి వరకు వై ఎస్ ను  ఎదిరించింది కాంగ్రెస్ పార్టీలో కేవలం వి హెచ్, పి  జె ఆర్ (బ్రతికున్న రోజులలో), మరియు యాష్కీలు మాత్రమే.   కానీ రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద నడుస్తుంది అన్నట్లు, అప్పటి వరకూ ఊరూ పేరు తెలియని వాళ్ళు చాలా మంది టి వి మీద ప్రత్యక్షం అయ్యారు.   ఆయనని, ఆయన అవినీతి పనులను దుమ్ము దులపడం మొదలు పెట్టారు.     ఇప్పడు నేను కూడా అనుకుంటాను తెలుగు ప్రజల దురదృష్టం వై ఎస్ చనిపోవడం అని.  


నా స్నేహితుడొకడు ఎప్పుడూ చెప్తుండే వాడు - ఎక్కడ అవినీతి జరుగుతున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్క అని, నిజమే కాబోలు !   ప్రస్తుతం పెద్ద స్థాయిలో అవినీతీ లేదు, అభివృద్ధీ లేదు.   

5 కామెంట్‌లు :

  1. కరీంనగర్ ఉపఎన్నికల్లో.... "రిఫరెండమే" అని బీరాలు పల్కి .... కేసియార్ రెండు లక్షల మెజారిటీతో గెల్చినప్పుడు.... తెలంగాణ వాదం బలంగా ఉన్నదని ఫస్ట్ టైమ్ నిరూపించిందే వై.యస్.
    అప్పుడు పీకిండని .... ఇప్పుడు బతికుంటే.... పీకుతుండె తీయ్!

    రిప్లయితొలగించండి
  2. "...ఎక్కడ అవినీతి జరుగుతున్నదో అక్కడ అభివృద్ధి జరుగుతున్నట్లు లెక్క..."

    May be correct. In Japan numerous Governments were riddled with corruption charges and many PMs had to lose their posts. But country developed. Shall we too support the corrupt fellows!

    What YSR could have done? Nothing, చచ్చిపోయి బతికిపొయ్యాడు అంతే. He lost all his support and somehow came back into power thanks to Chiranjeevi. But for Chiranjeevi, YSR would have lost the election.

    మన రాష్ట్రానికి చిరంజీవి చేసిన ద్రోహం, ఒక పార్టీ పెట్టి ఓట్లు చీల్చి కాంగ్రెస్ మళ్ళి అధికారంలోకి వచ్చేట్టుగా పరోక్షంగా (లేదు కాంగ్రెస్సే అతన్ని పురిగొల్పి ఈ పనిచేయించింది అనే వాళ్ళూ ఉన్నారు) చేసినదే చిరంజీవి. మరి కొన్నాళ్ళకి తన పార్టీని చెంబూ తప్పేలాతో తీసుకెళ్ళి కాగ్రెంస్ లో కలుపుకుని, చాటుమాటుగా కాంగ్రెస్ కవర్ట్ అనుకునే మాటలను నిజం చేశాడు.

    వై ఎస్ బతికి ఉంటే ఈ సమస్య తన ఫాక్షన్ పధ్ధతిలో ఏదో చెయ్యబోయి రాష్ట్రాన్ని మరింత ప్రమాదంలోకి నెట్టేవాడు. చెన్నారెడ్డి హయాంలో మత కల్లోలాలు సృష్టించాడన్న ఆరోపణలు వై ఎస్ మీద ఎందుకు వచ్చాయంటారు!? మోడీ మీద ఇంత అల్లరి చేస్తున్న మీడియా ఇటువంటి విషయాలు మెదలకుండా ఊరుకుంటుంది. తవ్వి తవ్వి ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా యాగీ చెయ్యదు. ఎదుకని! చేసినవాళ్ళు లేదా చేశారని ఆరోపణలు ఎదుర్కునేది కాంగ్రెస్ వాళ్ళు కదా. మీడియా దృష్తిలో కాంగ్రెస్ అంటే రైట్ రాయల్ పార్టీ. అదొక్కటే పరిపాలించటానికి అర్హ్యమైన పార్టీ, మిగిలినవన్నీ ప్రతిపక్షాలు, ఎప్పటికీ ప్రతిపక్షాలే, అధికారంలో ఉన్నా కూడా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు అంటూ వ్రాస్తూ ఉంటారు కొంతమంది నిరక్షరాశ్య మీడియా జీవులు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. >>What YSR could have done? Nothing, చచ్చిపోయి బతికిపొయ్యాడు అంతే.

      సరిగ్గా చెప్పారు సార్, ఎనకటికి ఒక సామెత ఉండేది 'మొన్న సచ్చిపోయిన బర్రె నిన్న పలిగి పోయిన కుండెడు పాలు ఇచ్చేది అని',

      ఇప్పుడు ఆ బర్రె లేదు, ఆ కుండ లేదు విషయం తెలుసుకుందామంటే ...

      తొలగించండి
    2. రాష్త్రానికి చిరుజీవి ద్రోహం చేశాడు అన్న విషయంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయ అనుభవ లేమితో చేశాదని అనుకుందాం. మరి బాబు గారి మాటేమిటి? అంత అనుభవం పెట్టుకుని చక్రం తిప్పలేక పోతున్నాడు.

      తొలగించండి
    3. అడివిలో మానుకూ వస్తాయి ఏళ్ళు అన్నట్టుగా బాబుకు ఉన్న అనుభవం ఏమిటి! మామగారు తెచ్చి పెట్టిన వెలుగులో కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా వెలగటం తప్ప. తనకు తానుగా ఎన్ టి ఆర్ పేరు చెప్పుకోకుండా గెలిచిన ఎన్నిక ఉన్నదా. మళ్ళి బాబు అధికారంలో రావటం అంటూ జరిగితే, అది నెగటివ్ ఓటు వల్ల మాత్రమే అంటే మిగిలిన పార్టీల మీద, ముఖ్యంగా కాంగ్రెస్ మీద "అసహ్యం" వల్లే కాని ఈయనగారి గొప్పతనం, రాజకీయ జ్ఞానం కాని ఈయనగారు ఏదో తవ్వి తలకెత్తుతాడూ అని కానే కాదు. ఏమిటి ఈ బాబుకు ఉన్న రాజకీయ జ్ఞానం, మాట్లాడకుండా ఉండటం, లేదా మాట్లాదితే గోడమీది పిల్లివాటంగా మాట్లాడటం ఇంతేగా. ఈ మాత్రపు తెలివితేటలు పెద్దగా చదువుకోని జిల్లా పరిషత్ రాజకీయ నాయకులు చూపిస్తూనే ఉంటారు. ఇన్నాళ్ళూ ఏదో రాష్ట్రం మొత్తం తనది అన్నట్టుగా ఫోజుపెట్టి, ఇవ్వాళ ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళి మాట్లాడే మాటలు ఏమిటి? మళ్ళి తెలంగాణాలో ఒక్క సీటన్నా గెలుద్దామనే!! ఇక ఎలాగో తెలంగాణా పోనే పోయింది, ఆంధ్ర ప్రాంతాన్ని అన్నా కాపాడుకుందామన్న తాపత్రయం తప్ప ఆయన మాటల్లో పరిణితి చెందిన రాజకీయ నాయకుడు చూపించాల్సిన మెచ్యూరిటీ ఏమీ కనపడటం లేదు. పరిణితి చెందిన రాజకీయ నాయకుడు తేటతెల్లంగా ప్రాంక్ గా మాట్లాడుతాడు కాని ఏ ఏండకు ఆ గొడుగు పట్టే వాణ్ణి చౌకబారు రాజకీయపు మనిషి అనే అనుకుంటారు తప్ప వేరే విధంగా అనుకోవటం జరగదు.

      ఎన్ టి ఆర్ కు రాజకీయ దమ్మున్న రాజకీయ వారసులు లేక కాని, ఎన్టీఅర్ కు ఈ బాబు చేసిన ద్రోహానికి ఎప్పుడో తెలుగు దేశాన్నుంచి తన్ని తగలెయ్యాల్సింది. ఇన్నాళ్టికి హరికృష్ణ ఏదో కొద్దికొద్దిగా కాంగ్రెస్ "కెలుకుడుతో" ఆ దారిలో తనకు చేతనైన ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తున్నది. ఎన్టీఅర్ కు చంద్రబాబు కన్నా ఆయన స్వంత కుటుంబమే ఎక్కువ వెన్నుపోటుపొడిచింది, ఆ దిగులుతోనే దేశానికి ప్రధాని కావాల్సిన ఎన్ టి ఆర్ చాలా బాధ కలిగించే పరిస్థితుల్లో మరణీంచారు.

      తొలగించండి