- రచన శ్రీ ఆదూరి శ్రీనివాస రావు
కలిసిమెలిసి తిరుగుదాం-కలిసిమెలిసి పెరుగుదాం
కలిసిమెలిసికలిమిచెలిమి- బలము గుణముపెంచుదాం
ఆంధ్రమాత బిడ్డలము-అన్నదమ్ములం మనం
అందరమూ ఏకమై -అభివృధ్ధిని చూపుదాం
విడిపోతున్నామన్న,-విరివిగ వర్షాలుపడున!
తెలంగాణవేరైతే -తెలువులు రెట్టింపు అగునా!
రాజకీయరాబందులు ముక్కలు ముక్కలుచేస్తే
కుక్కలు చింపిన విస్తరై-కూడుకూడమట్టిపాలు
వీధివీధినిరసనలు-విభజనపు గుసగుసలు
రాళ్ళురువ్వుకోటాలూ పోలీసులతూటాలూ
హాస్పెటళ్ళమూసివేత -ప్రాణాలతీసివేత,
ఎన్నాళ్ళీకొట్లాటలు-ఎన్నెళ్ళీపోట్లాటలు,
ఆంధ్రజనుల సమస్యలు -ఆంటోనీకేమితెల్సు?'
తీర్పుచెప్పటందుకు -దిగ్విజయాసింగు ఎవరు?
మనమంతాకలసిపోయి-మనసు విప్పి మాట్లాడుదాం
స్వార్ధమున్న సిమ్హాలను -కలిసికట్టుగ వేటాడుదాం,
విడిపోవుటమొదలైతే -విధి కొక్క రాష్ట్రమాయె!
నదులన్నీ విభజిస్తే సెలఏళ్ళుగమారిపోయె!
కలహాలూ పెంచుకుంటె -కాపురాలు తుంచుకుంటె
సాధించేదేమిటన్న సౌభాగ్యం ఎక్కడన్న
కలసిమెలసి తిరుగుదాం-కలసిమెలసి పెరుగుదాం
కలిసిమెలసి కలిమిచెలిమి బలము గుణము పెంచుదాం.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి