1, ఆగస్టు 2013, గురువారం

పదవులకు కాదు - పార్టీలకు రాజీనామా చెయ్యండి


చదవేస్తే వున్న మతి పోయిందిట.   రాజీనామా చేసి పలాయనం చిత్తగించేకన్నా, పార్టీలకు మంత్రి పదవులకు రాజీనామా చేసి శాసన సభలో బిల్లు ప్రవేశ పెట్టినపుడు తమ వాదనను పార్టీ  రహితంగా వినిపించాలి.   నిజంగా బాధ వున్న, బాధ్యత వున్న రాజకీయ నాయకులైతే, ముందుగా తీర సీమాంధ్ర ఎంపీలు మంత్రి పదవులకు పార్టీకి రాజీనామా చేసి, బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టినపుడు వ్యతిరేకంగా వోటు వెయ్యాలి.   మంత్రులు తమ రాజీనామాలను నేరుగా రాష్ట్రపతికి ఇస్తే తక్షణం ఆమోదం తెలపాల్సి వుంటుంది.    ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నట్లు  లేఖ అందచెయ్యాలి.   ప్రజలను మోసం చేసే దృష్టితోనే దగ్గుబాటి వెంకీ రాజీనామా చేశాడు కానీ ఆయన భార్య మాత్రం మంత్రి పదవి వదులుకోదు.   కాటికి కాళ్ళు చాచిన కావూరి మంత్రి పదవి తీసుకొని సి డబ్ల్యు సి కి రాజీనామా చేసినపుడే నాకు అనుమానం వచ్చింది. ఆంధ్ర  ప్రాంత ఏమ్పీలందరికీ ముందే తెలుసు రాష్ట్రం విడిపోనున్నదని.   ఈ విషయం ముందుగా తెలిసీ,    ఇంకా మోసం చెయ్యాలని చూసే వాళ్ళను ప్రజలు క్షమించినా, ఆ ముక్కంటి మాత్రం క్షమించడు.    

4 కామెంట్‌లు :

  1. ఇప్పటికయినా తెలిసిందా మిత్రమా. గీ చిల్లర గాళ్ళ రాజ్యం ఇక మీకే ముబారక్. మేము మా తెలంగాణాలో హాయిగా ఉంటాం. ఉద్యమ స్పూర్తి పుణ్యమా అంటూ ఎ వెధవా మాతో ఆట ఆడలేడు.

    రిప్లయితొలగించండి
  2. జై గారు, మీరు అతి సంతోషంలో వున్నారు.

    రాజకీయ నాయకులు ఎక్కడివారైనా వారి మనస్తత్వం ఒకటే. మూడు పార్టీలలొని నాయకులను తెరాస లోకి తీసుకున్నారు. ఇప్పుడేమో కాంగ్రెస్ తెలంగాణా ఇచ్చింది. టిక్కెట్ల పంపకం రోజు తమాషా, వచ్చే ఆరు నెలలో తప్పక చూస్తారు. పాటలు పాదిన వాళ్ళు, ఎగిరిన వాళ్ళు, దుమికినవాళ్ళు, ఉద్యొగం చెయ్యని ఎంజివో లు, పాఠాలు చెప్పని పంతుళ్ళు, రైళ్ళు తగలబెట్టినవాళ్ళు, గత 20 సంవత్సరాల నుంచి పి జి పేరుతో విశ్వవిద్యాలలో తిష్ట వేసిన వాళ్ళు, పత్రికాస్వేచ్చతో పిచ్చి రాతలు రాసిన అల్లాలు, బెల్లాలు వీళ్ళందరూ టిక్కెత్ల కోసం కొట్లాదతారు. రాజకీయ సమీకరణాలు ప్రతి ప్రాంతంలోను అనూహ్యంగా మారుటుంటాయి. అటు తెలంగాణా ఉద్యమం కానీ ఇటు సమైక్య ఉద్యమం కానీ, నష్టపోయేది మాత్రం సామాన్యుదే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నా ఉద్దేశ్యం మీరు అర్ధం చేసుకోలేదు. తెలంగాణాలో చైతన్యం పెరిగిందనేదే నా వాదన. ఆంధ్రలో కూడా పెరిగితే బాగుంటుంది.

      "ఎగిరిన వాళ్ళు, దుమికినవాళ్ళు, ఉద్యొగం చెయ్యని ఎంజివో లు, పాఠాలు చెప్పని పంతుళ్ళు, రైళ్ళు తగలబెట్టినవాళ్ళు, గత 20 సంవత్సరాల నుంచి పి జి పేరుతో విశ్వవిద్యాలలో తిష్ట వేసిన వాళ్ళు, పత్రికాస్వేచ్చతో పిచ్చి రాతలు రాసిన అల్లాలు, బెల్లాలు": మీరు చెప్పినవన్నీ గత మూడు రోజులలో చూస్తూనే ఉన్నాం. విచిత్రం అల్లా టాంకుబండు విగ్రహాల గురించి పెడబొబ్బలు పెట్టినవారు నెహ్రూ, ఇందిరా & రాజీవ్ విగ్రహాల గురించి మౌనంగా ఉన్నారు. బందుల వల్ల బడిపిల్లలు నష్టపోయారని వాపోయిన పెద్దమనుషులు కనిపించడం లేదు. ఓయూ అన్కల్స్ అంటూ వెక్కిరించిన వారికి ఆదారి కిషోర్ వయసు అక్కరకు రాదు. బీజేపీ కార్యాలయం కాల్చినా అందరూ గమ్మునున్నారు.

      తొలగించండి
  3. సార్‌..మీ వ్యాఖ్యలు ఘాటు గా, స్పష్టం గా ,సూటి గా వున్నాయి.మీ అభిప్రాయాలు అందరిలో ఆలోచన కలిగించాలి.ఎంత ఎక్కువమందికి చేరితే అంత మేలు కలిగే అవకాశం వుంది.
    -శ్రీనివాస మూర్తి,న్యూడిల్లీ.

    రిప్లయితొలగించండి