31, జులై 2013, బుధవారం

అంతర్ రాష్ట్ర సంబంధాలు - కొన్ని రక్షణలు


మంచి చెడులు ఆలోచించకుండా జరిగిన విభజన ఫలితాలు సామాన్యుడ్ని కోలోకోలేని దెబ్బ తీసే ప్రమాదం వుంది. చూడడానికి విషయాలు చిన్నవిగా కనిపించినా దాని దుష్పరిణామాలు అనంతం.    ఉదా : 


వాహనాల రిజిస్ట్రేషన్:   తెలంగాణా మరియు ఆంద్ర ప్రదేశ్ లోనే కాదు, ఒక రాష్ట్రంలో నమోదైన స్కూటర్ కూడా వేరే రాష్టంలోకి ప్రవేశిస్తే, పోలీస్  వెంటబడతాడు.   వాడిని తప్పించుకోవడాని పడే తిప్పలు వర్ణనాతీతం. దేశవ్యాప్తంగా వున్న ఈ చిన్న సమస్యను పరిష్కరించడం పెద్ద విషయం కాదు. వాహన యజమాని కట్టే జీవితకాలపు పన్ను కేంద్ర ఖాతాలోకి తీసుకొని, జనాభా ప్రాతిపదికగా దామాషా పద్ధతిలో రాష్ట్రాలకు ఇవ్వాలి.   ఈ సవరణ కన్నా ముందు, అన్ని రాష్ట్రాలలో వున్న వాహన పన్నుల శాతాన్ని ఒకే రకంగా ఉండేట్లు చూడాలి.   గోవాలో రోడ్ టాక్స్ ఒక రకంగా వుంటే, పాండిచేరిలో మరో రకంగా వుంది.      


మొబైల్స్ : భౌగోళికంగా రాష్ట్రం విడిపోయినంత మాత్రాన రోమింగుగా పరిగణించకుండా, దేశవ్యాప్తంగా రోమింగ్ చార్జీలను రద్దు చెయ్యాలి.  


నీటి ప్రాజెక్టులు : ఇప్పటికే కొంత మేర నిర్మాణం జరిగిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించాలి.   నీటి కేటాయింపులు, భవిష్యత్తులో ఎగువనున్న ప్రాంతంలో కట్టబోయే ప్రాజక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పూర్తి అనుమతితో మాత్రమే జరగాలి.   


ప్రాంతెతరులకు రక్షణ : 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణా జనాభా 3.42 కోట్లు మాత్రమే (నాలుగున్నర కోట్ల అబద్ధాన్ని ఇప్పుడన్నా నిజం చెయ్యండి) .   ఇందులో కనీసం కోటి మంది వరకు తీర సీమాంధ్ర ప్రాంతం నుంచి వెళ్లి స్థిరపడిన వారు ఉండవచ్చు.   రాజధాని పూర్తిగా తరలించిన తరువాత ఈ కోటి మంది ప్రజలకు, వీరి ఆస్తులకు  ప్రమాదం ఏర్పడిన సందర్భంలో, హైదరాబాదును UT గా చేస్తామనే అంశం తప్పకుండా ప్రస్తావించాలి. ఎందుకంటే, ఒక ఉప ప్రాంతీయ పార్టీ గతంలో తెలంగాణా గ్రామ ప్రజలను మభ్య పెట్టి, రాష్ట్రం వస్తే ఆంధ్రోళ్ళ ఆస్తులు మనవే అయిపోతాయనే అపోహ కల్పించింది కాబట్టి.    ఇలాంటి సంఘటనలకు ససాక్షమైన ఉదాహరణ బాన్స్వాడ ఎం ఎల్ ఎ గా గెలిచినా పోచారం శ్రీనివాస్ ఆంధ్రా వాళ్ళు వోట్లు వెయ్యలేదు కాబట్టి తనకు తక్కువ మెజార్టీ వచ్చిందనీ, వాళ్ళ పని పడతామని బెదిరించడం .   


రాబోయే తెలంగాణా రాష్ట్రంలో కూడా, తీర సీమాన్ధ్రులు కనీసం 40 అసెంబ్లీ స్థానాలను ప్రభావితం చేయగలిగిన బలీయమైన వోటు బాంక్ ఉన్నదన్న సత్యాన్ని తెలంగాణా పాలకులు గుర్తుంచుకోవాలి.      

2 కామెంట్‌లు :

  1. "ఇప్పటికే కొంత మేర నిర్మాణం జరిగిన నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కొనసాగించాలి"

    దానికేమి భయపడాల్సిన అవసరం లేదండీ. ఉ. 1956 రాష్ట్రాల పునర్వ్యవస్తీకరణ చట్టంలో సెక్షన్ 108 చూస్తె తెలుస్తుంది.

    "నీటి కేటాయింపులు, భవిష్యత్తులో ఎగువనున్న ప్రాంతంలో కట్టబోయే ప్రాజక్టులన్నీ కేంద్ర ప్రభుత్వ పూర్తి అనుమతితో మాత్రమే జరగాలి":

    నీటి కేటాయింపుకు రెండు మార్గాలు ఉన్నాయి. ఇరు రాష్ట్రాల మధ్య అంగీకారం ఉంటె ఉత్తమం. లేకపోయినా వాటాల పంపిణీతో సహా అన్ని అంతర్-రాష్ట్ర నదీ జలాల వివాదాలను "1956 అంతర్-రాష్ట్ర జల వివాద చట్టం" సెక్షన్ మూడు కింద కేంద్రానికి ఫిరియాదు చేయోచ్చు. ఇరు పక్షాలను సంప్రదింపుల ద్వారా సముదాయించలేకపోతె, కేంద్రం తప్పనిసరిగా ట్రిబ్యూనల్ ఏర్పాటు చేయాలి.

    ఇక ఏ ప్రాజేక్తుకయినా అనేక అనుమతులు అవసరం. అవి లేకుండా ప్రాజెక్టు కడితే కోర్టులను ఆశ్రయించోచ్చు. ఉ. వేదిరి వెంకట్ రెడ్డి కేసులో పులిచింతల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి లేకుండా ప్రాజెక్టు కట్టొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.


    "We dispose of this writ petition with direction to the State Government not to proceed ahead in implementation of the project and not to undertake any construction work, whether preliminary or otherwise, till environmental clearance is obtained"

    రిప్లయితొలగించండి
  2. సార్‌..మీ విశ్లేషణ,మీ లోతైన పరిశీలన ప్రశంసనీయం గా వున్నాయి.మీరు సూచించిన అంశాలను పరిగణన లోకి తీసుకోవలసిన విషయాలు.మీ బ్లాగ్‌ ద్వారా మీరు నిక్ష్పక్షపాతం గా రాస్తున్న అంశాలు ఆలోచింపచేసేవి గా వున్నాయి.
    శ్రీనివాస మూర్తి.న్యూ డిల్లీ.

    రిప్లయితొలగించండి