దక్షిణాదిన మొట్ట మొదటి సారి భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన ఘనత బి ఎస్ యద్యూరప్పకే దక్కుతుంది. అదే విధంగా భాజపాని ఇటీవలి ఎన్నికలలో మూడవ స్థానానికి దిగజార్చిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది.
ఆయన లేని భాజపా కర్ణాటకలో బోసిపోతోంది. మోడీ గారు ప్రధాని కావాలంటే కర్నాటక అత్యంత కీలకం. మూడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధింపబడిన బోహరియా అనే మంత్రివర్యులు గుజరాత్లో అధికారం అనుభవిస్తుండంగా లేనిది, కేవలం 6 వారాలు మాత్రమే జైలులో వున్న యడ్యూరప్ప భాజపాలో వుంటే తప్పేంటి? అధికారంలోకి రావడం అవసరం గానీ, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చూసి చూడనట్లు పోవాల్సిందే. యడ్యూరప్ప గారిని పదవీత్చుడ్ని చేయడంలో కీలక పాత్ర వహించిన అద్వానీకి శత్రువైన మోడీకి అత్యంత ఆప్తుడైన యడ్డీ సహజంగానే మిత్రుడవుతాడు. అతి త్వరలో ఈ ఘట్టం కూడా మనం చూడబోతున్నాం.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి