కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి జన్మదిన వేడుకలు తెలంగాణా ప్రాంత ప్రజలు జరుపుకోకపోయినా తీర ఆంద్ర ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. బహుశా దీనికి రెండు కారణములు ఉండవచ్చు - ఒకటి వారి పూర్వీకులు తీర ప్రాంతం (ఉత్తరాంధ్ర) వారు కాబట్టి ; రెండు - ఈ మధ్య రాష్ట్రంలో కొంచం పరిస్తితులు చక్కబడుతున్న కారణంగా వారికి కృతజ్యతా పూర్వకంగా వేడుకలు జరుపుకొని ఉండవచ్చు. కానీ ఇందులో ఒక అపశ్రుతి దొర్లింది, అదేమిటంటే, కేకును ముక్కలుగా కోసి పంచుకోవడం. శ్రీమతి సోనియా గాంధీ గారు తన పుట్టిన రోజున డిసెంబర్ 9 నాడు రెండుగా కోసిన కేకు తాలూకు ముక్కలు ఇంకా అతుక్కొనే లేదు మళ్ళీ ఇప్పుడు క చ రా గారి పుట్టిన రోజు సందర్భంగా పాపం కుర్రాళ్ళు ఆలోచించకుండా కేకును 3 ముక్కలుగా కోశారు. కేకు బొమ్మ దిన పత్రికలలో వచ్చింది కానీ, కేకు తల భాగం ఎటుపక్క ముక్కలో వుందో కనపడటం లేదు, విధి వైపరీత్యం అంటే ఇదే మరి.
కామెంట్‌లు లేవు :
కామెంట్‌ను పోస్ట్ చేయండి